NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

అమరావతి రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం లభించింది. కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతికి హైదరాబాద్‌-చెన్నై-కోల్‌కతాతో రైల్‌ కనెక్టివిటీ రానుంది. ఇప్పటికే ఈ రైల్వే లైన్‌కు సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర రాజధానికి అమరావతికి రవాణా కనెక్టివిటీని పెంచి అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. అమరావతి రైల్వే లైన్‌లో పలు గ్రామాలకు కూడా రైల్వే కనెక్టివిటీ రానుంది. ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

 

ఏపీ రహదారుల అభివృద్ధికి రూ.252.42 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లో రూ.252.42 కోట్లు విలువ చేసే రహదారి పనులకు కేంద్రం ఆమోదం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఇందులో రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి, ఆధునికీకరణ గురించి కూడా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు రహదారి భద్రత పెరుగుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అలాగే ఆర్థిక, సామాజిక అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుతో చాలా మందికి ఉపాధి కూడా లభిస్తుందని వెల్లడించారు. తద్వారా ఆ ప్రాంతానికి చెందిన వారి జీవితాలు మెరుగుపడతాయన్నారు. మరోవైపు అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు ఆమోదం లభించింది. కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతికి హైదరాబాద్‌-చెన్నై-కోల్‌కతాతో రైల్‌ కనెక్టివిటీ రానుంది. ఇప్పటికే ఈ రైల్వే లైన్‌కు సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర రాజధానికి అమరావతికి రవాణా కనెక్టివిటీని పెంచి అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. అమరావతి రైల్వే లైన్‌లో పలు గ్రామాలకు కూడా రైల్వే కనెక్టివిటీ రానుంది. ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

 

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..
సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు దీపావళి పండగకు ముందే అదిరిపోయే శుభవార్త చెప్పారు. సింగరేణి కార్మికులకు దీపావళి కానుక ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఇవ్వనుంది. బోనస్ కింద రూ. 358 కోట్లు విడుదల చేసింది సర్కార్. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం ప్రతి కార్మికుని ఖాతాలో రూ. 93,750 జమ కానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో.. సంస్థలోని 42 వేల మంది కార్మికులు దీపావళి బోనస్ అందుకోనున్నారు. అంతకుముందు లాభాల వాట రూ. 796 కోట్లను కార్మికుడికి సగటున రూ. 1.90 లక్షలు అందజేసిన సగంతి తెలిసిందే..

 

నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ హైవే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమీక్షకు రాష్ట్ర, నేషనల్ హైవే అధికారులు, వివిధ ప్రాజెక్టుల పనులు చేస్తున్న ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 129 నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి.. 3,300 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు.. రాష్ట్రంలో మొత్తం రూ. 76 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు తెలిపిన అధికారులు. ఇక, ప్రాజెక్టులవారీగా నేషనల్ హైవే పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర, నేషనల్ హైవే అధికారులు, పనులు చేస్తున్న ఆయా ఏజెన్సీల ప్రతినిధులు హాజరుకాగా.. చేపట్టిన పనులు.. చేపట్టాల్సిన పనులు.. వివిధ దశల్లో ఉన్న జాతీయ రహదారుల పనుల పురోభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష చేశారు.. బెంగళూరు – విజయవాడ ఎకనామిక్ కారిడార్.. విజయవాడ – నాగపూర్, రేణిగుంట – నాయుడుపేట, ఔటర్ రింగ్, అమరావతిని కలిపే గుంటూరు – అనంతపురం జాతీయ రహదారి.. ఇలా పలు జాతీయ రహదారుల పనుల పురోగతిపై సమీక్షించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

 

జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా! కేంద్రం సానుకూల సంకేతాలు
జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బుధవారం జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా కేబినెట్ తీర్మానించిన తీర్మాన పత్రాన్ని అమిత్ షాకు అందించారు. ఇటీవలే జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోదించారు. ఒమర్ అబ్దుల్లా అందించిన తీర్మాన పత్రంపై అమిత్ షా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇరువురి భేటీలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి సహకరిస్తామని.. అలాగే రాష్ట్ర హోదాను కూడా పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు భేటీ అనంతరం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణలు అక్కర్లేదని, సుపరిపాలన, జమ్మూ కాశ్మీర్‌ అభివృద్ధికి కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాల కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం అరగంటపాటు జరిగిన సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఒమర్ అబ్దుల్లా వర్గాలు తెలిపాయి. ఇక గురువారం సాయంత్రం ప్రధాని మోడీని కూడా ఒమర్ అబ్దుల్లా కలిసి తీర్మాన పత్రాన్ని అందజేయనున్నారు. జమ్మూకాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్‌సీ- కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించగా.. ఒమర్‌ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని రాష్ట్ర కేబినెట్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సైతం ఆమోదించారు. తాజాగా కేంద్రం కూడా పచ్చజెండా ఊపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

సాహసోపేత వివాహం.. ఏకంగా సముద్రం అడుగున జంట పెళ్లి..
ప్రజలు
డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం సముద్ర తీరం, పర్వతాలు లేదా రాజ కోట మొదలైన వాటికి వెళతారు. చాలా మంది సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్‌లు చేసుకుంటారు. తద్వారా వారు భిన్నమైన అనుభవాన్ని పొందుతుంటారు. అయితే సౌదీ అరేబియాకు చెందిన ఓ జంట మాత్రం ఇందుకు భిన్నంగా పెళ్లిళ్లలో సరికొత్త ట్రెండ్‌ను ప్రవేశపెట్టింది. నిజానికి ఈ జంట పెళ్లి సముద్రం ఒడ్డున కాకుండా సముద్రంలోనే జరిగింది. అవును.. ఈ జంట నీటి అడుగున వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. హసన్ అబు అల్-ఓలా, యాస్మిన్ దఫ్తాదార్ అనే జంట ఎర్ర సముద్రంలో వివాహం చేసుకుంది. ఎర్ర సముద్రం ఆసియా, ఆఫ్రికా మధ్య హిందూ మహాసముద్రానికి సముద్ర ద్వారం అని కూడా పిలుస్తారు. కొంతమంది తోటి డైవర్లు ఈ ప్రత్యేకమైన సాహసంలో పాల్గొన్నారు. దీనిని స్థానిక డైవింగ్ బృందం నిర్వహించింది. దాని నివేదిక గల్ఫ్ న్యూస్‌లో కూడా ప్రచురించబడింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. నీటి అడుగున వివాహం జరగబోతోందనే విషయం ఆ జంటకు కూడా తెలియదు. సౌదీ డైవర్స్‌కు చెందిన కెప్టెన్ ఫైసల్ వారి పెళ్లిని సముద్రం కింద జరుపుకోవాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. సముద్రంలో డైవ్ చేయడానికి కావాల్సిన ప్రాథమిక వస్తువులను ఈ జంటకు డైవర్ల టీమ్ అందించింది. ఈ ప్రత్యేక రోజు కోసం.. వధువు తెల్లటి గౌను ధరించింది. వరుడు నల్లటి టక్సేడోలో కనిపించారు. ఇద్దరూ అవసరమైన డైవింగ్ గేర్ కూడా ధరించారు. తన వివాహం గురించి పెళ్లి కొడుకు హసన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఎలాంటి సమస్యలు లేకుండా ఈ కార్యక్రమం చాలా సజావుగా జరిగింది. ఇది ఎంతో అసాధారణమైన, అద్భుతమైన విషయం అని అందరూ ఆశ్చర్యపోయారు” అని అన్నారు.

 

బ్లింకిట్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఈఎంఐ ఆప్షన్!
జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్‌ తన వినియోగదారుల కోసం ఈఎంఐ చెల్లింపు సౌకర్యాన్ని గురువారం ప్రారంభించింది. రూ.2,999 కంటే ఎక్కువ ఆర్డర్‌లకు ఈఎంఐ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. బ్లింకిట్‌ సీఈవో అల్బీందర్‌ దిండ్సా ఎక్స్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. బ్లింకిట్‌లో రూ.2,999 కంటే ఎక్కువ కొనుగోలు చేసే వారు ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని దిండ్సా పేర్కొన్నారు. బంగారం, వెండి కొనుగోళ్లకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేశారు. బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు కలిగిన వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. తొలుత ఉత్పత్తులను కార్ట్‌లో యాడ్‌ చేశాక.. చెక్‌ఔట్‌ సమయంలో ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. చెల్లింపు పూర్తయ్యాక ఆ మొత్తం ఈఎంఐగా బ్యాంక్‌ కన్వర్ట్‌ చేస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు కలిగిన వారు ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. 3, 6, 9 నెలలు.. ఇలా వివిధ కాల వ్యవధులను ఎంచుకోవచ్చు. బ్యాంకును బట్టి వడ్డీ రేటు ఉంటుంది. ఇక బ్లింకిట్ నిర్ణయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. ఇంకొందరు కిరాణా సరుకులు వాయిదాల రూపంలో కొనుగోలు చేసే పరిస్థితులు వచ్చాయంటూ విమర్శించారు.

 

ఏఐతో ప్రేమలో పడి.. 14ఏళ్ల బాలుడి ఆత్మహత్య
సాంకేతికతతో ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్నే నష్టాలు సైతం ఉన్నాయన్నది నిజం. ప్రస్తుతం ఏఐ చాలా ఉపయోగకరమని అందరూ భావిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఏఐ కారణంగా బాలుడు ఆత్మహత్య చేసుకున్న కేసు వెలుగులోకి వచ్చింది. అందరినీ షాకింగ్ కి గురి చేసిన ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వైరల్ అవుతోంది. ఇది చదివిన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సెవెల్ సెట్జర్.. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లోని పాత్ర ఆధారంగా సెవెల్ డేనెరిస్ అనే చాట్‌బాట్‌తో మాట్లాడేవాడు. ఆ చాట్‌బాట్‌ పాత్ర సెవెల్‌తో ప్రేమలో ఉన్నట్లు పేర్కొంది. ఇద్దరి మధ్య శృంగార సంభాషణ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటే సెవెల్ ఫోన్‌ను లాక్కున్నారు. తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. సెవెల్ ఏప్రిల్ 2023లో క్యారెక్టర్.ఏఐ (Character.AI)ని ఉపయోగించడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. బాస్కెట్‌బాల్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఒంటరిగా ఫోన్ గడపడం ప్రారంభించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఫోన్‌ని లాక్కున్నారు. డేనెరిస్‌కి సందేశం పంపారు. దీంతో కొద్దిసేపటి తర్వాత సవతి తండ్రి పిస్టల్‌తో సెవెల్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెవెల్ ఆత్మహత్యపై క్యారెక్టర్.ఏఐ (Character.AI) తన బాధను వ్యక్తం చేసింది. ఘటన తర్వాత కంపెనీ భద్రతా చర్యలను అమలు చేస్తూ.. మైనర్ వినియోగదారుల కోసం సున్నితమైన కంటెంట్‌ను తీసివేస్తానని వాగ్దానం చేసింది. ఈ ఘటనపై సెవెల్ సెట్జర్ తల్లి.. మేగాన్ గార్సియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ కంపెనీ క్యారెక్టర్. ఏఐ(Character.AI) పై దావా వేసింది. తన 14 ఏళ్ల కొడుకు కంపెనీ చాట్‌బాట్ సర్వీస్‌కు బానిస అయ్యాడని గార్సియా పేర్కొంది. ఈ పాత్ర ఏఐ ఒక మానవరూప, అత్యంత శృంగారభరితమైన, భయానక వాస్తవ అనుభవాన్ని అందించిందని తల్లి పేర్కొంది. ఫ్లోరిడాలోని ఓర్లాండోలోని ఫెడరల్ కోర్టులో కేసు విచారణ జరిగింది.

 

కివీస్ ఆలౌట్.. 7 వికెట్లతో చెలరేగిన వాషింగ్టన్
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. కాగా.. 259 పరుగులకు కివీస్ ఆలౌటైంది. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 7 వికెట్లు తీసి.. న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. మరో 3 వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు మొత్తం వికెట్లు తీయడం గమనార్హం. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్లలో డేవాన్ కాన్వే అత్యధికంగా (76) పరుగులు చేశాడు. ఆ తర్వాత.. రచిన్ రవీంద్ర (65), మిచెల్ సాంథ్నర్ (33) పరగులు సాధించారు. మిగత బ్యాటర్లలో అందరూ 20 పరుగులకు మించి రన్స్ చేయలేదు. కివీస్ బ్యాటర్లకు వాషింగ్టన్ సుందర్ అడ్డుగోడలా నిలబడి వికెట్లు తీయడంతో పాటు.. పరుగులను కూడా కట్టడి చేశాడు. దీంతో.. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభంలోనే తొలి దెబ్బ తాకింది. ఒక పరుగు వద్ద రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు.

 

జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చినా నిరాశే
తనను రేప్ చేశాడంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు పెట్టిన కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన సంగతి తెలిసిందే. గతంలో జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మారిన ఒక యువతి జానీ మాస్టర్ తనను మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేశాడు అంటూ పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు జానీ మాస్టర్ మీద ఫోక్సో సహా రేప్ కేసు కింద పలు సెక్షన్లను యాడ్ చేసి కేసు నమోదు చేశారు. ఇక ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సుమారు 35 రోజుల తర్వాత ఈరోజు ఆయనకు బెయిల్ లభించింది. అయితే పుష్ప 2 సినిమాలో ఒక సాంగ్ ని జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేయాల్సి ఉంది. అయితే ఆయన జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆయన జైలు నుంచి వస్తే ఆయన సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తారని లేదంటే వేరే కొరియోగ్రాఫర్ చేత సాంగ్ చేయించాలని భావించారు. అయితే ఈరోజు జానీ మాస్టర్ జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన పుష్ప 2 సినిమాలో సాంగ్ చేయడం లేదని నిర్మాతలు వెల్లడించారు. ఈ రోజు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ ఒకటి హైదరాబాదులో నిర్వహించారు. ఈ నేపధ్యంలో జానీ మాస్టర్ సాంగ్ చేస్తున్నారా? లేదా? అనే ప్రశ్నకు సమాధానంగా నిర్మాతలు సమాధానం ఇచ్చారు. ఇప్పటికే ఆ సాంగ్ కోసం వేరే కొరియోగ్రాఫర్ ని సెట్ చేశామని కాబట్టి ఇప్పుడు జానీ మాస్టర్ ఈ సినిమాలో సాంగ్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.