యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి.. తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇప్పుడు డ్రెస్ కోడ్ తప్పనిసరి. నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధన జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. కాగా.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆలయంలో…