చంద్రబాబు, పవన్‌పై రోజా ఫైర్.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు..!
సూపర్ సిక్స్ పేరుతో మహిళలను నట్టేట ముంచారు.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయన్న ఆమె.. చంద్రబాబు మోసాలపై ఏపీ మహిళలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. రోజుకు 70 మంది మహిళలు, వృద్ధుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. జగన్ హయాంలో దిశా పీఎస్‌లు, యాప్ తెచ్చి రక్షణ కల్పించారు.. చంద్రబాబు మళ్లీ యాభై వేలకు పైగా బెల్టుషాపులు పెట్టారు.. తల్లికి వందనం పేరుతో మహిళలకు పంగనామం పెట్టారు.. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం అంటూ దుయ్యబట్టారు. నిరుద్యోగ మహిళలు, యువతులను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు రోజా.. మహిళలు తిరగబడతారని చంద్రబాబుకు అర్ధం అయింది.. అందుకే శక్తియాప్ పేరుతో యాప్ ని తెస్తున్నారు.. జగన్ తెచ్చిన దిశా యాప్‌ని చంద్రబాబు కాపీ కొట్టారని ఆరోపించారు.. మహిళా భద్రత గురించి కేబినెట్‌లో ఏనాడూ చర్చించలేదు.. కానీ, గంజాయి, మద్యం వ్యాపారుల ప్రయోజనాల గురించి చర్చించారని మండిపడ్డారు. చంద్రబాబు, అనిత సొంత నియోజకవర్గాల్లో గంజాయి విపరీతంగా అమ్మతున్నారు.. 30 వేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం పవన్ కే చెల్లిందని విమర్శించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేక పోతున్నారు..? కేంద్రంలో కూడా మీ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయించలేకపోయారు..? కనీసం, సుగాలి ప్రీతి తల్లికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు.. జనసేన నేతల చేతిలో మోసపోయిన మహిళలకి ఏం న్యాయం చేశారు అని నిలదీసిన ఆమె.. అసలు, మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు పవన్ కల్యాణ్‌కి లేదన్నారు.
ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్.. వారి జోలికొస్తే అదే మీకు చివరి రోజు..!
ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చాం.. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్.. అదే మీకు చివరి రోజు అవుతుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ఇంటరాక్షన్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నా కుటుంబంతో పాటు వ్యాపారంలో భువనేశ్వరి పాత్ర కీలకం. హెరిటేజ్ సంస్థని భువనేశ్వరి డెవలప్ చేశారని ప్రశంసలు కురిపించారు.. ఇక, నా తల్లి పడిన ఇబ్బందులు మహిళలు పడకూడదనే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశానని గుర్తుచేసుకున్నారు.. గంజాయి, డ్రగ్స్ తాగి ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం. మహిళలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తా. గత ఐదేళ్లు మహిళలు స్వేచ్ఛగా మాట్లాడిన పరిస్థితి లేదు. మహిళలను బలవంతంగా మీటింగ్ కి తీసుకువచ్చి బయటకు వెళ్ళకుండా చేసేవాళ్లు అని విమర్శించారు. అయితే, మహిళలు ఇంటి నుండి పని చేసేందుకు గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెడతాం. కంపెనీలు తీసుకువచ్చే బాధ్యత నాది.. పని చేసే విధానం మీదన్నారు సీఎం చంద్రబాబు.. చైనా, జపాన్ లో జనం సంఖ్య తగ్గిపోతుంది. సంపాదించింది అనుభవించడానికి కూడా వారసులు లేకుండా పోతున్నారన్న ఆయన.. గతంలో ఒక్కరినే కనమని చెప్పాను. ఇప్పుడు వీలైనంత ఎక్కువ మందిని కనమని చెబుతున్నాను. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అవకాశం లేకుండా చట్టం చేశాం. ఇప్పుడు ఇద్దరి కంటే తక్కువ ఉంటే పోటీ చేసే అవకాశం లేకుండా చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. తల్లికి వందననం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 ఇస్తాం. ఐదు మంది పిల్లలు ఉన్నా.. 60వేలు ఇస్తామన్న ఆయన.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎన్ని సార్లు అయినా మెటర్నిటీ సెలవులు ఇస్తాం అన్నారు.. విజన్ 20-20 ఇచ్చి హైదరాబాద్‌ని అభివృద్ధి చేశాం. 2047కి ప్రపంచంలో అగ్ర దేశంగా భారత దేశం ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
పోసానికి మరో షాక్.. 20వ తేదీ వరకు రిమాండ్
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. పోసానికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది విజయవాడలోని సీఎంఎం కోర్టు.. ఈ రో సీఎంఎం కోర్టులో పోసానిని హాజరు పరిచారు పోలీసులు.. అయితే, తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయాధికారికి చెప్పారు పోసాని.. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు.. నేను అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాను అని న్యామూర్తి ఎదుట గోడు వెల్లబోసుకున్నారు.. నాకు గుండె జబ్బు, పక్షవాతం వంటి రుగ్మతలు ఉన్నాయన్నారు.. తన ఆరోగ్య పరిస్థితిపై న్యాయమూర్తికి వివరించిన పోసాని.. కోర్టు హాల్లో గతంలో తనకు జరిగిన ఆపరేషన్ గురించి కూడా న్యాయమూర్తికి చూపించారు.. పోసాని చెప్తున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విన్నారు న్యాయమూర్తి.. అయితే, పీటీ వారెంట్‌పై కర్నూలు జిల్లా జైలు నుంచి వియవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. వైద్య పరీక్షల తర్వాత విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరుపర్చారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రి నారా లోకేష్.. వారి కుటుంబ సభ్యులు దూషించడం, సోయల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ జనసేన పార్టీకి చెందిన శంకర్ ఫర్యాదు చేయడంతో భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.. ఈ కేసులో భాగంగానే పీటీ వారెంట్‌పై కర్నూలు జిల్లా నుంచి విజయవాడకు తీసుకొచ్చారు.. అయితే, పోసాని కృష్ణ మురళికి ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది సీఎంఎం కోర్టు..
కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారు? మేం ఎదురుచూస్తున్నాం
కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా? అని తాము కూడా ఎదురుచూస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మీరు అసెంబ్లీకి వచ్చి కూసుంటే.. అన్ని సమస్యలకూ పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. మీరు ఏడు లక్షల కోట్లు చేసింది మీరే కాబట్టి.. ఏం చేశారో చెప్పాలన్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ జనం అధికారం నుంచి తరిమేశారు అనే అనుకోవడం లేదని.. జనం మమ్మల్ని మిస్ అయ్యారు అనే అనుకుంటున్నారన్నారు. తప్పేంటి.. ఒప్పేంటి అనే చర్చ లేదని.. కేసీఆర్ మాటలకే అంకితం.. చిత్తశుద్ధి ఉండి ఉంటే.. ఎమ్మె్ల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. “ఎంపీ ఎన్నికల్లో గుండు సున్న. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నే చేయలేదు. కేసీఆర్ చేసిన తప్పులకు మేము మాటలు పడుతున్నాం. కాంట్రాక్టర్‌ల బిల్లులు పెండింగ్ పెట్టింది ఎవరు? మీరు చేసిన కర్మల వల్ల.. మేము ఢిల్లీకి పోతున్నాం. కార్ లోన్ కూడా 12 శాతం కి అప్పు తీసుకోము. రాష్ట్రం కోసం 12 శాతం వడ్డీతో రుణాలు తీసుకుంటారా? కాంట్రాక్టర్ లను థర్డ్ పార్టీ ప్రోత్సహించి పంపారు. మహేశ్వర్ రెడ్డి.. బీజేపీలో ఉనికి కోసం మాట్లాడుతున్నాడు. ఆయన బీజేపీ ఆఫిస్ లో మాట్లాడే అవకాశమే లేదని బయట మాట్లాడుకుంటున్నారు. ఆయన గురించి మాట్లాడి వెస్ట్” అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నిమ్స్‌లో యువకుడికి గుండె మార్పిడి విజయవంతం..
నిమ్స్‌లో యువకుడికి సక్సెస్ ఫుల్‌గా గుండె మార్పిడి పూర్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతం పేషెంట్ కోలుకుంటున్నాడు.. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డాక్టర్లను అభినందించారు.మంత్రి.. డోనర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అవయవదానంపై అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు. ఇదిలా ఉండగా… గతేడాది మేలో కూడా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక రోగికి నిమ్స్ వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలానికి చెందిన షేక్ షనాజ్ (29) రెండేండ్లుగా డైలేటెడ్ కార్డియో మయోపతితో బాధపడింది. దీని కారణంగా గుండె పనితీరు మందగించి, శరీరానికి కావాల్సిన రక్తాన్ని పంపింగ్ చేయలేకపోయింది. ఆమె నిమ్స్ వైద్యులను ఆశ్రయించింది. ఈ మేరకు నిమ్స్ కార్డియోథోరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వర రావు, డాక్టర్ గోపాల్ నేతృత్వంలో రోగికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ రిపోర్ట్‌ల ప్రకారం.. రోగికి గుండె మార్పిడి చికిత్స అందించారు.
రష్యాతో భారత్ $248 మిలియన్ల ఒప్పందం.. సరికొత్తగా T-72 ట్యాంకులు..
భారత్, రష్యాతో భారీ ఒప్పందాన్ని చేసుకుంది. T-72 ట్యాంకులను అప్‌గ్రేడ్ చేయడానికి ఏకంగా 248 మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాంతీయ సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో.. T-72 ట్యాంకుల 780 HP ఇంజన్లను, 1000 HPకి అప్‌గ్రేడ్ చేయడానికి ఈ ఒప్పందం కుదిరింది. పూర్తిగా అసెంబుల్ చేయడిన, పూర్తిగా నాక్-డౌన్ చేయబడిన, సెమీ-నాక్డ్- డౌన్ పరిస్థితుల్లో T-72 యుద్ధ ట్యాంకుల కోసం 1,000-హార్స్‌పవర్ (HP) ఇంజిన్‌లను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యన్ రక్షణ సంస్థ రోసోబోరోనెక్స్‌పోర్ట్ మధ్య శుక్రవారం సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా, రష్యన్ రక్షణ తయారీ సంస్థ నుంచి చెన్నైకి చెందిన ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(హెవీ వెహికల్ ఫ్యాక్టరీ)కి టెక్నాలజీ బదిలీ ఉంటుంది. రక్షణ రంగంలో ‘‘మెక్ ఇన్ ఇండియా’’ చొరవ పెంచడానికి ఇది ఉపయోగపడనుంది. భారత సైన్యంలోని ట్యాంక్ ఫ్లీట్‌లో T-72 చాలా ముఖ్యమైంది. ప్రస్తుతం దీనికి 780 హెచ్‌పీ ఇంజన్లు అమర్చబడి ఉంది. ఇప్పుడు 1000 హెచ్‌పీ మార్చడం ద్వారా ట్యాంక్ వేగం, దాడి సామర్థ్యం మరింత పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్.. నెలకు రూ. 1.4 లక్షల జీతం.. అస్సలు వదలొద్దు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. మీకు సెంట్రల్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయిపోతది. ఇటీవల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60% మార్కులతో కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ (MSc) లేదా తత్సమాన విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. SC, ST, PwBD అభ్యర్థులకు 55% మార్కులతో పాసైతే చాలు. ఇనార్గానిక్, ఆర్గానిక్, అనలిటికల్, ఫిజికల్, అప్లైడ్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. దరఖాస్తుదారులకు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఫిబ్రవరి 28, 2025 నాటికి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపు వర్తిస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
భారత్ విక్టరీ కొట్టిన పిచ్ పైనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్..
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ డిసైడర్ కు సర్వం సిద్ధమవుతోంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మార్చి 9 ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టైటిల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. వరుస విజయాలతో దూకుడుమీదున్న టీమిండియా ఫైనల్ లో గెలిచి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి ఫైనల్స్ లో అడుగుపెట్టిన కివీస్ ఛాంపియన్ ట్రోఫీపై కన్నేసింది. కాగా ఫైనల్ మ్యాచ్ కోసం పిచ్‌ను ఎంపిక చేశారు. భారత్ విక్టరీ కొట్టిన పిచ్ పైనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగబోతోంది. భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం సెంటర్-వికెట్‌ను ఉపయోగించనున్నారు. టోర్నమెంట్ గ్రూప్ దశలో హై ప్రొఫైల్ ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఉపయోగించిన వికెట్ ఇదే. భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఈ పిచ్‌పై జరుగబోతోంది. ఇదే గ్రౌండ్ లో గ్రూప్-దశ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో మెన్ ఇన్ బ్లూ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని సమాచారం. ఈ పిచ్‌పై భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కలిసి ఐదు వికెట్లు పడగొట్టారు.
శ్రీకాంత్ మళ్ళీ భయ పెడతాడట!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు గతంలో రుద్ర మెరుపు లాంటి టైటిల్స్ వినబడిన ఇప్పుడు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్‌ని చిత్రబృందం కన్ఫర్మ్ చేసినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.. ఈ విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు. షూటింగ్ చివరిదశకి చేరుకున్న ఈ సినిమాని ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్ బలుసు, అశోక్ వర్దన్, కల్యాణ్ రామ్ కలిసి నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు అందిస్తున్న సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఒకప్పుడు ఫ్యామిలీ హీరో ఇమేజ్ తో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న శ్రీకాంత్ ఒక భయపెట్టే పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించాడని ఇన్సైడ్ వర్గాల సమాచారం.. శ్రీకాంత్ కెరియర్లో ఈ సినిమా కూడా ఒక మరుపురాని సినిమాగా నిలిచిపోతుందని చెబుతున్నారు. నిజానికి ఈ సినిమా కంటే ముందే శ్రీకాంత్ అఖండ లాంటి సినిమాలో కూడా తన విలనిజం పండించాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ? అది ఎంత వరకు నిజం అవుతుంది అనేది.
దేవర 2 లోకి సర్ప్రైజ్ పాత్రల ఎంట్రీ?
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ద్వారా ఒక సరికొత్త ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అని అప్పట్లోనే ప్రకటించారు. కథ కూడా అలాగే డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు దేవర సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ లాక్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కొరటాల శివ పూర్తి స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి నేరేట్ చేయగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎన్టీఆర్ వార్ 2 సినిమా ప్యాచ్ వర్క్ తో పాటు ప్రశాంత్ ఎన్టీఆర్ నీల్ సినిమా షూటింగ్ చేయాల్సి ఉంది. వాటి సంగతి పక్కన పెడితే జూన్ నుంచి ఈ దేవర 2 సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నాలు కొరటాల శివ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దేవర 2 లోకి సర్ప్రైజ్ పాత్రల ఎంట్రీ కూడా ఉండనుందని అంటున్నారు. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు దేవర అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో కథ నడిపించిన తీరు అంత ఆసక్తికరంగా ఉండడంతో సెకండ్ పార్ట్ లో ఏం జరగబోతున్నదా అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్ మీద సుధాకర్ మిక్కిలినేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.