NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ
ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియామకమయ్యారు. ఫ్లోర్‌ లీడర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లేఖ రాశారు. బొత్సను శాసనమండలి పక్ష నేతగా నిర్ణయిస్తూ పార్టీ నుంచి అధిష్ఠానం లేఖ ఇవ్వనుంది. బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి ప్రభుత్వం దూరంగా ఉండడంతో వైసీపీ నుంచి బొత్స సత్యానారాయణ మాత్రమే బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మండలి ఛైర్మన్‌ మోషేన్‌ రాజు తన ఛాంబర్‌లో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, సంయుక్త కార్యదర్శి యం.విజయరాజు పాల్గొన్నారు. ఇక, ఈ సందర్భంగా బొత్సను అభినందించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. స్ధానిక సంస్ధల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసేముందు వైఎస్‌ జగన్‌ను బొత్స కలవడంతో.. ఆయనను అభినందించారు.

ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు ఊరట
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదన విన్న తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ కేసులో ఇప్పటికే రెండు చార్జి షీట్లు దాఖలు అయినందున కేసులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది.

కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
బీజేపీలో చేరి, పార్టీకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దొంగ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ సమాజానికి పూర్తిగా స్పష్టత వచ్చిందన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని ఆరోపించారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి …కేసీఆర్ కూతురు బెయిల్ కోసం వాదనలు వినిపించిన వ్యక్తి.. కేసీఆర్ సూచనల మేరకే ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించారు. బీఆర్ఎస్ రాజ్యసభకు ఎందుకు పోటీ చేయడం లేదు.. మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే పోటీ చేసే వాళ్లం. కాంగ్రెస్ అభ్యర్థి.. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి. కాంగ్రెస్ లో కేసీఆర్ ఆడిందే అట పాడిందే పాట. అతి త్వరలోనే కాంగ్రెస్ లో brs విలీనం ఖాయం… డిల్లీలో ఒప్పందం జరిగింది. ప్లాన్ ప్రకారం బీజేపీ ని బ్లేమ్ చేస్తున్నారు. ” అని ఆయన వ్యాఖ్యానించారు. విగ్రహాల దందా బంద్ చేయాలన్నారు. సమస్యలను డైవర్ట్ చేయడానికి.. విగ్రహాల రాజకీయాల చర్చ చేస్తున్నారన్నారు. ఫార్మ్ హౌస్ మీద డ్రోన్ తో విజువల్ తీశారని కేటీఆర్ కేసు రేవంత్ రెడ్డి మీద ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఆయన ఫార్మ్ హౌస్ కాకుంటే కేసు ఎందుకు పెట్టినట్టు అన్నారు. మహారాష్ర్ట , హర్యానా ఎన్నికలకి డబ్బులు పంపించాలి.. కాబట్టే హైడ్రా పేరు మీద డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.కాగా..తాజాగా జన్వాడ ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని నోటీసులు ఇచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం తనిఖీల కోసమే హైడ్రా అక్కడికి వెళ్ళిందని లాయర్ చెప్పారు. నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు. కేసు విచారణను ముగించండి.. నిబంధనల మేరకే వ్యవహరిస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు.

జన్వాడ ఫాం హౌస్‌పై హైకోర్టులో విచారణ.. హైడ్రా విధివిధానాలు స్పష్టం
జన్వాడ ఫాం హౌస్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని నోటీసులు ఇచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం తనిఖీల కోసమే హైడ్రా అక్కడికి వెళ్ళిందని లాయర్ చెప్పారు. నిబంధనల మేరకే హైడ్రా పనిచేస్తుందన్నారు. కేసు విచారణను ముగించండి.. నిబంధనల మేరకే వ్యవహరిస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు. జన్వాడ ఫార్మ్ హౌస్ లో నిర్మించిన భవనాలకు స్థానిక సర్పంచ్ అనుమతి ఇచ్చారని.. పంచాయితీ తీర్మానం లేదని అడిషనల్ అడ్వకేట్ జనరల్ వివరించారు. ఆ భూమి ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉందా? లేదా అన్నది స్పష్టత కావాలని హైకోర్టు తెలిపింది. అప్పటివరకు ఈ పిటిషన్ ను ముగించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను జీవో19 ప్రకారం నిబంధనల మేరకే హైడ్రా నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని హైడ్రాను సూచించింది. కాగా.. తాజాగా ఫాం హౌస్ పై కేటీఆర్ మాట్లాడారు. నాకంటూ ఎలాంటి ఫాం హౌస్ లేదని కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. నా మిత్రుడి ఫాం హౌస్ ను నేను లీజుకు తీసుకున్నానని అన్నారు. ఎఫ్.టి.ఎల్ లో వుంటే నేనే దగ్గర ఉండి ఫార్మ్ హౌస్ ను కూలగొట్టిస్తా అన్నారు. కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి, నేతలు కె.వి.పి రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఫాం హౌస్ లను కూల్చాలన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫాం హౌస్ నుంచి స్టార్ట్ చేద్దామన్నారు. నాకు ఎలాంటి ఫాం హౌస్ లేదు.. వివేక్ వెంకటస్వామి ఫాం హౌస్ నీళ్ళల్లో ఉందన్నారు. నా అఫిడవిట్ పబ్లిక్ డొమైన్ లో ఉందన్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోండన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి స్టార్ట్ చేయండి అని డిమాండ్ చేశారు. రేపు చేవెళ్లలో జరిగే రైతు నిరసన కార్యక్రమంలో నేను పాల్గొంటానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు.

 

ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం.. అభినందించిన జగన్‌
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు తన చాంబర్‌లో.. బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. కాగా, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి పోటీకి దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించిన నేపథ్యంలో.. వైసీపీ నుంచి బొత్స మాత్రమే బరిలో ఉండడంతో.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం విదితమే.. ఇక, ఈ సందర్భంగా బొత్సను అభినందించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. స్ధానిక సంస్ధల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసేముందు వైఎస్‌ జగన్‌ను బొత్స కలవడంతో.. ఆయను అభినందించారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్‌.మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, విశాఖ జెడ్పీ ఛైర్మన్‌ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్‌ రాజ్, భాగ్యలక్ష్మి, కడుబండి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, శోభా హైమావతి, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఉత్తరాంధ్ర సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం.. విశాఖ ఒకేలా అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతానికి మా పార్టీది మూడు రాజధానుల విధానమేనని.. మూడు రాజధానులపై మా పార్టీ విధానం మార్చాలనుకుంటే మా నాయకుడితో చర్చించుకుంటామని స్పష్టం చేశారు. ఒకవేళ విధానం మారితే చెబుతామని ఆయన వెల్లడించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నారన్న బొత్స.. స్థానిక నేతలు, వైసీపీ నేతలకు అన్నిటి కంటే ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతగా పదవిని నిర్వహిస్తానని పేర్కొన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చారా..? లేదా అనేది కాదు ప్రజలకు మేలు జరిగేలా చూడడమే ముఖ్యమన్నారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసిందని.. ప్రస్తుతానికి కేవలం 75 రోజులు మాత్రమే పూర్తి అయిందన్నారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలపైనే ఢిల్లీలో పోరాడామని ఆయన వెల్లడించారు.

 

ఏపీలో 5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి.. ముందుకొచ్చిన బ్రూక్‌ఫీల్డ్
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది.. ఇప్పటికే పలు సంస్థలతో సీఎం చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరుపుతున్నారు.. అయితే, పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానాలలో ఒకటిగా పరిగణించబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 5 బిలియన్ల యూఎస్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్‌ ఎవ్రెన్ ముందుకొచ్చింది. బ్రూక్‌ఫీల్డ్ , యాక్సిస్ యాజమాన్య బృందం.. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో దశలవారీగా 3500 మెగావాట్ల సోలార్ , 5500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎవ్రెన్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వీటిలో 3000 మెగావాట్ల ప్రాజెక్టులకు ఇప్పటికే రాష్ట్రంలో శంకుస్థాపన జరిగిందని, 2026 చివరి నాటికి ఆ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని తెలిపారు. పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల ప్రణాళికలే కాకుండా, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్, ఈ-మొబిలిటీ, గ్రీన్ అమ్మోనియా వంటి వాటిలో రాష్ట్రంలో అదనపు అవకాశాలను ఎవ్రెన్ అన్వేషిస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక, ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనువైన విధానాలను అమలుచేస్తోందని , పెట్టుబడిదారులకు, ప్రజలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సమయానుకూల అనుమతులతో పాటు పారదర్శకతను ప్రోత్సహించేందుకు , రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని అన్నారు. ఇంధన రంగంలో పెట్టుబడులను సాకారం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన అవకాశాలకు, ఉద్యోగ కల్పనకు, స్థిరమైన అభివృద్ధి సాదించేందుకు పుష్కలంగా అవకాశాలున్నాయన్నారు. సౌర, పవన ఇంధన వనరులతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ఏపీలో ఆకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. సోలార్ పార్కులు, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్‌లు, పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు.

 

మెడికల్ స్టూడెంట్ రాధను హతమార్చిన మావోయిస్టులు
కోవర్టు అనే అనుమానంతో నక్సలైట్లు తమ సహచరురాలిని హత్య చేశారు. మావోయిస్టులు మెడికల్ స్టూడెంట్ రాధను హతమార్చారు. రాధా అలియాస్ నీల్సో ఆరేళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరింది. పోలీసులకు కోవర్టు మారిందని సమాచారంతో మావోయిస్టు పార్టీ మరణశిక్ష విధించింది. పోలీసులకు లొంగిపోయి పూర్తిగా రాధా సోదరుడు సూర్యం ఏజెంట్ గా పని చేస్తున్నాడంటూ మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది. రాధాపై అనుమానం రావడంతో 3 నెలల క్రితం కమాండర్ బాధ్యత నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ, ఛత్తీస్గడ్ ఇంటలిజెన్స్ అధికారులతో సంబంధం పెట్టుకున్నట్లు మావోయిస్టు పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. రాధా ద్వారా పార్టీ కీలక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులకు వెల్లడించింది.. అంటూ లేఖలో పేర్కొంది.. మావోయిస్టు పార్టీ. నిర్ణయం మేరుకే రాధాకు మరణశిక్ష విధించామని మావోయిస్టు పార్టీ తెలిపింది. దీంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గతంలో రాధాను శిల్పా, దేవేంద్ర అనే వ్యక్తులు మావోయిస్టు పార్టీ వైపు మళ్లించారు. శిల్పా కేసులో ఏపీ, తెలంగాణలో గతంలో ఎన్ఐఏ సోదాలు చేసి పలువురిని అరెస్టు చేసింది. “పార్టీనీ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి శత్రువు అనుసరిస్తున్న కోవర్టు ఎత్తుగడల్ని తిప్పికొడదాం! పోలీసుల కోవర్టు కుట్రలో భాగమైన విప్లవ ద్రోహిగా మారినందుకు నీల్సో(రాధ)ను చంపేసాం!” అని మావోయిస్టులు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో రాసుకొచ్చారు.

భయానక రోడ్డు ప్రమాదం.. 30 మంది మృతి.. 23 మందికి గాయాలు..
ఒక విషాద సంఘటనలో, ఇరాన్‌లో పాకిస్థానీ యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఫలితంగా 35 మంది మరణించారు. ఇంకా 18 మంది గాయపడ్డారు. ఇరాన్ ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. యాజ్ద్ ప్రావిన్స్‌లో మంగళవారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకింగ్ సిస్టమ్‌ లో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 53 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ప్రధానంగా సింధ్‌ లోని లర్కానా, ఘోట్కీ ఇంకా ఇతర నగరాల నుండి వచ్చారు. దురదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో 11 మంది మహిళలు, 17 మంది పురుషులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురు గాయపడిన వ్యక్తులు ఇప్పుడు ఆసుపత్రి నుండి కోలుకున్నారు. అని యాజ్డ్ ప్రావిన్స్ సంక్షోభ నిర్వహణ డైరెక్టర్ జనరల్ స్టేట్ తెలిపారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను పరిష్కరించడానికి ఇరాన్‌ లోని పాకిస్థాన్ కాన్సులర్ సేవలను యాజ్ద్‌ కు వెళ్లాలని కోరింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో ఒక పోస్ట్‌లో, పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి & విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రమాదంలో గాయపడిన వారి క్షేమం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. ఇదిలా ఉండగా, షియా ఇస్లాంలో కీలక వ్యక్తి మహమ్మద్ ప్రవక్త మనవడు అయిన ఇమామ్ హుస్సేన్ బిన్ అలీకి 40వ రోజు సంతాప దినాలను పురస్కరించుకుని ఇరాక్‌ లోని కర్బలాలో అర్బయిన్ తీర్థయాత్రలో లక్షలాది మంది షియా ముస్లింలు పాల్గొంటున్నారు.

 

స్టార్ దర్శకుడి మెడకు చుట్టుకున్న కె.ఆర్మ్ స్ట్రాంగ్‌ హత్య..?
తమిళనాడు బాహుజన సమాజ్ పార్టీ చీఫ్ కె.ఆర్మ్ స్ట్రాంగ్‌ను కొంత మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్త‌లు దారుణంగా చంపేశారు. అప్పట్లో హత్య వ్యవ్యహారం తమిళనాడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. కుల అహంకార వ్యక్తులే ఈ హత్య చేసారని దళిత సంఘాలు ఆందోళన చెప్పట్టాయి. కె.ఆర్మ్ స్ట్రాంగ్‌ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఆయన ఒక లాయ‌ర్ కూడా. తమిళనాడులో న్యాయవాదులకు రక్షణలేకుండా పోయిందని ధర్నాలు చేపట్టారు. దీంతో ఈ కేసు వ్యవహరాన్ని సీరియ‌స్‌గా తీసుకుని విచార‌ణ‌ చేపట్టారు పోలీసులు. విచారణలో భాగంగా కొంత మంది అనుమానితుల‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఈ అసలు నిందితుడు మొట్టై కృష్ణ‌న్ ను వదిలేసి వేరెవరినో అరెస్ట్ చేసారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసును మరింత  లోతైన విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు  విస్తుపోయే నిజాలు తెలిశాయి. హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొట్టై కృష్ణ‌న్ విదేశాల‌కు పారిపోయాడ‌ని తెలుస్తోంది. మొట్టై కృష్ణ‌న్ విదేశాలకు పారిపోవ‌టానికి కొన్ని గంట‌ల ముందు మోనీషాతో ఫోన్‌లో మాట్లాడార‌ని, మోనిషా నిందితుడు మొట్టై కృష్ణ‌న్ కు ఆశ్ర‌యం ఇచ్చిందని పోలీసుల‌కు విచార‌ణ‌లో తెలిసింది. ఈ మోనిషా ఎవరోకాదు రజనీకాంత్ తో జైలర్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ భార్య. దీంతో పోలీసులు నెల్స‌న్ స‌తీమ‌ణి మోనీషాను విచారించారు. మొట్టై కృష్ణ‌న్ కు మోనిషాకు సంబంధం ఏంటనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ వార్తలపై నెల్సన్ టీమ్ నుండి ఎటువంటివివరణ రాలేదు. ప్రస్తుతం దర్యాపు స్టేజ్ లో ఉన్న ఈ కేసులో రానురాను ఎటువంటి నిజాలు భయటపడతాయో ముందు ముందు రోజుల్లో తెలుస్తుంది.