Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

అందుకే మంగళగిరిలో చేనేత మహిళకు టికెట్‌ ఇచ్చా..

రాజకీయంగా మంగళగిరిలో చేనేతలు ఎక్కువ.. అందుకే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)తో మాట్లాడిన ఇక్కడ చేనేత మహిళకు టికెట్‌ ఇచ్చాను అన్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా.. ఏపీ: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించిన వైఎస్‌ జగన్‌.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని హెచ్చరించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవాలన్న ఆయన.. బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో బీసీకి టికెట్‌ ఇవ్వకుండా చంద్రబాబు ఫ్యామిలే పోటీ చేస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!

నేడు తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కుంభకోణం జరుగుతుంది. రూ. 1450 కోట్ల కుంభకోణం జరిగిందని ఇందుకు సంబంధించి తాను రెండు రోజుల్లో ఈడికీ, సీబీఐకీ పిర్యాదు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్తీక దీపం సీరియల్ లాగ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తోందని.. తెలంగాణ రాష్ట్రంలో ‘ఆర్ఆర్’ కుంభకోణం జరుగుతుందని మాట్లాడారు. ఇక ‘ఆర్ఆర్’ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అని ఆయన చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డిది స్కీమ్ ల పాలన కాదు, స్కాంల పాలన అంటూ.. వడ్ల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది., ఇచ్చిన డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయో ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. మా పార్టీ హయంలో వడ్లను ఎక్స్ పోర్ట్ చేస్తే.. రేవంత్ రెడ్డి హయాంలో డబ్బులను ఎక్స్ పోర్ట్ జరుగుహుందని ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన వడ్ల కొనుగోలులో జరిగిన అవినీతి పై ఈడి, సిబిఐకి పిర్యాదు చేస్తానని.. నేను ఏం మాట్లాడిన నా పై కేసులు పెడుతున్నారు, అప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది అంటూ ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!

నేడు తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కుంభకోణం జరుగుతుంది. రూ. 1450 కోట్ల కుంభకోణం జరిగిందని ఇందుకు సంబంధించి తాను రెండు రోజుల్లో ఈడికీ, సీబీఐకీ పిర్యాదు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్తీక దీపం సీరియల్ లాగ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తోందని.. తెలంగాణ రాష్ట్రంలో ‘ఆర్ఆర్’ కుంభకోణం జరుగుతుందని మాట్లాడారు. ఇక ‘ఆర్ఆర్’ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అని ఆయన చెప్పుకొచ్చారు.

సాయంత్రం హైదరాబాద్ అభ్యర్థి ప్రకటన.. రేసులో ఎవరున్నారంటే..!

వచ్చే వారమే తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. కానీ ఇప్పటి వరకూ మూడు స్థానాలకు మాత్రం అభ్యర్థుల్ని ఇంకా ఖరారు చేయలేదు. దీనిపై గత కొంతకాలంగా తీవ్ర కసరత్తు చేస్తోంది. శనివారం సాయంత్రం దీనిపై కాంగ్రెస్ సీఈసీ ఒక క్లారిటీ ఇవ్వనుంది. మొత్తం 17 స్థానాలకు గానూ.. ఇప్పటి వరకు 14 స్థానాల్లో అభ్యర్థుల్ని వెల్లడించింది. ఇక హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. సాయంత్రం మాత్రం హైదరాబాద్‌ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌ స్థానం ఎంఐఎంకు కంచుకోట. మళ్లీ మజ్లిస్ నుంచి అసదుద్దీన్ బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక్కడ మాధవిలతను బీజేపీ పోటీలోకి దింపింది. ఇక బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ) బరిలో దింపారు. కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో టెన్నిస్ స్టార్ సానియా మిర్జాను బరిలోకి దింపాలని కాంగ్రెస్ చూస్తోంది. ఈమె పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇక ఖమ్మంలో గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ మంత్రుల బంధువులు బరిలోకి వచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు పోటీ పడుతున్నారు. అలాగే మరో వ్యక్తి పేరు కూడా వినిపిస్తోంది. ఇక కరీంనగర్ సీటుపై కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి.. దానిపై ప్రత్యేకంగా ఫోకస్ అవసరం లేదు..!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండడంతో.. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టినట్టుగా తెలుస్తోంది.. ఇక, పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. పిఠాపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా సమావేశమైన వైసీపీ ఎంపీ, రీజనల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి.. ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి.. దానికోసం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. భీమవరం, గాజువాకలో ఓడిపోవడంతో పవన్ కల్యాణ్‌.. ఇక్కడ కొత్తగా ప్రచారం చేసుకుంటున్నాడన్న ఆయన.. పిఠాపురంలో మా అభ్యర్థి బలంగా ఉంది.. కొత్తగా మేం ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.

విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం.. మరీ చంద్రబాబు..?

రేపు గాజువాక పర్యటనకు వస్తున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైఖరి ఏంటో చెప్పాలనీ జనం నిలదీయాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలు అడిగినా, అడగకపోయినా టీడీపీ సమాధానం చెప్పాలి అని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మా పార్టీ వ్యతిరేకం, పార్లమెంటులో పోరాటం కూడా చేశాం.. కూటమిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు, నాయకత్వం స్టీల్ ప్లాంట్ మీద తమ వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సెంటిమెంటుతో కూడిన సున్నితమైన అంశాన్ని రాజకీయాలు చేయ్యొద్దు అని చెప్పుకొచ్చారు. ఏ పార్టీ ఎవరినైనా అభ్యర్థిగా పెట్టుకోవచ్చు.. కానీ లాబీయిస్ట్ లను తెచ్చి పెట్టుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అని బొత్స సత్యనారాయణ అన్నారు.

ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు పురంధేశ్వరి లేఖ.. వారికి ఎన్నికల విధులు కల్పించొద్దని ఫిర్యాదు..

2024 సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కొన్ని రాజకీయ పార్టీల ప్రభావంతో పలువురు జిల్లా కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు వచ్చే రెండు నెలల పాటు దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవద్దని ఏపీ చీఫ్ ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి లేఖ రాసింది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ సిబ్బంది సాధారణంగా తమ పరిధిలోని దేవాలయాల్లో రోజువారీ పరిపాలనా విధులు నిర్వర్తిస్తారు.. పరిపాలనలో ఏదైనా అంతరాయం ఏర్పడితే భక్తులకు ఇబ్బందులు తప్పవు.. దేవాదాయ సిబ్బంది నిర్వహించే నిర్దిష్ట విధులను ఆపలేము అని ఆమె పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో దేవాదాయశాఖల సిబ్బంది సేవలు అనివార్యం.. దేవాదాయ శాఖ సిబ్బందిని ఎన్నికల విధులకు నియమిస్తే హిందూ మతానికి చెందిన వారి సేవలను మాత్రమే వినియోగించుకుంటున్నారని నిరాధార ఆరోపణలు వస్తాయి.. ఏప్రిల్, మే, జూన్ కాలం ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది.. ఉగాది, శ్రీరామనవమి, చందనోత్సవం, నృసింహ జయంతి, బ్రహ్మోత్సవాలు, గ్రామ దేవత వార్షిక వేడుకలు మొదలైన అనేక పండుగలు వస్తాయని పురంధేశ్వరి పేర్కొనింది.

తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం

తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు సమీపంలోని కాగ్నా నది నుండి త్రాగు నీరు అందించే పంప్ హౌస్ ను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలించారు.

ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని, దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనునిత్యం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలతో అధికారులు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ల మరమ్మతులు వంటివి సకాలంలో చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించడం జరుగుతుందని ఆయన అన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చంద్రబాబు కులాల మధ్య గొడవలు సృష్టించి.. అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్..!

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కుల సమాజాన్ని.. బీసీలను న్యూనతా భావంతో చంద్రబాబు మాట్లాడారు అని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్నాడు.. సమస్యలు వినమని మత్స్యకారులు చెబితే తోలు తీస్తానన్నాడు.. తాను అన్న మాటలను మరిచిపోయి ప్రజలు దగ్గరికి వచ్చి.. ఇప్పుడు సూక్తులు చెబుతున్నాడు.. తన కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలి.. ఇతర పార్టీలతో ఎలా బేరసారాలు చేయాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదు ఆని ఆయన ఆరోపించారు. మాటలు చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్ధాలే.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబు కారణం కాదా అంటూ ప్రశ్నించారు. తగ్గిన రిజర్వేషన్ల నెపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా అంటూ అడిగారు. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఎవరు..? అని వేణుగోపాల కృష్ణ క్వశ్చన్ చేశారు.

చంద్రబాబు కులాల మధ్య గొడవలు సృష్టించి.. అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్..!

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కుల సమాజాన్ని.. బీసీలను న్యూనతా భావంతో చంద్రబాబు మాట్లాడారు అని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్నాడు.. సమస్యలు వినమని మత్స్యకారులు చెబితే తోలు తీస్తానన్నాడు.. తాను అన్న మాటలను మరిచిపోయి ప్రజలు దగ్గరికి వచ్చి.. ఇప్పుడు సూక్తులు చెబుతున్నాడు.. తన కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలి.. ఇతర పార్టీలతో ఎలా బేరసారాలు చేయాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదు ఆని ఆయన ఆరోపించారు. మాటలు చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్ధాలే.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబు కారణం కాదా అంటూ ప్రశ్నించారు. తగ్గిన రిజర్వేషన్ల నెపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా అంటూ అడిగారు. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఎవరు..? అని వేణుగోపాల కృష్ణ క్వశ్చన్ చేశారు.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీపాదరావు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో దివంగత కాంగ్రెస్ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 25వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ అనిల్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నాయకులు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీపాదరావు అని ఆ యన కొనియాడారు. శ్రీపాద రావు ఆశయ సాధనతో పాలన సాగిస్తామన్నారు.

కేటీఆర్ అభినవ గోబెల్స్ లాగా అయ్యారు

కేటీఆర్ అభినవ గోబెల్స్ లాగా అయ్యారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను బీఆర్ఎస్ లోకి రమ్మని ఇబ్బంది పెట్టారని, నా ఫోన్ ట్యాపింగ్ అయిందని కంప్లైంట్ ఇవ్వగానే కేటీఆర్ కి పూనకం వచ్చిందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం నేను ఫిర్యాదు ఇస్తే పరువునష్టం ఎలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. ఇంకా అధికారంలోనే ఉన్నానని కేటీఆర్ అనుకుంటున్నారని, కేటీఆర్ ఇచ్చిన నోటీస్ చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు. కేటీఆర్ నన్ను బెదిరిస్తున్నారని నేనూ ఫిర్యాదు ఇస్తా అని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని, నాకు అనుమానం ఉందని ఫిర్యాదు ఇస్తే కేటీఆర్ పరువునష్టం నోటీస్ ఇచ్చారన్నారు. కేటీఆర్ మాత్రం మా నాయకులపై అనుమానం ఉందని అంటున్నారని, నువ్వు మాత్రం మా లీడర్లపై అనుమానం వ్యక్తం చేస్తావ్ అని ఆయన వ్యాఖ్యానించారు. నాకు, జిట్టా, రఘునందన్ లకు నువ్వు చేసిన మోసం పరిస్థితి ఎంటి? అని ఆయన కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

Exit mobile version