NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

యాదాద్రి భక్తులకు డ్రెస్‌ కోడ్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..

తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇప్పుడు డ్రెస్ కోడ్ తప్పనిసరి. నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధన జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. కాగా.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆలయంలో ఇప్పటికే ఆలయ ఈవోతో పాటు సిబ్బంది కూడా డ్రెస్‌ కోడ్‌ను పాటిస్తున్నారు. హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. నిత్య కల్యాణం, హోమం, జోడు సేవ, శ్రీసుదర్శన నరసింహ హోమం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించాలని నిబంధన విధించారు.

అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు..

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత వాతావరణశాఖ ఓ కీలక అప్డేట్ ను వెల్లడించింది. బంగాళాఖాతానికి ఈశాన్యాన ఉన్న అండమాన్, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపనాలు మొదటగా తాకుతాయి. ప్రతియేటా మే 18 – 20 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఇప్పుడు కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని స్పష్టం అవుతుంది. ఈ రుతుపవనాలు మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయి. ప్రీ మాన్ సూన్ సీజన్లో తొలి అల్పపీడనం ఏర్పడనుంది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కలదు. దక్షిణ చత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమల మీదుగా సగటు సముద్ర మట్టం నకు 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో ఆగ్నేయ / నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.

మల్లా రెడ్డి భూ వివాదం… భారీ బందోబస్తు మధ్య సర్వే..

మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్థల వివాదంపై విచారణ కొనసాగుతోంది. సుచిత్రలోని 82, 83 సర్వే నంబర్లలోని స్థలానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు సంబంధిత పత్రాలను పరిశీలించారు. భూ సర్వే కూడా చేస్తున్నారు. కాగా, ఎలాంటి వివాదం తలెత్తకూడదనే ఉద్దేశంతో ముందస్తుగా అక్కడ పోలీసులను మోహరించారు. పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వాంగ్మూలం నమోదు చేశారు. అయితే నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయడాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రెవెన్యూ అధికారులను తప్పుబట్టారు. 13 ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చేసి ఆస్తిపన్ను చెల్లిస్తున్నామని చెప్పారు. 2011లో తాను, మల్లారెడ్డి ఈ భూమిని కొనుగోలు చేశానని.. ఆ సమయంలో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. చట్టపరంగా రావాలని కొందరు వివాదం సృష్టిస్తున్నారని వాపోయారు.

వరంగల్‌లో రీజియనల్ ఎయిర్ పోర్టు..?

తెలంగాణలోని వరంగల్‌లో ప్రాంతీయ విమానాశ్రయం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయం. అయితే అది ఏ స్థాయిలో ఉంటుంది? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ విస్తరణకు రూ.1200 కోట్లు ఖర్చవుతుందని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ప్రతిపాదించింది. అయితే అంత ఖర్చు చేయలేమని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏఏఐకి స్పష్టం చేసింది. రూ.500 కోట్లు వరకు మాత్రమే ఖర్చు చేస్తానని ఏఏఐకి పేర్కొంది.

ప్రయాణికులు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

ఐపీఎల్-2024లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హోం టీం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

ఆప్‌, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓటమి పాలవుతుంది..

ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్ళు కన్నయ్యపై దాడులు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓటమి పాలవుతుందన్నారు. 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని.. ఏపీలో ప్రభుత్వం మారుతుందన్నారు. ప్రస్తుతం ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోడీనే అంటూ తీవ్రంగా విమర్శించారు. అవినీతిని ఎన్నిరకాలుగా చేయవచ్చో జగన్ మోహన్ రెడ్డి వద్ద నేర్చుకోవాలని.. చంద్రబాబు నాయుడు బ్రతుకు తెరువు రాజకీయాల కోసమే మోడీతో కలిశారని ఆయన విమర్శలు గుప్పించారు. 97 శాతం రాజకీయాలు డబ్బుతో నడుస్తున్నాయన్నారు. మొట్టమొదటగా రాజకీయాలను డబ్బుతో నడిపించింది చంద్రబాబు నాయుడే అంటూ వెల్లడించారు. గుజరాత్‌లోని ముందనార్ పోర్టు నుంచి గంజాయి, డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు డీజీపీని మార్చక పోతే రాష్ట్రం వల్లకాడు అయ్యేదన్నారు. ఎన్నికల తరువాత పోలీసుల వైఫల్యం వల్లే దాడులు జరిగాయన్నారు. ఓటమి దిశగా ఉన్న వైసీపీ వారు దాడులకు పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణలు చేశారు.

తెలంగాణ కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ!

తెలంగాణ కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సినటువంటి అంశాల ఎజెండాపైనే కేబినెట్ చర్చించాలని సీఈసీ షరతులు విధించింది. జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సినటువంటి అత్యవసర అంశాలు ఆ తేదీ వరకు వేచి ఉండటానికి అవకాశం లేని అంశాలను మాత్రమే చేపట్టాలని కండిషన్ పెట్టింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్ని కల సంఘం షరతులు విధించింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయిన అధికారి ఎవరూ కేబినెట్ సమావేశానికి హాజరు కావద్దని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 18వ తేదీన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయించారు. కానీ సీఈసీ అనుమతి లభించకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా షరతులు విధించి కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్‌ వాసులారా జాగ్రత్త.. రెస్టారెంట్ల తీరు చూడండి..!

వివిధ రకాల రుచికరమైన వంటలకు హైదరాబాద్‌ పెట్టింది పేరు. హైదరాబాద్‌ బిర్యాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి.. ఈ నేపథ్యంలోనే.. ఎన్నో ప్రముఖ వంటశాలలు నగరంలో వెళుస్తున్నాయి. అయితే.. రానురాను వాటిలో నాణ్యత తగ్గిపోవడం శోచనీయం. అయితే.. ఈ క్రమంలోనే.. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం లక్డీకాపూల్ ప్రాంతంలోని తినుబండారాలను తనిఖీ చేసింది, అపరిశుభ్రతను గుర్తించి, లేబొరేటరీకి పంపడానికి నమూనాలను ఎత్తింది. లక్డీకపూల్‌ లోని ‘ రాయలసీమ రుచులు ‘ లో తనిఖీల చేసిన అధికారులకు నల్ల ఈగలు ఎక్కువగా సోకిన 20 కిలోల మైదా, పురుగులు సోకిన రెండు కిలోల చింతపండుతో పాటు, గడువు ముగిసిన అమూల్ పాలను గుర్తించారు.

బుక్‌ చేసిన 24 గంటల్లోనే వాటర్‌ ట్యాంకర్‌

హైదరాబాద్ వాసులు ఇప్పుడు బుకింగ్ చేసిన 24 గంటల్లో వాటర్ ట్యాంకర్ డెలివరీ పొందవచ్చు. బహుళ లాజిస్టికల్ జోక్యాల సహాయంతో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWS&SB) నీటి ట్యాంకర్ డెలివరీ సమయాన్ని రెండు మూడు రోజుల నుండి 24 గంటలకు తగ్గించింది. డిమాండ్ గణనీయంగా పెరగడం వల్ల వేసవి సీజన్ ప్రారంభంలో ట్యాంకర్ డెలివరీ సమయం రెండు నుండి మూడు రోజుల వరకు ఉంటుంది. ఫిబ్రవరిలో, ముఖ్యంగా బోరు బావులపై ఆధారపడిన ప్రాంతాల నుండి బుకింగ్‌ల సంఖ్య పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో 30 వేల మందికి పైగా ట్యాంకర్లపై ఆధారపడి జీవిస్తున్నారు.

రాహుల్ గాంధీది మావోయిస్టు భాష.. మమతా బెనర్జీవి ఓటు బ్యాంకు రాజకీయాలు..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీలపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకపడ్డారు. బెంగాల్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ ఇద్దరు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. షెహజాదా మావోయిస్టు భాష వాడటం వల్ల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ పారిశ్రామికవేత్త అయిన పెట్టుబడులు పెట్టేందుకు 50 సార్లు ఆలోచిస్తారని అన్నారు. ఆ పార్టీ వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. లోక్‌సభ స్థానాలను తమ పూర్వీకుల ఆస్తులుగా ఆ పార్టీ భావిస్తోందని ఆరోపించారు.