ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌లో సాంకేతికలోపం.. చివరికీ..
భారత వైమానిక దళానికి చెందిన M17 అపాచీ హెలికాప్టర్ శుక్రవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో జరిగిన నష్టంపై అధికారిక సమాచారం అందలేదు. వాస్తవానికి.. పఠాన్‌కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం అందడంతో ముందుజాగ్రత్తగా బహిరంగ ప్రదేశంలో ల్యాండ్ అయింది. హెలికాప్టర్ దిగుతున్నట్లు చూసిన గ్రామస్థులు సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కానీ భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ప్రస్తుతానికి, అత్యవసర ల్యాండింగ్‌కు గల కారణాలపై వైమానిక దళం లేదా జిల్లా యంత్రాంగం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సంఘటన స్థలంలో ఉన్న సీనియర్ అధికారులు కార్యాచరణ, భద్రతా ప్రోటోకాల్ నేపథ్యంలో వివరణ ఇవ్వడానికి నిరాకరించారు. ప్రజా భద్రతకు లేదా మౌలిక సదుపాయాలకు ఎటువంటి ముప్పు లేదని అధికారులు హామీ ఇచ్చారు.
ఎయిర్ ఇండియా ప్రమాదంలో 1,000°C.. పక్షులు, కుక్కలు కూడా తప్పించుకోలేకపోయాయి.
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని 242 మందితో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం ఢీకొట్టిన క్రాష్ సైట్‌లో మరో 24 మంది మరణించారు. గురువారం మధ్యాహ్నం లండన్‌కి బయలుదేరిన ఎయిరిండియా సంస్థకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం, టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. అయితే, ఈ ప్రమాదంలో క్రాష్ సైట్‌లో కుక్కుల, పక్షుల వంటి ప్రాణాలు కూడా తప్పించుకోలేకపోయాయి. 1.25 లక్షల లీటర్ల ఇంధనం కారణంగా విమానం కూలిపోవడంతోనే అగ్నిగుండాన్ని తలపించింది. క్రాష్ సైట్ వద్ద ఉష్ణోగ్రతలు ఏకంగా 1000 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకున్నాయి. ఈ స్థాయిలో వేడి వల్ల రెస్క్యూ చర్యలకు కూడా ఆటంకం ఏర్పడింది. ఆ ప్రదేశంలో ఉన్న కుక్కలు, పక్షులు కూడా ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాయని రెస్క్యూ సిబ్బంది చెప్పారు. విమాన ప్రమాదంతో ఇంధన ట్యాంక్ పేలడంతో కొద్దిసేపట్లోనే ఉష్ణోగ్రతలు పెరిగాయని, దీనివల్ల ఎవరూ తప్పించుకోలేకపోయారని అగ్నిమాపక అధికారులు చెప్పారు.
బోయింగ్‌ని ముందే హెచ్చరించిన మాజీ ఉద్యోగి.. ఆ తర్వాత అనుమానాస్పద మృతి..
అహ్మదాబాద్ దుర్ఘటనలో ఎయిరిండియా ఆపరేట్ చేస్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో కూలిపోవడంతో విమానంలోని 242 మందిలో 241 మంది మరణించారు. మెడికల్ కాలేజ్ హస్టల్‌పై కూలడంతో 24మమది మెడికోలు మరణించారు. అయితే, ఈ ప్రమాదం తర్వాత బోయింగ్ సంస్థపై వచ్చిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. బోయింగ్ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ అనుమానస్పద మరణించడం, ఆయన బోయింగ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం వంటివి వార్తల్లో ప్రధానాంశాలుగా నిలిచాయి. బార్నెట్ 2024లో సౌత్ కరోలినా చార్టెస్టర్ కౌంటీలోని తన ఇంట్లో మరణించారు. 62 ఏళ్ల బార్నెట్ అనారోగ్య కారణాలతో 2017లో పదవీ విరమణ చేశారు. బోయింగ్ సంస్థలో మూడు దశాబ్ధాలకి పైగా పనిచేశారు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత బోయింగ్‌పై అనేక ఆరోపణలు చేసి, చట్టపరమైన చర్యల్ని ప్రారంభించారు. 2010 నుండి 787 డ్రీమ్‌లైనర్‌ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్‌టన్ ప్లాంట్‌లో క్వాలిటీ మేనేజర్‌గా పనిచేశాడు. ఇప్పుడు ఎయిరిండియా ప్రమాదంలో కూలిపోయింది కూడా ఈ తరహా విమానమే.
విమాన శిథిలాల్లో డీవీఆర్ బాక్స్ లభ్యం.. ఆ రహస్యం బయట పడుతుందా?
అహ్మదాబాద్‌లో నిన్న కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం శిథిలాల నుంచి గుజరాత్ ఏటీఎస్ ఓ డిజిటల్ వీడియో రికార్డర్ (DVR)ను స్వాధీనం చేసుకుంది. ఏటీఎస్ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి దానికి తీసుకెళ్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ అంశంపై అతడిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. “ఈ డీవీఆర్‌ని శిథిలాల నుంచి మేము స్వాధీనం చేసుకున్నాం. ఎఫ్ఎస్ఎల్ బృందం త్వరలో ఇక్కడికి వస్తుంది.” అని సమాధానం ఇచ్చారు. ఇది లభ్యమైనప్పటి నుంచి ఓ ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. డీవీఆర్, బ్లాక్ బాక్స్ ఒక్కటే అని కొందరు భావిస్తున్నారు.
పెళ్లైన 13 ఏళ్లకు బయటపడ్డ భార్య ప్రేమ వ్యవహారం.. పెళ్లి చేసిన భర్త
రానురాను వివాహ బంధానికి విలువ లేకుండా పోతోంది. అప్పటికే పెళ్లై పిల్లలున్నవారు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారు. తమకిష్టమైన వ్యక్తితో కలిసి ఉండేందుకు కట్టుకున్న వారిని కాటికి పంపిస్తున్నారు. కాగా కొందరు భర్తలు తమ భార్యల ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు తెలుసుకుని అతగాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లైన 13 ఏళ్లకు భార్య ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో ఆమె భర్త ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. సొంత భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
నాలుగో ప్రయత్నంలో భర్తని చంపిన భార్య సోనమ్..
గత కొన్ని రోజులుగా హనీమూన్ మర్డర్, సోనమ్ రఘువంశీ దారుణం దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. భర్త రాజా రఘువంశీని హనీమూన్ పేరులో మేఘాలయకు తీసుకెళ్లి హతమార్చింది. తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి ఈ క్రూరమైన ప్లాన్‌ని అమలు చేసింది. రాజను హత్య చేయడానికి ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను నిందితులు నియమించుకున్నారు. మే 23న రాజా మిస్సింగ్ ఘటన వెలుగులోకి రాగా, జూన్ 02న ఆయన మృతదేహాన్ని ఖాసీ కొండల్లో గుర్తించారు. దీని తర్వాత, జూన్ 08న నిందితురాలు సోనమ్ యూపీ పోలీసులు ముందు లొంగిపోవడంతో ఈ మొత్తం మర్డర్ ప్లాన్ వెలుగులోకి వచ్చింది.
న్యాయం కోసం తప్పా నేను దేనికి లొంగను
వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు రైతుల ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచాయి. ప్రస్తుతంగా రైతుల అవసరాలపై, పథకాల అమలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలనకు వస్తే, ప్రభుత్వం రైతుకు తోడుగా నిలుస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. రైతుల రుణ భారం తగ్గించేందుకు పాత రుణాల మాఫీ పూర్తయ్యిందని మంత్రి తెలిపారు. “రైతు బంధు పేరుతో గతంలో అన్ని పథకాలు ఆపేశారు. కానీ ఇప్పుడు అన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి నేరుగా వెళ్లింది రూ.36,000 కోట్లు” అని వెల్లడించారు.
ఇక్రిశాట్ స్కూల్ లో మార్క్ శంకర్ అడ్మిషన్!
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుక్రవారం హైదరాబాద్ పటాన్చెరులో ఉన్న ఇక్రిశాట్ ను సందర్శించారు. ఇక్రిశాట్ ఇంటర్నేషనల్ స్కూల్లో కుమారుడు మార్క్ శంకర్ ను చేర్పించేందుకు పవన్ ఇక్రిశాట్ కు వెళ్లారని అంటున్నారు. ఈమధ్యనే సింగపూర్‌లో అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్‌శంకర్ ను ఇక్రిశాట్ స్కూల్ లో పవన్ కల్యాణ్ చేర్పించనున్నట్లుగా సమాచారం. అన్నా లెజినోవా, పవన్ కల్యాణ్ ల కుమారుడైన మార్క్ శంకర్ సింగపూర్ లో సమ్మర్ కోర్సు చదువుతున్న క్రమంలో స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు చేతులకు స్వల్పంగా గాయలవడమే కాక పొగ పీల్చడంతో శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యాడు. ఈ సంఘటన తర్వాత మార్క్ శంకర్ ను ఇండియాకు తీసుకొచ్చి కూడా వైద్య చికిత్సలు అందించారు. మార్క్ శంకర్ పూర్తిగా కోలుకున్న క్రమంలో ఇండియాలోనే స్కూల్ లో చేర్పించాలని భావించిన పవన్ కల్యాణ్ ఇక్రిశాట్ స్కూల్ లో అతడికి అడ్మిషన్ తీసుకున్నారని సమాచారం. ఆయన లోపలికి వెళ్లినా మీడియాకి మాత్రం అనుమతి నిరాకరించారు.
మైనర్ బాలికను గర్భవతి చేసి.. పెళ్లంటే కులం తక్కువ దానివంటూ..
రాజమండ్రిలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను గర్భవతి చేసి ఓ యువకుడు ముఖం చాటేశాడు. అంతేకాకుండా… కులం తక్కువ దానివంటూ దూషిస్తూ.. ఆ బాలికకు అబార్షన్ చేయించాడు ఆ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. మోరంపూడి ప్రాంతానికి చెందిన పులపర్తి సత్యదేవ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లోబర్చుకొని గర్భవతిని చేశాడు.. 2024 నవంబర్ నెలలో మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ మైనర్ బాలిక 6వ నెల గర్భవతి అని నిర్ధారించారు. ఈ మేరకు పులపర్తి సత్యదేవ వద్దకు వెళ్ళి అమ్మాయిని పెళ్ళి చేసుకోమని బాధితురాలు కుటుంబ సభ్యులు అడిగారు. అయితే నేను ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాను కాబట్టి నేను మాల తీసే లోపులో మీ అమ్మాయికి అబార్షన్ చేయించమని కోరాడు.
తెలంగాణ ప్రజలు అలర్ట్ కావాలమ్మ.. 5 రోజులు భారీ వర్షాలంట..!
తెలంగాణలో వర్షాల హడావుడి మొదలైంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత విస్తరించడంతో వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, ప్రధానంగా దక్షిణ , పశ్చిమ తెలంగాణలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
