మరోసారి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్
ప్రీమియం బ్రాండ్ స్మార్ట్‌వాచ్‌లు అద్భుతమైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తాయి. ఇవి యూజర్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేషిస్తుంటాయి. ఏవైనా అనారోగ్యాలను గుర్తిస్తే, అలర్ట్ ఇస్తాయి. ఇప్పటికే యాపిల్ వాచ్‌లు ఇలాంటి హెచ్చరికలతో ఎంతోమంది యూజర్ల ప్రాణాలు నిలబెట్టాయి. అయితే అలాంటి మరో ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. యూఎస్‌లోని విస్కాన్సిన్‌లో యాపిల్ వాచ్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ తన ప్రాణాలను రక్షించే సామర్థ్యాలను మరోసారి నిరూపించుకుంది.
గురువారం తెల్లవారుజామున 4గంటలకు రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డుకు 100 అడుగుల దూరంలో వాహనం తలక్రిందులుగా పడిపోయింది. డ్రైవర్ స్పృహ తప్పి అలానే ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు. అదృష్టవ శాత్తూ యాపిల్ వాచ్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ వెంటనే స్పందించింది. ఆ ఫీచర్ ద్వారా వెంటనే 911 ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ వెళ్లింది. వెంటనే అత్యవసర విభాగానికి చెందిన అధికారులు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు యూనియన్ గ్రోవ్-యార్క్‌విల్లే ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి సహాయాన్ని అభ్యర్థించారు. హెలికాప్టర్ ద్వారా బాధితుడిని తరలించేందుకు ల్యాండింగ్ జోన్‌ను ఏర్పాటు చేశారు. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాపిల్ వాచ్ అతడి ప్రాణాలను కాపాడింది.
పంత్ ఎలా శ్రమిస్తున్నాడో చూడండి.. టార్గెట్ అదే..!
టీమిండియా స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర గాయాలతో బయటపడ్డ పంత్.. మోకాలి లిగమెంట్లు డ్యామేజ్ కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ ప్రమాదం వల్ల రిషబ్ పంత్.. ఐపీఎల్, ఆసియా కప్ టోర్నమెంట్కు దూరంగా ఉండాల్సి వచ్చింది.
రిషబ్ పంత్ సర్జరీ తర్వాత కోలుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. శిక్షణ తర్వాత ఫిట్ నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్న పంత్.. ఫిట్ నెస్ ఒక్కటి సాధిస్తే మునుపటి ఫామ్ ను తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే రిషబ్ పంత్ ఎన్సీఏ(NCA)లో తాను శిక్షణ పొందుతున్న వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా ఆ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘‘సొరంగం చివర కనీసం వెలుగు చూడడం మొదలైనందుకు దేవుడికి ధన్యవాదాలు’’అంటూ తన స్పందన తెలియజేశాడు.
“కంటిశుక్లాల”ను గుర్తించే యాప్.. డెవలప్ చేసిన టీనేజర్..
‘సర్వేంద్రియానం నయనం ప్రధానం’ అంటారు. మనకు ఉన్న ఇంద్రియాల్లో కళ్లు చాలా ముఖ్యమని భావిస్తారు. అయితే చాలా వరకు కంటి జబ్బుల్ని ముందు దశల్లో గుర్తిస్తే చికిత్స చాలా సులభం ఉంటుంది. ముఖ్యంగా కంటి శుక్లాలను ( క్యాటరాక్ట్) కామన్ గా కనినిపించే కంటి జబ్బు. దీనిని తొలిదశల్లో గుర్తించేందుకు లక్నోకు చెందిన ఓ టీనేజర్ ఏకంగా ఓ యాప్ ని కనిపెట్టాడు.
17 ఏళ్ల ఇషాన్ వసంత్ కుమార్ కంటి శుక్లాలను తొలిదశలో గుర్తించేందుకు AI అధారిత యాప్ ‘రోషిణి’ని అభివృద్ధి చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ టెక్నికల్ సపోర్ట్ యూనిటి, స్టడీ హాల్ శనివరాం నిర్వహించిన ఉచిత కంటి తనిఖీ శిబిరాల్లో ఈ యాప్ ని ప్రవేశపెట్టారు. స్టడీ హాల్ స్కూల్ లో 12 తరగతి చదువుతున్న వసంత్ కుమార్ ఈ యాప్ ని నేషనల్ హెల్త్ మిషన్, ఇండియా హెల్త్ యాక్షన్ ట్రస్ట్ తో కలిసి, సంవత్సరం శ్రమించి రూపొందించాడు.
ఈ శిలాఫలకాలు భవిష్యత్ తరాలకు ఓ స్ఫూర్తి…
‘మేరీ మాటీ.. మేరా దేశ్’ కార్యక్రమంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో ఇంటింట తిరిగి మట్టి సేకరించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్‌తో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గోషామహల్ ట్రాఫిక్ (ACP) కార్యాలయం సమీపంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కలు నాటారు అనంతరం దేశంకోసం జీవితాల్ని త్యాగం చేసిన మహనీయులను గుర్తు చేస్తూ వారి నుంచి స్ఫూర్తి పొందుతూ స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం అక్కడినుంచి.. ఇంటింటికీ తిరుగుతూ మట్టిని సేకరిస్తూ గోషామహల్ లోని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు వందేమాతరం రామచందర్ రావు నివాసం వరకు ఈ మట్టి సేకరణ కార్యక్రమం కొనసాగింది. వందేమాతరం రామచందర్ రావు నివాసం దగ్గర వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబసభ్యుల్ని సన్మానించారు. రామచందర్ రావు త్యాగాన్ని వారి స్ఫూర్తిని పోరాటాన్ని వారి సేవల్ని కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా.. మనం గతేడాది, ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని మీ అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు.
ఓయ్ ముద్దపప్పు.. నోరు లేస్తోంది ఏంటి..!
ఓయ్ ముద్దపప్పు.. నోరు లేస్తోంది.. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.. కాస్త నోరు అదుపులో పెట్టుకో’ అంటూ వైసీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో కొత్త ట్రాక్టర్లు పదింటిని భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ. భరత్ మాట్లాడుతూ మిడ్ నైట్ పాదయాత్ర చేసే ముద్ద పప్పు గురించి ఎక్కువ మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోవడం ఇష్టం లేదు అని ఆయన అన్నారు. కాకపోతే ఒకటే హెచ్చరిక అని సీఎం జగన్మోహన్ రెడ్డిపై అవాకులు, చెవాకులు.. కించపరిచే పదాలు వాడితే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎంపీ మార్గాని భరత్ హెచ్చరించారు. ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవలేని నువ్వు ఏ అర్హతతో పాదయాత్ర నిర్వహిస్తున్నావని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ మనుమడు, చంద్రబాబు కొడుకు, బాలకృష్ణ అల్లుడిగా తప్పిస్తే.. ప్రత్యక్ష ఎన్నికలలో ఎప్పుడైనా నెగ్గావా లోకేష్ అంటూ రాజమండ్రి వైసీపీ ఎంపీ ప్రశ్నించారు. మీ నాన్న అధికారంలో ఉండగా అడ్డదార్లలో ఎమ్మెల్సీ, ఆ పదవి పట్టుకుని మంత్రి పదవి వెలగబెట్టావే కానీ..నీకున్న అర్హత ఏమిటని ఎంపీ భరత్ ప్రశ్నించారు.
నా భూమి – నా దేశం నేల తల్లికి నమస్కారం..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వీరులపాడు మండలం పొన్నవరం సొంత గ్రామానికి విచ్చేసిన మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి “నా భూమి -నా దేశం” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ..”నా భూమి – నా దేశం” నేల తల్లికి నమస్కారం.. వీరులకు వందనం అనే ప్రత్యేక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో చేపట్టారని ఆయన సూచించారు. దేశ సంక్షేమం కోసం ప్రాణ త్యాగాలు చేసిన స్థానిక మహనీయులు, సాహసవంతులు, వీరులను స్మరించుకోవాల్సి ఉందని మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. పుట్టుకతో ఈ నేలపై బంధం పెంచుకున్న మనం దేశభక్తి స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాలని ఆయన చెప్పుకొచ్చారు. “నా భూమి- నా దేశం” కేవలం ఒక కార్యక్రమం కాదు దేశ భవిష్యత్తుతో ప్రజలు తాము అనుసంధానం చేసుకునే సాధనమని మాజీ మంత్రి సుజనా చౌదర్ తెలిపారు.
G20 సమ్మిట్ కోసం ఢిల్లీ మెట్రో స్టేషన్ గేట్లు మూసివేత
జీ-20 శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ మెట్రోపై అధికారులు ఆంక్షలు విధించారు అధికారులు. భద్రతా నిర్వహణ దృష్ట్యా కొన్ని స్టేషన్‌లను మూసివేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా.. G20 సమ్మిట్‌కు అవసరమైన భద్రతా ఏర్పాట్ల గురించి DCP (మెట్రో) రామ్ గోపాల్ నాయక్ శనివారం DMRC చీఫ్ సెక్యూరిటీ కమిషనర్‌కు లేఖ రాశారు. దేశ విదేశాల నుంచి నేతలు జీ 20 సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో.. ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఢిల్లీ మెట్రోలోని కొన్ని స్టేషన్‌లను ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూసివేయనున్నారు. దేశ రాజధానిలోని 39 మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు. అందులో మోతీ బాగ్, భికాజీ కామా ప్లేస్, మునిర్కా, ఆర్కే పురం, ఐఐటీ, సదర్ బజార్ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ధౌలా కువాన్, ఖాన్ మార్కెట్, జన్‌పథ్, భికాజీ కామా ప్లేస్ మెట్రో స్టేషన్‌లను సున్నితమైన ప్రదేశాల జాబితాలో ఉంచారు. దీనితో పాటు వేదికకు సమీప స్టేషన్ అయిన సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ పూర్తిగా మూసివేయనున్నారు.
ఒడిపోతా అనే భయంతో నాపై ఇలాంటి తప్పుడు ప్రచారం
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీపై గాంధీభవన్‌లో పోస్టర్ వెలిశాయి. అయితే.. దీనిపి మధుయాష్కీ మాట్లాడుతూ.. గాంధీ భవన్‌లో నాపై వేసిన పోస్టర్ల వెనకాల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం ఉందని, ఒడిపోతా అనే భయంతో నాపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కి ద్రోహం చేసిన వ్యక్తి సుధీర్ రెడ్డి అని, అలాంటి వ్యక్తి ఎంగిలి మెతుకులకు ఆశ పదే వాళ్ళు ఉంటారన్నారు. అలాంటి వారితోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని, కోవర్టుల సంగతి తెలుస్తామని ఆయన హెచ్చరించారు.
ఛీ.. ఛీ.. వీడు అస్సలు మనుషులేనా? మూగ జీవాలను కూడా వదలట్లేదు..
ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలను అమలు చేస్తున్నా కూడా మహిళలపై లైంగిక దాడి జరుగుతూనే ఉంది.. ఇప్పుడు దుర్మార్గులు మూగ జీవాలను కూడా వదిలిపెట్టడం లేదు.. ఒక వ్యక్తి మేకపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి సమీప ప్రాంతం నుంచి మేకను అనుమానస్పదంగా తీసుకెళ్తుండగా చూసిన వ్యక్తి అతడు మేకపై దారుణానికి పాల్పడటం చూసి షాక్ అయ్యాడు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది..
మరో క్రికెటర్ బయోపిక్.. రేపు ట్రైలర్ విడుదల చేయనున్న సచిన్
శ్రీలంక మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో 800 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఎంతవరకు ఇతనికన్న ఎక్కువ వికెట్లు సాధించిన వారులేరు. అయితే తన జీవిత చరిత్ర ఆధారంగా ‘800’ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 5న ముంబైలో రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హాజరవుతున్నారు.
ఈ సినిమాలో మురళీధరన్ పాత్రను ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ పోషిస్తున్నాడు. అక్టోబర్ లో ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండగా.. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఆలిండియా పంపిణీ హక్కులను శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు.
కొంతమంది డిక్లరేషన్ మీద నాటకాలకు తెరలేపుతున్నారు
పాలకుర్తిలో ఎక్కడ కూడా ప్రజలకు మట్టి అంటకుండ మంత్రి దయాకర్ రావు సీసీ రోడ్లు వేసాడని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు. ఇవాళపాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కొంతమంది డిక్లరేషన్ మీద నాటకాలకు తెరలేపుతున్నారని ఆయన మండిపడ్డారు. కానీ ప్రజలు మాత్రం కేసీఆర్‌ను 3వ సారి ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వికలాంగులకు 4 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని ఆయన వ్యాఖ్యానించారు. మేము అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నామని, ఇతరులు అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు.
భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ గుడ్ న్యూస్..
భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. 2030 నాటికి 30,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ని ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్ సందర్శించారు. ఈ సమయంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇది జరిగిన నెల తర్వాత మక్రాన్ ఈ ప్రకటన చేశారు.
భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఐదేళ్ల షార్ట్ టర్మ్ షెంజెన్ వీసాతో సహా అనేక చర్యలను రూపొందించింది. ఇరు దేశాధినేతలు జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ ప్రకటన వచ్చింది. విద్యార్థుల ప్రయోజనం కోసం ఫ్రెంచ్ భాష, ఇతర విద్యా విభాగాల్లో సమగ్ర శిక్షణ అందించే ప్రత్యేక కార్యక్రమం ‘ ఇంటర్నెషనల్ క్లాసెస్’లను ఫ్రాన్స్ ఏర్పాటు చేస్తుందని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం తెలిపింది.
మెట్రోలో అమ్మాయిల ఫ్యాషన్ షో.. ఈసారి ఢిల్లీ కాదు..!
సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం జనాలు ఎంతటిదానికైనా తెగిస్తున్నారు. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా.. కొన్ని ప్రమాదకర వీడియోలను చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం లాంటివి రకరకాల వీడియోలను చేస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఢిల్లీ మెట్రోలో ఇలాంటి సన్నివేశాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కూడా ఓ వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కూడా మెట్రోలో చేసిందే.. ఇంతకీ అది ఎక్కడంటే.
అత్యధిక వివాదాల్లో నిలిచిన ఢిల్లీ మెట్రో పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరితే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఎక్కువగా ఢిల్లీ మెట్రోలో చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా చేసిన వీడియో.. నాగ్‌పూర్ మెట్రోలో. ఇప్పుడు ఢిల్లీ వైరస్ ఇక్కడికి కూడా చేరిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విషయానికొస్తే.. మెట్రోలో కొందరు అమ్మాయిలు ఫ్యాషన్ షో నిర్వహించారు. డిజైనర్ దుస్తులు ధరించిన మహిళల బృందం మెట్రో లోపల ర్యాంప్ వాక్ చేశారు.
పెళ్లి కూతురు పేరు ఏంటి ఇంతుంది.. ఇంత పేరు ఎవరైనా పెట్టుకుంటారా.. ?
సాధారణంగా మనుషులకు పేరు ఎలా ఉంటుంది.. అందరు పిలిచే విధంగా ఉంటుంది. కొంతమంది తాతబామ్మల పేరు కలిసేలా పిల్లలకు పెడతారు. ఇంకొంతమంది దేవుళ్ళ పేర్లు కలిసేలా పెడతారు. మరికొంతమంది ప్రేమించినవారికి మర్చిపోలేక.. తమ పిల్లలకు వారి పేర్లు పెట్టుకొని ఆనందిస్తుంటారు. ఇక్కడవరకు అందరికి తెల్సిందే. ఒక అమ్మాయి పేరు ఎలా ఉంటుంది.. ఉదాహరణకు లక్ష్మీ.. పోనీ మహాలక్ష్మీ.. వీర వెంకట మహాలక్ష్మీ.. ఇలా ఉంటుంది. పూర్తి పేరు చెప్పమంటే.. దాదాపు రెండు మూడు పేర్లు కలిసేలా చెప్పడం చూసాం కానీ.. ఇక్కడ మనం చెప్పుకుంటున్న పేరు చూస్తే.. ఒక పేరా అవుతుంది. ఏంటి అంత పెద్ద పేరునా.. ? అంటే .. నిజం.. అంతే పెద్ద పేరు.. ఆ పేరు ఏంటో తెలుసా.. “వీర వెంకట సత్య నాగలక్ష్మి దుర్గా వాసవీ లలితా పార్వతి రాణి సీతా కామాక్షి మాణిక్య కాళీ అచ్యుత భైరవీ ఆకాంక్ష” ఏంటీ .. పేరు చెప్తాను అని శ్లోకం చెప్తున్నారు.. అని అనుకోకండి.. మీరు చదివేది పేరునే.
