రాజమౌళి సినిమా కోసం భారీగా ఛార్జ్ చేస్తున్న మహేష్..!!
రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా తో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు పాన్ ఇండియా హీరోలుగా మారారు.ఆ స్థాయి లో ఇప్పుడు మహేష్ బాబు కూడా క్రేజ్ ను దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల యొక్క ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా మహేష్ బాబు తో రూపొందించబోతున్న సినిమా ఉంటుంది అంటూ అభిమానులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు.
రాజమౌళి ప్రతి సినిమాకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూనే ఉన్నాడు. తాజా గా మరోసారి మహేష్ బాబు సినిమా కోసం అంతకు మించి అన్నట్లుగా టెక్నాలజీని తీసుకు వచ్చి విజువల్ వండర్ గా చూపించేందుకు గాను అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ సంస్థతో ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు నటించేందుకు దాదాపుగా రెండు సంవత్సరాల పాటు డేట్లు ఇవ్వడం అయితే జరిగింది.. దాంతో మహేష్ బాబు కు సుమారు వంద కోట్ల పారితోషికం ను నిర్మాతలు ఇవ్వబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరో వైపు మహేష్ బాబు పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటాను అయితే తీసుకోబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి.. వంద కోట్ల పారితోషికంను తన యొక్క వాటాగా పెట్టి సినిమాను నిర్మించబోతున్నారని సమాచారం.
చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారని.. వేరే రాజకీయ పార్టీలపై ఆధారపడుతున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు వేరే పార్టీల అండ కోసం తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. అమరావతిలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి.. ఏపీ పీసీబీ ఏర్పాటు చేసిన స్టాళ్లని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు రెండూ కలిసే వస్తాయని.. అప్పుడే ఎన్నికలకు వెళ్తామని క్లారిటీ ఇచ్చారు. తాము బలంగా ఉన్నామన్న ఆయన.. తమకు వేరే పార్టీల గురించి అనవసరం లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని, జగన్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇక జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గురించి తానేమీ మాట్లాడనని పేర్కొన్నారు.
పంట నష్టం జరిగితే… ఇప్పటి వరకు పరిహారం లేదు
నిర్మల్ సభలో.. కేసీఆర్ ఏదేదో మాట్లాడారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇవాళ పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్.. తెచ్చిన ధరణితో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రద్దు చేస్తాం అన్నం… చేసి చూపిస్తామని ఆయన వెల్లడించారు. పంట నష్టం జరిగితే… ఇప్పటి వరకు పరిహారం ఏమైందని, ఎకరాకు 10 వేలు ఇస్తా అన్నారు… ఇప్పటి వరకు దిక్కు లేదని ఆయన అన్నారు. సీఎంకి సోయి లేదని, కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా..? అని ఆయన ప్రశ్నించారు. కాలగర్భంలో కేసీఆర్ కలిసి పోతారని, బంగాళాఖాతంలో కలిసి పోయేది కేసీఆర్ అని ఆయన అన్నారు.
దక్షిణాది సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేసిన షాహిద్ కపూర్…!!
బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఇండియన్ సినిమా అని ఒకప్పుడు అందరూ చెప్పుకునేవారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల కన్నా దక్షిణాది సినిమాలు చాలా అద్భుతంగా ఉండడంతో దక్షిణాది సినిమాలకు మంచి క్రేజ్ కూడా పెరిగిపోయింది.ఈ క్రమంలోనే ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలు దక్షిణాది సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్ వంటి హీరోలు తెలుగు సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ అయితే తెలుగు సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి ని చూపుతున్నారు.
ఈ క్రమంలోనే మరొక నటుడు కూడా తనకు తెలుగు తమిళ భాషలలో అవకాశాలు వస్తే నటించాలని ఉంది అంటూ దక్షిణాది సినిమాలపై తనకు ఉన్నటువంటి ఆసక్తి మనసులో మాటను బయటపెట్టారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న షాహిద్ కపూర్ తాజాగా బ్లడీ డాడీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు.డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ సినిమా 2011లో వచ్చిన ఫ్రెంచ్ మూవీ స్లీప్ లెస్ నైట్ చిత్రానికి అడాప్షన్ గా తెరకెక్కుతుందని సమాచారం..
హైదరాబాద్ ఇంట్నేషనల్ సిటీ
హైదరాబాద్ ఇంట్నేషనల్ సిటీ అని, రజనీకాంత్ ప్రపంచం అంతా తిరిగారు…హైదరాబాద్ ను చూసి న్యూయార్క్ లా ఉంది అనడం మామూలు విషయం కాదన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఆయన టీ-హబ్‌లో ఐటీశాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వరంగల్ ,కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, బెల్లంపల్లిలలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. ఈ నెల 15 న సిద్దిపేటలో, ఆ తర్వాత నిజామాబాద్, నల్గొండలో ఐటీ హబ్ లు ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ 56 వేల కోట్లు ఉంటే.. 2022 – 2023 లో 2 లక్షల 41 వేల 275 కోట్లు అని ఆయన పేర్కొన్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ నటుడు మృతి
చిత్ర పరిశ్రమకు ఏదో తెలియని శని పట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి.. ఇండస్ట్రీలోని వారు అయితే గుండెపోటు లేదా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే బాలీవుడ్ నటి వైభవి ఉపాధ్యాయ వెకేషన్ నుంచి తిరిగి వస్తుండగా కారు బోల్తా పడి ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఇంకా ఈ ఘటనను అభిమానులు మరిచిపోకముందే మరో ఘోర రోడ్డుప్రమాదంలో నటుడు మృతి చెందాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. పలు మలయాళ సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు కొల్లం సుధీ. తన స్నేహితులతో కలిసి ఆయన వస్తున్న కారు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.
9 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు..
ప్రభుత్వంలోకి వచ్చేందుకు ఆనాడు కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్నా.. ఎన్నికల ముందు కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను 9 ఏళ్లలో ఏఒక్కటే చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష తీర్చేందుకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, కానీ, తెలంగాణ వచ్చాక నీళ్లు, నిధులు, నియామకాలు ఏ ఒక్కటీ ప్రజలకు అందలేదని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ.. ప్రశ్నించే గొంతులను రాష్ట్ర ప్రభుత్వం నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు.
కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్..
కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. మిర్చి లో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పటికీ ప్రభాస్ గురించి ఎవరైనా ఎలివేషన్ ఇవ్వాలంటే .. ఇంతకుమించిన డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు. మొట్ట మొదటి పాన్ ఇండియా హీరోగా టాలీవుడ్ సత్తాను బాహుబలితో ప్రపంచానికి పరిచయం చేసిన ప్రభాస్ .. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ సినిమానే ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ల జోరును పెంచేశారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ఎంతటి సంచలనాలను సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేడు తిరుపతి లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు భారీగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కోసం ఆల్రెడీ అయోధ్య సెట్ ను సెట్ చేసేశారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సమావేశం.. అధికారులకి కీలక ఆదేశాలు
విశాఖపట్టణంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుతం వాటి పరిస్థితులపై సీఎం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, రంగాలకు విశాఖ హబ్ కావాలని సీఎం అన్నారు. దీనికోసం ప్రత్యేక శద్ధ తీసుకోవాలని, దీనివల్ల విశాఖనగరం ఖ్యాతి పెరుగుతుందని, ఐటీకి చిరునామాగా మారుతుందని చెప్పారు. ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
అప్పుడు నేహా.. ఇప్పుడు అనుపమ.. ముద్దు మాత్రం సిద్దుకే
సిద్దు జొన్నలగడ్డ ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. సిద్దు బాయ్ ను ఆ రేంజ్ లో నిలబెట్టింది. ఇక తనకు హిట్ ఇచ్చిన అదే సినిమాకు సీక్వెల్ ప్రకటించి ఔరా అనిపించాడు. టిల్లు స్క్వేర్ పేరుతో ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇకపోతే మొదటి పార్ట్ కు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సీక్వెల్ కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సిద్దు సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.