NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

తిరుమలలో హెలికాప్టర్లు చక్కర్లు
తిరుమల కొండలపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది.. నో ప్లై జోన్ అయిన తిరుమల కొండల మీదుగా ఓకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడం చర్చగా మారింది.. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి సమీప ప్రాంతం మీదుగా హెలికాప్టర్లు వెళ్లడాన్ని అధికారులు గుర్తించారు.. ఈ దృశ్యాలను తిరుమలలోని భక్తులు కూడా వీక్షించారు.. నో ప్లై జోన్‌లో.. అది కూడా ఒకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, ఆ మూడు హెలికాప్టర్లు కూడా ఎయిర్‌ఫోర్స్‌ విభాగానికి చెందినవిగా గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. తిరుమలపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు ఎయిర్ ఫోర్స్‌ విభాగానికి చెందినవిగా గుర్తించారు అధికారులు.. కడప నుంచి చెన్నైకి వెళ్లే సమయంలో ఆ మూడు హెలికాప్టర్లు తిరుమల మీదుగా ప్రయాణించినట్లు తెలుస్తోంది.

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపచారం..
సింహాచలం చందనోత్సవంలో అపచారం జరిగింది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంలో ఉన్న స్వామివారి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు గుర్తు తెలియని భక్తులు.. ఓ వైపు వేడుక జరుగుతుండగానే బయటకు వచ్చాయి ఫొటోలు, వీడియోలు.. స్వామివారి అంతరాలయంలో ఫొటోలు, వీడియోలపై నిషేధం ఉన్నా.. ఇలా బయటకు రావడంతో కలకలం రేగుతోంది.. గత ఏడాది తొలిసారి బయటకు వచ్చాయి అప్పన్న అంతరాలయ వీడియోలు.. ఇప్పుడు మరోసారి ఫొటోలు, వీడియోలు బయటకురావడంపై భక్తులు మండిపడుతున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై విచారణకు గానీ, బాధ్యులపై చర్యలకు గానీ ఇప్పటి వరకు దేవస్థానం అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.. కాగా, ఈ నెల 23వ తేదీన సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం నిర్వహించారు..

దస్తగిరిని అలర్ట్‌ చేసిన సీబీఐ..! చిన్న అనుమానం వచ్చినా సమాచారం ఇవ్వండి..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది.. ఎన్నో మలుపు, మరెన్నో పరిణామాల తర్వాత సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్టు పరిణామాలు చూస్తేనే తెలుస్తోంది.. అయితే.. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భద్రతపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.. ఈ రోజు పులివెందులలోని దస్తగిరి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు.. దస్తగిరి భద్రతపై సమాచారాన్ని సేకరించారు.. భద్రతకు సంబంధించిన విషయాలను దస్తగిరిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలనే ఆదేశించిన సీబీఐ అధికారులు.. ఏ చిన్న అనుమానం వచ్చినా.. వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.. కాగా, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారిన తర్వాత పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.. ఇప్పుడు అతడి భద్రతపై ఆరా తీసి.. అప్రమత్తం చేసింది సీబీఐ.

మే నెలలో పార్టీ మార్పుపై ప్రకటన ఉంటుంది
ఖమ్మం సత్తుపల్లి నుండి 2018లో బీఅర్ఎస్ నుండి టికెట్ ఆశించి భంగపడిన నేత మట్టా దయానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మే నెలలో పార్టీ మార్పు పై ప్రకటన ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్నది మాత్రం బీఅర్ఎస్ పార్టీలోనేనని, రాబోయే కాలంలో ప్రజల నిర్ణయంను బట్టి పార్టీ మార్పు ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలంతా తాను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వటానికి సిద్దంగా ఉన్న అంటూ తెల్చి చెప్పిసిన మట్టా దయానంద్.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో విబేధాలు లేవన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, మిత్రుత్వం ఉండదని ఆయన అన్నారు. అంతేకాకుండా.. అపోహలు ఉన్న తొలగిపోతాయని, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి లేవన్నారు. 10 ఏళ్లుగా పొంగులేటితో అనుబంధం ఉందని, చిన్న చిన్న వాటివల్ల పొంగులేటికి తనకు ఇబ్బందులు ఉండవన్నారు. పొంగులేటి కాంగ్రెస్ లోకి వస్తే జిల్లాలో 10 కి 10 సీట్లు ఖాయమన్నారు. ప్రజల్లో మనం ఉండేదనిబట్టి టికెట్ ఇవ్వాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తాయి తప్ప ఇప్పుడున్న ఏ పార్టీలు సొంత నిర్ణయాలు తీసుకునేందుకు అవకశాలు లేవన్నారు. ప్రజలకు ఎవరిమీదా అభిమానం ఉంటుందో వారికే సీటు ఇవ్వటానికి పార్టీలు రెడీగా ఉంటాయని, ఎవరితో ఇప్పటివరకు మాట్లాడలేదు.. కాంగ్రెస్ ను కూడా ఇంకా అప్రోచ్ అవ్వలేదన్నారు. పదవి ఉన్న లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటానని, పొంగులేటి కాంగ్రెస్ లోకి వస్తే బావుంటుందన్నారు.

రేణుక చౌదరిపై న్యాయ పోరాట చేస్తా
కాంగ్రెస్ నేత మాజీ మంత్రి రేణుక చౌదరి పై మంత్రి పువ్వాడ అజయ్ నిప్పులు చెరిగారు. రేణుక చౌదరిపై న్యాయ పోరాట చేస్తానన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవాకులు చవాకులు పేలితే జాగ్రత్త అని అన్నారు. సీట్లు ఇప్పిస్తాననిగిరిజనుల వద్ద డబ్బులు వసూలు చేసుకోవడం ఆమె హాబీ అని మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా రేణుక చౌదరి పువ్వాడని టార్గెట్ చేసుకొని మాట్లాడుతుంది. పువ్వాడ అజయ్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది తానేనని అంటుంది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ఆత్మీయ ప్లీనరీ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ రేణుక చౌదరి అవాకులు చవాకులు పేలుతున్నదని, సభ్యత లేకుండా మాట్లాడుతున్నదని ఆమె మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేనని నాకు మా తండ్రి మా పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత నేర్పించాలని అన్నారు. రేణుక చౌదరి ఎన్నికల అప్పుడు జిల్లాకి రావడం సీట్లు ఇప్పిస్తానని గిరిజనుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఆమెకు అలవాటని ఆరోపించారు .గత ఏడాది కాలం నుంచి తనపై రేణుక చౌదరి విమర్శలు చేస్తుంటే మా మహిళలు కూడా చాలా ఓపికతో ఉన్నారని ఇదే పరిస్థితి కొనసాగితే రేణుక చౌదరిపై న్యాయపోరాటం చేస్తానని పువ్వాడ జై స్పష్టం చేశారు. రేణుక చౌదరి కుటుంబం సభ్యులు క్లబ్బులకే పరిమితమైందని కూడా ఆరోపించారు.

ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం
ఆ కామాంధుడి పేరు భలేశ్ ధన్‌ఖడ్. ఆస్ట్రేలియాలోని భారత సంతతి కమ్యూనిటీలో అతనికి మంచి పేరుంది. గతంలో అతడు ఆస్ట్రేలియాలో భారత్‌కు చెందిన ఒక రాజకీయ పార్టీ కోసం పని చేశాడు. కొరియన్ సినిమాలు, కొరియన్ మహిళల పట్ల ఆకర్షితుడైన భలేశ్.. వారిని అనుభవించాలని ఒక పథకం రచించాడు. 2017లో కొరియన్ అనువాదకులు కావాలంటూ ఒక నకిలీ ఉద్యోగ ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి.. కొందరు కొరియన్ యువతులు అతడ్ని సంప్రదించారు. ఈ క్రమంలోనే అతగాడు మాయమాటలు చెప్పి.. యువతులకు గాలం వేశాడు. మొదటగా.. వారిని ఒక హోటల్‌కి తీసుకెళ్లి, అక్కడే ఇంటర్వ్యూ చేసేవాడు. అనంతరం డిన్నర్‌కి పిలిచేవాడు. ఎంతైనా ఉద్యోగం ఇచ్చేవాడు కదా.. అతని మాటలు వినక తప్పదు కాబట్టి, భలేశ్ చెప్పినట్టు ఆ యువతులు డిన్నర్‌కి వెళ్లేవారు. అలా వచ్చిన వారికి వైన్ లేదా ఐస్‌క్రీమ్‌లో డ్రగ్స్ కలిపి ఇచ్చేవాడు. వాళ్లు అపస్మారక స్థితిలో వెళ్లాక.. అత్యాచారానికి ఒడిగట్టేవాడు. అంతేకాదు.. ఆ దృశ్యాలను రికార్డ్ చేసేవాడు కూడా! బెడ్ పక్కనే ఉండే అలారం క్లాక్‌లోనూ ఒక కెమెరా అమర్చి, ఆ ఆకృత్యాలను రికార్డ్ చేశాడు.

సీఎంగా తప్పుకోవాలని షిండేకు బీజేపీ హుకుం.. కొత్త సీఎం ఎవరు..?
మహారాష్ట్రకు తొందరలోనే కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కమలం పార్టీ ఏక్ నాథ్ షిండేకు హుకుం జారీ చేసిందని.. దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజుల పాటు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో అన్నారు. అయితే మీడియా వర్గాలు తనకు ఈ విషయంనూ కచ్చితమైన సమాచారం అందించాయని క్లైడ్ క్యాస్ట్రో అన్నారు. సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు తమ బాధ్యతలు మార్చుకోవాలని బీజేపీ చెప్పిందని క్యాస్ట్రో తెలిపారు. త్వరలోనే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఏక్ నాథ్ షిండే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని క్లైడ్ క్యాస్ట్రో చెప్పుకొచ్చాడు. ఇది నిజమేనా.. షిండే, ఫడ్నవీస్ తమ పదవులు మార్పుకోబోతున్నారని మీడియా వర్గాలు చెబుతున్నాయి.. ఈ విషయం గురించి ఢిల్లీలో మీటింగ్ కూడా జరిగిందట.. బీజేపీ పదవి మార్చుకోమని తనకు చెప్పడం ఇష్టం లేక షిండే మూడు రోజులు సెలవు పెట్టి వెళ్లారా అని క్లైడ్ క్యాస్ట్రో ట్విట్ చేశారు.

వడ్డింపునకు సిద్ధమైన జియో సినిమా..? మూడు ప్లాన్లు రెడీ..!
వ్యాపారం చేయడం అంబానీని చూసే నేర్చుకోవాలేమో.. మొదట అన్నీ ఫ్రీ అంటారు.. ఆ తర్వాత వడ్డింపు షురూ చేస్తారు.. గతంలో.. రిలయన్స్‌ జియో విషయంలో ఇదే జరిగింది.. ఏదైతేనేం.. టెలికం రంగంలో జియో అగ్రగామిగా నిలిచింది.. ఇక, ఆ తర్వాత జియో ఫైబర్‌ కూడా అలాగే తీసుకొచ్చారు.. తాజాగా, జియో సినిమా.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఫ్రీగా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడంతో.. మంచి ఆదరణ పొందుతుంది.. అయితే, రిలయన్స్‌కు చెందిన స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా త్వరలో వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు రెడీ అవుతోంది.. ఐపీఎల్‌ సీజన్‌లో క్రికెట్‌ అభిమానుల నుంచి విపరీతమైన ఆదరణ పొందుతున్న ఈ వేదిక.. కొత్తగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, మ్యూజిక్‌ వీడియోలతో అలరించేందుకు సిద్ధం అవుతోంది.
ఇక, ప్రచారంలో ఉన్న ఆ ప్లాన్లను ఓసారి పరిశీలిస్తే..
* డైలీ డిలైట్: ఇది రూ. 29 ధర కలిగిన వన్-డే ప్లాన్.. అయితే, ఈ ప్లాన్‌ను రూ.2కే పొందే అవకాశం ఉంది.. వినియోగదారులు ఏకకాలంలో రెండు పరికరాల్లో ప్రసారాలు చూడవచ్చు మరియు 24 గంటల పాటు నాన్‌స్టాప్ వినోదాన్ని ఆస్వాదించవచ్చు.
* గోల్డ్ స్టాండర్డ్: ధర రూ. 299 కానీ ప్రస్తుతం రూ.99కి అందించబడింది, ఈ ప్లాన్ వినియోగదారులను మూడు నెలల పాటు అమితంగా వినియోగించుకోవడానికి అనుమతిస్తుంది.
* ప్లాటినం పవర్: టాప్-టైర్ ప్లాన్‌గా జాబితా చేయబడింది, దీని ధర రూ. 1,199 అయితే డిస్కౌంట్ కింద రూ. 599కి అందించబడుతుంది. ప్లాన్ ప్రయోజనాలు గరిష్టంగా నాలుగు పరికరాలలో మొత్తం సంవత్సరం స్ట్రీమింగ్‌ను అందిస్తాయి. అదనంగా, ఇది ప్రకటన రహితం (లైవ్ కంటెంట్ మినహా).

ప్రియ’సఖి’ బిగి కౌగిలిలో నలిగిపోయిన అజిత్.. దిష్టి తగేలేనేమో
కోలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో తలా అజిత్, ఆయన భార్య షాలిని టాప్ 10 లో ఉంటారు. అజిత్ ను ప్రేమించి పెళ్లాడింది షాలిని. వీరి ప్రేమకథ కూడా ఒక సినిమాకు తక్కువేం కాదు. అజిత్, షాలిని ప్రధాన పాత్రల్లో 1999లో అమ‌ర్క‌ల‌మ్ అనే సినిమా చేస్తున్న సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ సినిమా సమయంలో జరిగిన ఒక చిన్న ఘటన వారి పెళ్లికి పునాది వేసింది. షూటింగ్ సమయంలో ఒక సీన్ కోసం షాలిని చేతిని చాకుతో కట్ చేయాల్సి ఉండగా.. అజిత్ అనుకోకుండా ఆమె చేతిని గట్టిగా కోసేశాడు. రక్తం మరకలతో షాలిని బాధపడుతూ ఇంటికి వెళ్లిపోయింది. ఇక ఆ గాయం తనవలనే జరిగిందని అజిత్, షాలినిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడట. రోజుకు మూడు సార్లు ఫోన్ చేసి తిన్నావా..? టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగేవాడట. అతని కేరింగ్ కు ఫిదా అయిపోయిన షాలిని అజిత్ ప్రేమలో పడిపోయింది. ఇక ఆ సమయంలో అజిత్- షాలిని ప్రేమ కథ తెలుసుకున్న డైరెక్టర్ఒకరు అజిత్ కు వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఆ తరువాత ఇద్దరి ప్రేమ ఒరిజినల్ అని తెలుసుకొని అతనే వీరి పెళ్లి చేసాడట. అలా అజిత్- షాలిని వివాహం 2000 సంవత్సరంలో ఘనంగా జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.. అనౌష్క కుమార్, అడ్విన్ కుమార్. పెళ్లి తరువాత షాలిని సినిమాలకు దూరమై.. ఇంటికే పరిమితమయ్యింది. పెళ్ళికి ముందే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, దానికి తానేమి రిగ్రెట్ ఫీల్ అవ్వడం లేదని చెప్పుకొచ్చింది. నేటికీ ఈ జంట ఒక్కటి అయ్యి 23 ఏళ్ళు అవుతోంది. తమ 23 వ వార్షికోత్సవాన్ని ఈ జంట ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కేక్ కట్ చేసిన అనంతరం షాలిని భర్తను తన బిగి కౌగిలిలో బంధించి ప్రేమను చూపిస్తున్న ఫోటో అది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా కూడా ఈ జంట ఎంతో అందంగా కనిపిస్తున్నారు. నేడు వీరి పెళ్లి రోజు కావడంతో అభిమానులు ఈ జ్ఞతకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా అయ్యో ఎంత క్యూట్ గ ఉన్నారు.. దిష్టి తగిలేనేమో అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.