NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ముస్తాబౌతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక

కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక సిద్ధమవుతోంది. సభా వేదిక పనులు దగ్గరుండి అధికారులు, టీడీపీ నాయకులు పరివేక్షిస్తున్నారు. ఈనెల 12వ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభా వేదిక నిర్మాణం వద్ద టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక దళాలతో భారీ బందోబస్తు చేసేలా ప్రణాళిక ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను సీఎస్‌ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఐఏఎస్ లు పర్యవేక్షిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరపల్లి వద్ద గల ఐటీ పార్క్, మేధా టవర్స్ నేషనల్ హైవే పక్కన ఉన్న పొట్లూరి బసవరావు స్థలంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు మంత్రులతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం ‌ఏర్పాట్లపై విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార సభకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ‌అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. . అతిథులుగా వచ్చిన వారికి, సభాస్థలికి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.

కొత్త వాణిజ్య పంటను కనుగొన్న నెల్లూరు రైతులు

నెల్లూరు జిల్లాలో సాగు ఖర్చులు పెరగడం, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వరి, ఇతర ఆహార ధాన్యాలు పండించే చిన్న, సన్నకారు రైతులు జిల్లాలో మెల్లగా వాణిజ్య, ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మెరుగైన నీటిపారుదల సౌకర్యం , కండేలేరు , సోమశిల రిజర్వాయర్ల నుండి పుష్కలంగా నీరు ఉన్నందున, రైతులు కొత్త వాణిజ్య పంటను కనుగొన్నారు, కలబంద, ఔషధ గుణాలు , సౌందర్య సాధనాలలో ఉపయోగించబడుతుంది, ఈ మొక్క తక్కువ నీటితో పెరుగుతుంది కాబట్టి కరువు మండలాల్లో కూడా సాగు చేయవచ్చు. ఉద్యానవన శాఖ కూడా చిన్న , సన్నకారు రైతులను కలబందను పెద్దఎత్తున సాగు చేసేందుకు ప్రోత్సహిస్తోంది.

డాటర్ ఆఫ్ కు బదులు వైఫ్ ఆఫ్.. నలుగురిని బయటకు పంపిన నిర్వాహకులు

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 10 గంటల వరకు అనుమతిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించడంతో అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతి అభ్యర్థిని తనిఖీ చేసిన తర్వాత సిబ్బంది వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. అయితే.. ఆదిలాబాద్ జిల్లా మావల లోని చావర ఆకాడమి సెంటర్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది.గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. ఆధార్ కార్డు లో డాటర్ ఆఫ్ కు బదులుగా వైఫ్ ఆఫ్ ఉన్నందుకు నిర్వాహకులు నలుగురు అభ్యర్ధులను బయటకు పంపారు. గ్రూప్ 1 కు దరఖాస్తు వివాహం జరగక ముందు చేసుకున్నామని ఇప్పుడు వివాహం జరిగింది కాబట్టే వైఫ్ ఆఫ్ ఉందని నిర్వాహకులకు ఎంత చెప్పినా లోనికి అనుమతించేందుకు ససేమిరా అన్నారు.

మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న సూప‌ర్ స్టార్ రజనీ..

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ఆదివారం రాత్రి 7:30 గంటలకు చేయనున్నారు. ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు దేశాది నేతలు, విప‌క్ష నేత‌లు మరెందరో ప్రముకులు హాజరు కానున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి మీడియా ముందు ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. అది గొప్ప విజయం. ఆయనకు నా శుభాకాంక్షలు., ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోడీ శక్తివంతమైన ప్రతిపక్ష పార్టీలని ఎదురుకున్నారు. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి దారి తీస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. త్వరలోనే ఈ విషయాన్ని అప్డేట్ చేస్తానని చెప్పారు.

తెలంగాణ ఎంపీలకు కేబినెట్ లో చోటు.. రాజకీయ ప్రస్థానం ఇదే !

తెలంగాణ నుంచి గెలిచిన ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కింది. సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి గెలుపొందిన బండి సంజయ్ కు పీఎంవో నుంచి సమాచారం అందింది. ఇవాళ సాయంత్రం మోడీతో కలిసి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. గతంలోనూ ఇదే స్థానంలో గెలిచారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.

ముంబై ఎయిర్‌పోర్ట్‌ లో త‌ప్పిన ప్ర‌మాదం.. ఒకే ర‌న్‌వేపై రెండు ఫ్లైట్స్..

ఈ మధ్యకాలంలో తరచుగా విమానాలకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం పరిపాటుగా మారింది. విమానంలో సాంకేతిక లోపాల కారణంగా మంటలు రావడం, లేకపోతే మిగతా సమస్యల వల్ల అనేక విషయాలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా ఓ విమానం ఇంజన్ లో చెలరేగిన మంటల కారణంగా ఎమర్జెన్సీ లాండింగ్ సంబంధించిన ఇన్సిడెంట్ కూడా వైరల్ గా మారింది. ఇకపోతే తాజాగా ముంబై విమానాశ్రయంలో కూడా ఓ పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబై నగరంలోని విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఒకే రన్వే పై నుండి ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ నూతన సమయంలో.. అదే సమయానికి అదే రన్వే పై ఇండిగో విమానం ల్యాండ్ అయింది. ఈ సమయంలో ఎయిర్ ఇండియా ప్రమాదం నుండి బయటపడిందని చెప్పవచ్చు. ఈ సంఘటన శనివారం నాడు చోటుచేసుకుంది.


అజిత్ పవార్‌కి మోడీ షాక్.. కేబినెట్‌లో దక్కని చోటు..

మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఇలా ప్రధానిగా బాధ్యతలు చేపడుతూ మోడీ రికార్డ్ సృష్టించారు. ఈ సారి ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాలకు మోడీ కేబినెట్‌లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన ఇలా ఎన్డీయే మిత్రపక్షాలకు కేబినెట్‌లో చోటు దక్కింది.

ఇదిలా ఉంటే అజిత్ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీకి మాత్రం భారీ షాక్ తగిలింది. ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీకి లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఒకే సీటులో గెలిచింది. ఆ పార్టీ తరుపున సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ గెలిచారు. అయితే, ప్రఫుల్ పటేల్‌కి మోడీ కేబినెట్‌లో చోటు దక్కుతుందని అంతా భావించినప్పటికీ, ఆయనకు సహాయమంత్రి పదవి మాత్రమే ఇచ్చేందుకు బీజేపీ మొగ్గు చూపింది.

నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భావోద్వేగం

నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మను కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన భావోద్వేగానికి గురై… సోము వీర్రాజు కాళ్లకు మొక్కి.. ఆలింగనం చేసుకున్నారు. ఇది ఏపీ బీజేపీ కార్యకర్తల విజయమంటూ శ్రీనివాస్ వర్మ ఆనంద భాష్పాలు రాల్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తా.. గైడ్ చేయండని శ్రీనివాస్ వర్మ సోము వీర్రాజును కోరినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉమాబాలపై 2.76 లక్షల ఓట్ల మెజార్టీతో శ్రీనివాస్ వర్మ ఘన విజయం సాధించారు. గతంలో కూడా శ్రీనివాస వర్మ ఇలానే భావోద్వేగానికి గురయ్యారు. నరసాపురం లోక్‌సభ టికెట్ దక్కినప్పుడు కూడా బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ ఆఫీసు వద్ద నేలపై కమలం గుర్తుపై పడుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. 30 ఏళ్ల కష్టానికి గుర్తింపు దక్కిందని చెప్పుకొచ్చారు. నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్నారు.

ఎన్డీయే నేతలకు జేపీ నడ్డా విందు.. మెనూ ఇదే..

వరసగా ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇందుకు రాష్ట్రపతి భవన్ వేదిక కాబోతోంది. సాయంత్రం 7.15 నిమిషాలకు ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు మోడీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు భారత ఇరుగుపొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, షీసెల్స్, మారిషన్ దేశాలకు చెందిన దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ప్రమాణ స్వీకారానికి ముందే పని ప్రారంభించిన చంద్రబాబు

ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు పని ప్రారంభించారు. వివిధ కీలక శాఖల నుంచి టీడీపీ అధినేత సమాచారం తెప్పించుకుంటున్నారు. కీలకాంశాలపై వరుస రివ్యూలు ఉంటాయని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా సంబంధిత అంశాలపై నిర్లక్ష్యం తగదని చంద్రబాబు తెలిపారు. ప్రమాణ స్వీకారం తరువాత జరిగే రివ్యూలకు సిద్దం అవుతున్నారు కీలక శాఖల అధికారులు. ఇరిగేషన్ అధికారులు పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో నివేదికలు సిద్దం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో ట్రాన్సు కో, జెన్కోలలో పరిస్థితిపై సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు.. రాష్ట్రంలో అనేక చోట్ల కనీసం వీధి దీపాలు వెలగని పరిస్థితిని తెలుసుకుని వెంటనే చక్కదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు.