NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

పార్లమెంట్ లో ఒక సీటు ఇవ్వండి.. కాంగ్రెస్ ని కోరిన సీపీఐ

పార్లమెంట్ లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ ని అడుగుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. కార్మిక సంఘాల్లో బలంగా ఉన్నామన్నారు. కానీ బలానికి అనుకూలంగా ఓటు రావడం లేదని తెలిపారు. పార్టీని పెంచుకోవాలని నిర్ణయించామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పని చేస్తామన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి కాంగ్రెస్ అని తెలిపారు. పార్లమెంట్ లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ ని అడుగుతున్నామని అన్నారు. నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, పార్లమెంట్ సీట్లలో బలం మాకు ఉందన్నారు.

కాంగ్రెస్‌ గూటికి వైఎస్‌ షర్మిల.. ఇలా స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, మరికొందరు సీనియర్‌ నేతల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు.. ఇక, కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా.. ఆంధ్రలో అయినా.. అండమాన్‌లో అయినా పనిచేస్తానని ప్రకటించారు. అయితే, వైఎస్‌ షర్మిల.. కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. ఇక, ఈ వ్యవహారంపై వైసీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుంది.. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీన నిర్ణయం తీసుకుందన్నారు. షర్మిల తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ, ఎలాంటి సంబంధం లేదన్నారు.

లోక్ సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఎన్డీయే కూటమిలో లుకలుకలు

మహారాష్ట్రలో రెండు రాజకీయ కూటల మధ్య పొత్తుల పోరు కొనసాగుతుంది. ఒకవైపు అధికార బీజేపీ-శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ వర్గం)ల కూటమి ఉండగా.. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్-శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ వర్గం)ల కూటమిలు ఉంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇరు కూటములలోని భాగస్వామ్య పార్టీలు సీట్ల విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. మహావికాస్ అఘాడీల గొడవ బహిరంగంగా కొనసాగుతుండగా.. అధికార కూటమి మధ్య మాత్రం అంతర్గత పోరు కొనసాగుతుంది.

పవన్ కల్యాణ్‌ ఎన్ని సమీక్షలు చేసినా ఓడిస్తా.. ద్వారంపూడి సవాల్‌

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మార్పులు చేర్పులు చేస్తుండగా.. కాకినాడ అసెంబ్లీ సీటు వ్యవహారం తేలాల్సి ఉంది.. అయితే, మరోసారి పవన్‌ కల్యాణ్‌కు సవాల్‌ చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాకినాడ నుంచి నాపై పోటీ చేయమని గతంలోనే పవన్ కి సవాలు చేశాను.. కనీసం గ్లాస్ గుర్తు అయినా నా మీద పోటీ పెట్టమని కోరుతున్నాను అన్నారు. ఇక, పవన్‌ కల్యాణ్‌ ఎన్ని రివ్యూలు చేసుకున్న ఓడిస్తానంటూ ఓపెన్‌ ఛాలెంజ్‌ చేశారు. నా మీద గాజు గ్లాస్ పోటీ ఉంటుందని అనుకుంటున్నాను.. అలా లేకపోతే గతంలో పవన్ కల్యాణ్‌ చేసిన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించారు. గత పర్యటనలో మూడు రోజులు ఉండి నేను చేసిన సవాల్‌కు స్పందించలేదన్నారు. మరోవైపు.. టికెట్ వచ్చినా.. రాకపోయినా జగన్ కోసమే పని చేస్తాను.. ఆ కుటుంబానికి ఎప్పుడు విధేయతతో ఉంటాం అన్నారు. ఇక, నా సీటును త్వరలోనే ప్రకటిస్తారు అని తెలిపారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి.

అయోధ్య ప్రారంభానికి అద్వానీ ని అందుకే పిలవడం లేదు.. మోడీ పై నారాయణ

మోడీ గ్రాఫ్ తగ్గ కూడదు అని.. అద్వానీని పిలవడం లేదని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ పై.. సీపీఐ పరిస్థితి, తిట్టపోతే అక్క కూతురు, కొట్టపోతే కడుపుతో ఉంది అన్నట్టు ఉందని వ్యంగావస్త్రం వేశారు. బీజేపీ పార్లమెంట్ పై దాడి ని ఉద్దేశ్య పూర్వక డ్రామా చేసిందని మండిపడ్డారు. జనవరి 22 న అయోధ్య ప్రారంబించి ఓట్లు దండుకోవాలని బీజేపీ ప్లాన్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. అద్వానీ లేకుండా బాబ్రీ కూల్చలేదా..? అని ప్రశ్నించారు. ఆయన్ని ఉద్దేశపూర్వకంగా అద్వానీ ని రామ మందిరం ప్రారంభోత్సవం కి రావద్దని చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ గ్రాఫ్ తగ్గ కూడదు అని.. అద్వానీ ని పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదాని మీద ఈగ వాలినా..మోడీ..అమిత్ షా కి నష్టం అని తెలిపారు. కాబట్టి ఆదానిని కాపాడే పనిలో ఉన్నారని అన్నారు. కేంద్రం దేవుణ్ణి..క్రిమినల్ ఆక్టివిటీ ఉన్న వాళ్ళను పక్కన పెట్టుకోవాలని చూస్తుందని తెలిపారు. ఏపీలో బీజేపీ.. చంద్రబాబు కలిసి పోటీ చేయాలని చూస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి బలపరిచే లా రాజకీయాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఏ పార్టీలో చేరాలన్నది షర్మిల ఇష్టం.. నిన్నటి వరకు తెలంగాణలో ఉన్నారు.. ఏం మాట్లాడుతారో చూడాలి

ఏ పార్టీలో చేరాలన్నది వైఎస్‌ షర్మిల ఇష్టం.. నిన్నటి వరకు ఆమె తెలంగాణాలో ఉన్నారు.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. ఏం మాట్లాడుతారో చూడాలి అన్నారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌.. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదని స్పష్టం చేశారు.. తన నియోజకవర్గ మార్పు, తాజా రాజకీయ పరిస్థితులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వెల్లంపల్లి.. పార్టీకి క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తను.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని తెలిపారు. 15 ఏళ్లుగా విజయవాడ వెస్ట్ నుంచే పోటీ చేస్తున్నాను.. ఇప్పుడు నియోజకవర్గం మారాలంటే కొంత బాధగానే ఉంటుందన్న ఆయన.. సీఎం వైఎస్‌ జగన్‌.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బాధ్యత ఇచ్చారు.. వచ్చే ఎన్నికల్లో నేను, మల్లాది విష్ణు కలిసి సెంట్రల్ లో వైసీపీ జెండా ఎగరేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.

అయ్యప్ప భక్తులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్… బస్సుల షెడ్యూల్‌ ఇలా..

అయ్యప్ప భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త అందించింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 5 నుంచి ఈ సర్వీసు ప్రారంభం కానుందని.. అయ్యప్ప భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా టీఎస్‌ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసిందని, వాటిని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సమయం, టికెట్ ధరను కేటాయించినట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉంటామన్నారు.

ఇటీవల అయ్యప్ప భక్తులు ఇబ్బంది ఎదుర్కొన్న సందర్భంగా టీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు. ఇక చార్జీలు విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి శబరమల వెళ్లే ప్రతి ప్రయాణికుడికి రూ. 13,600 చొప్పున వసూలు చేస్తారు. ఈ ప్యాకేజీలో భాగంగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా అందించనున్నట్లు తెలిపింది.  జనవరి 5న అంటే శుక్రవారం నాడు లహరి బస్సు MGBS నుండి బయలుదేరుతుందని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.

వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

రజక, నాయీ బ్రాహ్మణుల‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రజక, నాయీ బ్రాహ్మణుల‌కు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు, హెయిర్ కటింగ్ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. వాషర్ మెన్ లో లబ్ధిదారుల సంఖ్య 76,060 కి 78.55 కోట్లు, నాయి బ్రహ్మణ లకు 36,526 మంది లబ్ధుదారులకూ సంబంధించిన 12.34 కోట్ల రూపాయలను 03.01.2024 నాటి వారికీ డిస్కం లకి బకాయిలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే.. ఆర్థిక శాఖ బడ్జెట్‌ను విడుదల చేయాలని బీసీ మంత్రిత్వ శాఖ అభ్యర్థించబడిందని ఆయన వెల్లడించారు. లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు మరియు హెయిర్ కటింగ్ సెలూన్‌లకు విద్యుత్ సరఫరాను డిస్‌కనెక్ట్ చేయవద్దని బీసీ మంత్రిత్వ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రజక, నాయి బ్రాహ్మణ ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సెలూన్ లకి, లాండ్రి, ధోబీ ఘాట్ లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరు.. ఎవరు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమానుగతంగా తప్పకుండా అమలు చేస్తుందని హామినిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్ ..

తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్ అని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మోసగాడు అని అందరు మోసగాళ్లు అనుకుంటే ఏట్లా కేటీఆర్‌ అని జీవన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. నెల రోజులోనే హామీలని అమలు చేయలేదని కాంగ్రెస్ 420 అని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ మొదటగా దళితులని మోసం చేసారని ఆయన వ్యాఖ్యానించారు. దళితులకు మూడు ఎకరాల భూమి అని మరోసారి మోసం చేసారని, మీరు ఇచ్చిన హమీలని ఒకసారి నెమరవేసుకోండి కేటీఆర్‌ అని జీవన్‌ రెడ్డి చురకలు అంటించారు. 9 సంవత్సరాల్లో నగరంలో తప్ప ఎక్కడైన ఇళ్ళు కట్టారా ..? అని ఆయన ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళకు ఉచిత బస్ ప్రయాణం కలిపించామని ఆయన వెల్లడించారు. మేము ఇచ్చిన హమీలని నెరవేర్చడానికి మూడు వారాలనే దరఖాస్తులు తీసుకుంటున్నామని, గిరజనులని, దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ అని జీవన్‌ రెడ్డి మండిపడ్డారు.

బీసీల కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు..

బీసీల కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని, టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని జాతీయ బీసీ అధ్యక్షుడు ,రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య చెప్పారు. విజయవాడలో బీసీ సంఘం సమావేశంలో ఆయన ప్రసంగించారు. 45 సంవత్సరాలుగా బీసీల కోసం లోక్ సభ, రాజ్యసభలలో పోరాటం ఫలితం ఈ రోజు దొరికిందని ఆయన పేర్కొన్నారు. బీసీ యువకులు అధికార, సంపదకు తావు లేకుండా బీసీల జాతి అభివృద్ధికి పనిచేయటం ఆనందంగా ఉందన్నారు.

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాజకీయ పరిణామాల్లో ముఖ్యమైన పరిణామంగా , ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో ఏర్పడిన ఖాళీల కారణంగా రెండు ఎమ్మెల్సీ పదవులు పోటీకి తెరలేవడంతో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జనవరి 11న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో వ్యూహాత్మక పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా శాసన మండలిలో ప్రాతినిధ్య చైతన్యాన్ని కూడా రూపొందిస్తాయి.

ప్రజల తీర్పును బాధ్యతారాహిత్యంగా చేశారు కాబట్టే కాంగ్రెస్‌కి పట్టం కట్టారు

కొత్త సంవత్సరంలో ప్రజలతో పాటు.. మా ప్రతిపక్ష సభ్యులు కూడా బాగుండాలన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2018లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తర్వాత.. అసెంబ్లీ సమావేశాలు పెట్టారన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. ప్రజల తీర్పును బాధ్యతారాహిత్యంగా చేశారు కాబట్టి.. కాంగ్రెస్ కి పట్టం కట్టారని, ప్రజల తీర్పు గౌరవిస్తూ 48 గంటల్లో రెండు గ్యారంటీలు అమలు చేశామన్నారు. ఆరున్నర కోట్ల మంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వసతి కల్పించామని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతల తీరు.. నవ్విపోదురు గాకా.. నాకేంటి సిగ్గు అన్నట్టు ఉందని మంత్రి శ్రీధర్‌ బాబు ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలను చూస్తుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది.. జాలి వేస్తోందన్నారు. అధికారం వాళ్ళకే సొంతం.. ఇంకా ఎవరు పాలించొద్దు అనే ధోరణి లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓటమి తర్వాత.. ప్రజల నాడీ అర్థం చేసుకుంటాం అని అనుకున్నామని, కానీ వారి వ్యవహారం మాత్రం మారలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలపై ఓ బుక్ తీశారు.. దానిపై మా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నామన్నారు.