మేం బీసీల ఐక్యత కోరుకుంటున్నాం.. వారికి అండగా ఉంటాం..
జనసేన బీసీ కులాల ఐక్యత కోరుకుంటోంది.. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకటించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంక్షేమంపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ల పేరుతో వైసీపీ బీసీ కులాలను విడదీస్తోందని విమర్శించారు.. కార్పొరేషన్ల ద్వారా బీసీలకు స్టిక్కర్ అతికించుకోవడం తప్ప బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదన్న ఆయన.. స్టిక్కర్లు వేసుకుని టోల్ గేట్ల వద్ద గొడవ పడటానికి కార్పొరేషన్లు ఉపయోగ పడ్డాయని ఎద్దేవా చేశారు.. నవరత్నాల పేరుతో బీసీలకు తీరని అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు.. ఏ పథకం కావాలని అడిగినా.. నవరత్నాల్లో ఇచ్చేస్తున్నాం అని ప్రభుత్వం చెబుతోంది. బీసీ సాధికారిత కలిగే విధంగా జనసేన గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని.. బీసీలంతా సామాజిక, ఆర్ధిక అభివృద్ధి సాధించాలనేది పవన్ కల్యాణ్ ఆలోచనగా చెప్పుకొచ్చారు మనోహర్.
బీజేపీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి..? ఇలా స్పందించిన సోము వీర్రాజు
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. అప్పటికే ఆయన బీజేపీ అగ్రనాయకత్వంలో మాట్లాడారని.. జాతీయ స్థాయిలో ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని.. అన్ని సెట్ అవుతే.. త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.. అయితే, చిత్తూరులో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కిరణ్ కుమార్ రెడ్డి ఇష్యూపై స్పందించారు.. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికను స్వాగతించిన సోము వీర్రాజు.. ఎవరు వచ్చినా స్వాగతిస్తాం అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చురుకైన నాయకుడు.. కిరణ్ చేరిక రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి దోహదపడుతుంది. అతనికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు సోము వీర్రాజు.
15 నుంచి ఇంటర్ పరీక్షలు.. అధికారులకు సీఎస్ ఆదేశాలు.. ఇవి ఉండాల్సిందే..!
ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గర పడింది.. ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 15వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయి.. అయితే, ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు తగిన ఫస్ట్ ఎయిడ్ కిట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. 20-25 పరీక్షా కేంద్రాలకు కలిపి ఒక 108 అంబులెన్స్ సేవలను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ఆయా రూట్లలో తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు సీఎస్. ఇక, పరీక్షలు జరిగే సమయంలో ప్రశ్నాపత్రాలు లీకేజి లేదా మాల్ ప్రాక్టీస్ వంటి వదంతులు సృష్టించి విద్యార్థులను ఆందోళనలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి.. అలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు సీఎస్ జవహర్ రెడ్డి. జిల్లా, రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల పరిధిలో పరీక్షలు జరిగే తేదీల్లో జిరాక్స్ కేంద్రాలు, ఫొటో కాపీయింగ్ కేంద్రాలను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. అదే విధంగా పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. అంతేకాకుండా తగినన్ని మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
అందుబాటులోకి రానున్న 23 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్
శారీరక మానసిక ఒత్తిడిని తగ్గింపు, శారీరక దృఢత్వం పెరిగే విధంగా సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తోంది జీహెచ్‌ఎంసీ. ఈ ట్రాక్‌లు కొన్ని చోట్ల తాత్కాలికంగా మరికొన్ని చోట్ల శాశ్వతంగా నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు అధికారులు.. ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నగర వ్యాప్తంగా ఎంపిక చేసిన జోన్లలో సుమారు 90 కిలోమీటర్లు(90 KM) పొడవులో సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే., కొన్ని చోట్ల ఇప్పటికే ట్రాక్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే.. ఔటర్ రింగ్ రోడ్ (ORR) వెంబడి సోలార్ రూఫింగ్‌తో 23 కిలోమీటర్ల పొడవున్న సైక్లింగ్ ట్రాక్ దాదాపుగా పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం తన ట్విట్టర్ ఖాతాలో ట్రాక్ సుందరీకరణ పనుల చిత్రాలను పంచుకున్నారు మరియు సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్‌ల ఏర్పాటును ఆశించే సమయంలో ట్రాక్‌లో పచ్చదనం మరియు ల్యాండ్‌స్కేపింగ్ సంబంధిత పనులు చేపట్టినట్లు వివరించారు. త్వరలో ప్రారంభం. 4.5-మీటర్ల వెడల్పు సైకిల్ ట్రాక్‌ను ORRతో పాటు హైదరాబాద్‌లోని పశ్చిమ ప్రాంతాలలో రెండు స్ట్రెచ్‌లలో 22 కిలోమీటర్ల వరకు ప్లాన్ చేశారు.
చైనా కొత్త ప్రధానిగా లీ కియాంగ్.. జిన్‌పింగ్‌కు నమ్మినబంటుగా పేరు..
మూడోసారి చైనా అధ్యక్షుడిగా షి జిన్ పింగ్ మరోసారి అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు. శుక్రవారం ఆయన మరోసారి అత్యున్నత పదవిని అధిష్టించారు. తాజాగా శనివారం చైనా కొత్త ప్రధానిగా లీ కియాంగ్ ఎన్నికయ్యారు. చైనా నేషనల్ పీపుల్ కాంగ్రెస్ శనివారం లీ కియాంగ్ ను ప్రధానిగా నామినేట్ చేసింది. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు నామమాత్రం అధికారాలు కలిగిన ప్రధానిగా లీ కియాంగ్ ఉండనున్నారు. 69 ఏళ్ల కియాంగ్ చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితుడు, నమ్మినబంటుగా పేరుంది. గతేడాది షాంఘైలో అత్యంత కఠిన జీరో కోవిడ్ లాక్ డౌన్ అమలు చేసినందుకు లీ కియాంగ్ కారకుడు. ఈయన కారణంగా కమ్యూనిస్ట్ చైనా లో ప్రజలు తీవ్రంగా ఆందోళనలు చేశారు. జిన్ పింగ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. లీ కియాంగ్ టెక్నాలజీ, చైనా ఆర్థిక వ్యవస్థకు పవర్ హౌజ్ గా ఉన్న ఆగ్నేయ ప్రావిన్స్ జెజియాంగ్ కు చెందిన వారు. కోవిడ్ మహమ్మారి తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే బాధ్యత లీ కియాంగ్ పై ఉంది. 1970 తర్వాత గతేడాది అతి తక్కువ వృద్ధి రేటును నమోదు చేసింది చైనా. కేవలం 3 శాతానికి పడిపోయింది. 1970 తర్వాత ఇదే రెండో వృద్ధి క్షీణత.
పెళ్లి పత్రికపై ఎంఎస్ ధోని ఫోటో.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్..
ఇండియాలో క్రికెట్ ఓ మతం అంటుంటారు. దానికి తగ్గట్టుగానే క్రికెటర్లను అభిమానులు దేవుళ్లుగా కొలుస్తారు. తమ అభిమాన ఆటగాడి కోసం కటౌట్లు కడతారు.. టీ షర్టులపై బొమ్మలు, పచ్చబొట్టు వేయించుకుంటారు. ఆ కోవలోనే మరో అభిమాని నడిచాడు. ఈ ఫ్యాన్ అందరికి భిన్నంగా ఆలోచించాడు. తన పెళ్లి శుభలేఖపై వినాయకుడి ఫొటోతో పాటు తన అభిమాన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఫోటో కూడా ప్రింట్ చేయించాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫిలోని ఓ ఫోటోను పెళ్లి కార్డుపై ముద్రించాడు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోపై నెటిజన్ల్ ఫన్సీ కామెంట్స్ చేస్తున్నారు. ధోనీ జెర్సీ నంబర్ 7ను ఉద్దేశిస్తూ.. అతడు 7జన్మల బంధం కోసం 7 అడుగులు వేయాలనుకుంటున్నాడు.. అని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సౌరభ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్నప్పుడు భారత క్రికెట్ జట్టులోకి ఆడుపెట్టిన ధోనీ.. ఆ తర్వాత భారత క్రికెట్ స్వరూపాన్ని సమూలంగా మార్చేశారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ చెరగని అధ్యాయం లిఖించాడు. ఓ దశాబ్దం పాటు క్రికెట్ ను శాసించాడు. దిగ్గజాలు సైతం సలాం చేసే స్థాయికి ఎంఎస్ ధోని ఎదిగాడు. గ్రౌండ్ లో ధోని ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు గెలుస్తుందని అభిమానులు అనుకునేంతలా.. అతడి ప్రదర్శన ఉండేది. కెప్టెన్ గా జట్టును నడిపించిన తీరు కూడా అతడిని అగ్రస్థానానికి తీసుకెళ్లింది. ధోని సారథ్యంలోనే 2007,2011 వరల్డ్ కప్ లు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియన్ టీమ్ గెలుచుకుంది.
మేయర్ పై ఆర్జీవీ సాంగ్.. పాపం ఎవరిది అంటూ పాటతో ప్రశ్న
హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కుక్కల దాడిపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. కుక్కకు కుడిచేత్తో తినిపిస్తూ, ఎడమచేత్తో తింటున్న వీడియోకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కుక్కలంటే మేయర్‌కి ప్రేమ చాలా ఎక్కువ. కుక్కలన్నింటిని ఇంటికి తీసుకెళ్లి తినిపిస్తే అవి మన పిల్లలను తినవని ట్వీట్ చేశాడు. కుక్కలపై ఇంత ప్రేమ చూపిస్తున్న మేయర్.. నగరంలో ఉన్న కుక్కలను కూడా మేయర్ ఇంటికి తీసుకెళ్లి ఇంటి మధ్యలో మేయర్‌ని కూర్చోబెడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. చిన్నారులపై దాడి చేసిన వీధి కుక్కలను తీసుకెళ్లి మేయర్ ఇంట్లో వదలాలి అప్పుడు ప్రేమగా తినిపిస్తారో లేదో చూడాలి అంటూ ట్వీట్ ల వర్షం కురిపించారు ఆర్టీవీ. అయితే.. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ మేయర్‌పై చేసిన ట్వీట్ వైరల్‌గా మారుతున్న వేలా.. ఇవాళ ఇదే అంశంపై ఆర్జీవీ మరోసారి స్పందించారు. ఇప్పుడు ట్వీట్ కాకుండా ఏకంగా చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే కాదు మేయర్ ను పాట ద్వారా ప్రశ్నిస్తూ.. ఈ పాపం ఎవరిది అంటూ సాంగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇవాల సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సాంగ్ చూసిన నెటిజన్లు ఆర్టీవీని తెగ పొగడేస్తున్నారు. ప్రశ్నించడంలో ఆర్టీవీ మించిపోయారంటూ ప్రశంసిస్తున్నారు.
అది అట్టా ఏసుకో మావా… ఆ కామెంట్స్ ఆ దర్శకుడికేనా?
టిల్లు వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ‘బలగం’. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్బ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ మూవీ అన్ని వర్గాల నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంటుంది. లేటెస్ట్ గా బలగం సినిమా సక్సస్ మీట్ ని కూడా చేశారు. ఈ ఈవెంట్ గురించి, ఈ ఈవెంట్ లో హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. KGF సినిమాపై, ఆ సినిమా పేరు తీయ్యకుండా దర్శకుడు వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ బ్యాక్ లాష్ ఫేస్ చేస్తున్నాయి. ఇదే స్టైల్ లో బలగం సక్సస్ మీట్ లో హరీష్ శంకర్ కూడా వెంకటేష్ మహా పేరు తియ్యకుండా… “అసలే జనాలు థియేటర్లకి రాకుండా ఓటీటీ అంటూ అందులోనే సినిమాలు చూస్తున్నారని ఇలాంటి సమస్యల గురించి కాకుండా క్లాస్ మాస్ కమర్షియల్ ఆర్ట్ అంటూ మాట్లాడడం ఎందుకని అన్నారు. చిన్న సినిమా అయినా సరే మంచిది వస్తే దాన్ని భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేసేది మాస్ కమర్షియల్ సినిమాలు తీసే పెద్ద డైరెక్టర్లే అన్న సంగతి మర్చిపోకూడదని చెప్పుకొచ్చారు. ఒకడు సైకిల్ మీద వెళ్తూ చల్లగాలిని ఎంజాయ్ చేస్తే మరొకరు కారులో వెళ్తూ ఏసీ గాలిని ఎంజాయ్ చేస్తాడు. ఎవరి ఎంజాయ్ మెంట్ వారిది, ఎవరి స్థోమత వారిది. అలా అని ఎవరూ తక్కవ కాదు ఎవరూ ఎక్కవ దు. పెరుగన్నం మంచిదని బిర్యానీ వదిలేసి అదే తినాలంటే ఎవరూ తినరని… కాకపోతే బిర్యానీ తిన్నాక పెరుగన్నం తినమని చెప్తే సబబుగా ఉంటుంద” ఇన్ డైరెక్ట్ క్లాష్ పీకాడు. హరీష్ శంకర్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిగ్గా చెప్పావ్ అంటూ హరీష్ శంకర్ కి సపోర్ట్ చేస్తున్నారు.