NTV Telugu Site icon

Top Headlines @ 5PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

*ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఆంబోతుల్లా మాట్లాడుతున్నారు.. సీఎం తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హైదరాబాద్కు ఏం చేసింది అంటున్నారు.. ‘ఔటర్ తెచ్చింది మేము.. ఐటీ తెచ్చింది మేము.. ఎయిర్ పోర్ట్ కట్టింది మేము’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. మీరేం చేశారు.. గంజాయి, డ్రగ్స్ తెచ్చారని బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము ఏదో ఒకటి చేసుకుంటూ పోతుంటే.. కాళ్ళల్ల కట్టే పెట్టే పనిలో వాళ్ళు ఉన్నారని మండిపడ్డారు. వీళ్ళ పని ఐపోయింది అన్నోడు ఎక్కడ ఉన్నాడు.. కనపడకుండా పోయాడని సీఎం విరుచుకుపడ్డారు. రోజూ ఎవరున్నారు.. ఎవరూ లేరు అని లెక్క పెట్టే పనిలో ఉన్నాడని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వాన్ని కాపాడితేనే అభివృద్ధి జరుగుతుందని ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్లు కాంగ్రెస్లో చేరారని సీఎం పేర్కొన్నారు. రేవంత్ బలపడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అందరూ తమ వైపు వస్తున్నారన్నారు. పార్టీలోకి వచ్చే వాళ్లకు ఏమిస్తా.. నా దగ్గర ఏముందని.. నా అంగీ లాగు అమ్మినా పైసా రాదని సీఎం తెలిపారు. ప్రకాష్ గౌడ్కి, ఎగ్గే మల్లేశంకి పైసలు తక్కువ ఉన్నాయా.. ఎగ్గె మల్లేషమే ప్రపంచ బ్యాంకుకి అప్పు ఇచ్చే స్థాయిలో ఉన్నారని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడదోస్తామని ఇద్దరు ఆంబోతుల్లా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మైసమ్మకి ఇచ్చిన ఆంబోతులాగా ఉన్నారు వాళ్ళని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ ప్రభుత్వాన్ని పడగొడతం పడగొడతామంటున్నారు.. మీరు పడగొడతామంటే తాము నిలబెడతామంటూ ఎమ్మెల్యేలు తమ దగ్గరికి వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఒకడు మూడు నెలలు.. ఇంకోడు ఆరు నెలలు కూడా ఉండదంటున్నారు.. మూడు నెలలు ఆరు నెలలు కాదు.. పదేళ్లు ఈ ప్రభుత్వాన్ని నిలబెడతామంటూ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏమి చేయలేనోడు.. ఆరు నెలల్లో తాము ఏం చేయలేదని మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన వాళ్ళు.. ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణ ప్రజల నెత్తిన మోపారన్నారు. మాటలు మాట్లాడుతున్న మొనగాళ్లు.. చేసిన అప్పులకు ప్రతినెల 7000 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. ఏడాదికి 72,000 కోట్లు వడ్డీకే సరిపోతుంది.. తెలంగాణ సంసారం అప్పుల పాలయిందన్నారు. ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

 

*మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో భేటీ అయ్యారు. షిండే ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రబాబుకు ఏక్‌నాథ్ షిండే ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సన్మానించారు. చంద్రబాబు భేటీకి సంబంధించిన ఫోటోలను మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా రెండు రాష్ట్రాల అభివృద్ధిని ఎలా సాధించవచ్చనే దానిపై ప్రధాన చర్చ జరిగిందని ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ఈ భేటీలో కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి దాదా భుసే, శిందే తనయుడు, ఎంపీ శ్రీకాంత్‌ షిండే ఉన్నారు. ఇరువురు ముఖ్యమంత్రుల మధ్.య దాదాపు అరగంట పాటు చర్చలు జరిగినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ రంగంలో అవకాశాల విస్తరణ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

 

*నచ్చితే నచ్చిందని చెప్పండి లేకపోతే లేదు.. కాటమయ్య సేఫ్టీ కిట్లపై సీఎం ఆరా..
రిస్క్ చేయొద్దు బాగుంటే బాగుందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి అని కాటమయ్య సేప్టీ కిట్లపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తాటివనంలో సీఎం రేవంత్ రెడ్డి ఈత మొక్కలను నాటారు. అనంతరం తాటివనంలో కాటమయ్య సేఫ్టీ కిట్స్ పనితీరును సీఎం పరిశీలించారు. తాటి చెట్టు ఎక్కి సేఫ్టీ కిట్స్ పనితీరును గౌడన్నలు వివరించారు. కిట్స్ పని తీరును గౌడన్నలను అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. తాటి వనంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాటమయ్య రక్షణ కవచంతో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కారు. లైవ్ లో రంగయ్య అనే గీత కార్మికుడితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రిస్క్ చేయొద్దు బాగుంటే బాగుందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి అని తెలిపారు. రక్షణ కవచంతో వల్ల సేఫ్ గా ఉన్నామని రంగయ్య అనే గీత కార్మికుడు సీఎంతో చెప్పాడు. ఎల్లో టీషర్ట్ వేసుకున్న గీత కార్మికుడిని టీ షర్ట్ భాగుందని సీఎం రేవంత్ రెడ్డి కితాబు ఇచ్చారు. రోజుకు 15 చెట్లు గీస్తామని సీఎంతో తెలిపారు. 15 చెట్లు గీస్తే 45 లీటర్ల కల్లు వస్తుందని చెప్పారు. 45 లీటర్ల కల్లులో, నీళ్ళు ఏమైనా పొస్తున్నారా అని రంగయ్య అనే గీత కార్మికుడితో సీఎం రేవంత్ రెడ్డి ఫన్నీగా మాట్లాడారు. ఊర్లో బెల్ట్ షాపుల వల్ల మీకు ఏమైనా ఉందా? అడిగి తెలుసుకున్నారు. ఊర్లో బెల్ట్ షాపులు లేవని చెప్పి..మాకు ఉపాధి కల్పించమన్నారు. వాన కాలం ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తాం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మహేష్ గౌడ్ కు MLC ఇచ్చాం.. మధు యాష్కీ అన్న ఒక్కరే ఖాలీగా ఉన్నాడు.. ఆయనకు ఇస్తామన్నారు. వనం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. కొత్త రోడ్లు వేసినప్పుడు వాటి వెంబడి తాటి చెట్లు , ఈత చెట్లు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. రియల్ ఎస్టేట్ వల్ల చెట్లు కొట్టేస్తున్నారని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఎకరాలు భూమి కావాలని గీత కార్మికులు సీఎం చెప్పుకున్నారు.

 

*తెరుచుకున్న జగన్నాథ ఆలయ రత్న భాండాగారం.. లోపల ఏముందో తెలుసా..?
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు అనంతరం మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గదిని తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ సభ్యులు ఈరోజు మధ్యాహ్నం జగన్నాథుని ఆలయంలోకి ప్రవేశించి ఖజానాను తెరిచారు. వీరిలో ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి బిస్వనాథ్ రాత్, శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (SJTA) చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధి, ASI సూపరింటెండెంట్ డీబీ గడ్నాయక్, పలువురు ప్రతినిధులు ఉన్నారు. వీరితో పాటు.. ఆలయానికి చెందిన నలుగురు సేవకులు (పట్జోషి మహాపాత్ర, భండార్ మెకప్, చదౌకరన్ మరియు ద్యులికరన్)లోపలికి చేరుకున్నారు. ఈసారి రత్న భాండాగారంలోని చెక్క పెట్టెల్లో భద్రపర్చిన ఆభరణాల లెక్కింపు ప్రక్రియనంతా డిజిటలైజ్ చేయనున్నారు. నిధిని మరో చోటకు తరలించేందుకు కొత్తగా ఆరు భారీ చెక్క పెట్టెలను ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం రత్న భాండాగారం తెరవనున్న నేపథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శతాబ్దాలుగా భక్తులు, పూర్వపు రాజులు విరాళంగా ఇచ్చిన విలువైన ఆభరణాలు రత్న భండార్‌లో ఉన్నాయి. పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా.. 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఇక ఆ రత్న భాండాగారం.. లోపల విషసర్పాలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. స్నేక్‌ హెల్ప్‌లైన్‌ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లను కూడా అందులోకి పంపించినట్లు తెలుస్తోంది. రత్న భండార్‌లో ఉన్న విలువైన వస్తువులకు సంబంధించిన డిజిటల్ కేటలాగ్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో వాటి బరువు, కూర్పుకు సంబంధించిన సమాచారం ఉంటుంది. కాగా.. ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది? అనేది అధికారులు చెప్పలేకపోతున్నారు.

 

*డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన అధ్యక్షుడు బైడెన్..ఏమన్నారంటే..?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దీన్నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ట్రంప్ కుడి చెవిపై నుంచి తూటా వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ట్రంప్ కిందికి వంగి ప్రాణాలు కాపాడుకున్నారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అగంతకుడిని మట్టుబెట్టింది. ఈ ఘటన జరిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనపై వైట్ హౌస్ అధికారులు సమాచారం ఇస్తూ.. అధ్యక్షుడు బిడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడినట్లు తెలిపారు. పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో మరియు బట్లర్ మేయర్ బాబ్ దండోయ్‌లతో కూడా బైడెన్ మాట్లాడినట్లు వెల్లడించారు. బైడెన్ ఈ వారం డెలావేర్‌లోని తన ఇంటిలో ఉన్నారు. అర్ధరాత్రి వైట్ హౌస్‌కి తిరిగి వచ్చారు. నిన్న ఉదయం వైట్ హౌస్‌లో హోంల్యాండ్ సెక్యూరిటీ మరియు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్నట్లు వైట్ హౌస్ అధికారులు తెలిపారు. షూటింగ్‌పై స్పందించిన సీక్రెట్ సర్వీస్.. భద్రతా సిబ్బందికి బైడెన్ కృతజ్ఞతలు చెప్పారు. కాల్పులు జరిగినప్పుడు అధ్యక్షుడు డెలావేర్ చర్చిలో ఉన్నారన్నారు. సీక్రెట్ సర్వీస్ హెడ్ కింబర్లీ చీటిల్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ మరియు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అడ్వైజర్ లిజ్ షేర్‌వుడ్-రాండాల్ అతనికి సమాచారం అందించారు.

 

*”ట్రంప్‌ని దేవుడే రక్షించాడు”..భారతీయ అమెరికన్ వ్యాఖ్యలు..
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. పెన్సిల్వేనియాని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌ అనే నిందితుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవి పక్క నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా, ఒకరు మరణించారు. నిందితుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కాల్చి చంపారు. ఈ ఘటనపై ప్రధాని మోడీతో పాటు ఇతర ప్రపంచ దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. ఇదిలా ఉంటే, రిపబ్లికన్ పర్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడిన భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి ట్రంప్ హత్యాయత్నంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ట్రంప్ సురక్షితంగా ఉన్నారనే వార్త దేవుడి చర్య కన్నా తక్కువేం కాదు’’అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దేవుడు ట్రంప్‌ని రక్షించమే కాదు, మన దేశం కోసం జోక్యం చేసుకున్నాడని తన హృదయం చెబుతోందని పోస్టులో పేర్కొన్నారు. ‘‘ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భవిష్యత్తు, మనుగడ కేవలం బుల్లెట్ మార్గంలో వెంట్రుకవాసిలో తప్పిపోయింది’’ అని ఆయన అన్నారు. ట్రంప్‌పై ప్రశంసలు కొనసాగిస్తూనే, అమెరికన్లు తమ తదుపరి అధ్యక్షుడి రియల్ క్యారెక్టర్ చూసే అవకాశం ఉందని అన్నారు. ‘‘ అతను కాల్పులకు గురయ్యాడు. రక్తాన్ని చిందించాడు. ఆపై అతను తన మద్దతుదారుల కోసం తిరిగి నిలబడ్డాడు’’ అని రామస్వామి అన్నారు. ఈ ఘటనపై రామస్వామి అధ్యక్షుడు జో బైడెన్‌ని టార్గెట్ చేస్తూ ఆరోపించారు. ‘‘ మొదట వారు ట్రంప్‌ని కేసులో ఇరికించారు. విచారించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రయత్నించారు. ఇప్పుడు ఈ విషాదఘటన జరగడం తమకు షాకింగ్ కాదు’’ అని అన్నారు. ఈ రోజు జరిగిన సంఘటనను బైడెన్ ఖండించడం సరిపోదని, ఈ రోజు ఈ విషాదానికి దారితీసిన విషపూరిత వాతావరణాన్ని మార్చలేరని దుయ్యబట్టారు.

 

*ట్రంప్ హత్యాయత్నంపై స్పందించిన రష్యా.. ఏం చెప్పిందంటే..
ఉక్రెయిన్‌కి మద్దతు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ, రష్యా డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నాన్ని ఖండించింది. ద్వేషాన్ని రెచ్చగొట్టే విధానాలను అంచనా వేయాలని అమెరికాకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌కి అమెరికా ఆయుధాలను సరఫరా చేసే వారి గురించి ప్రస్తావిస్తూ రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ని విమర్శించారు. అమెరికా సాయం రష్యన్ అధ్యక్షుడిపై దాడిని ప్రేరేపించిందని ఆమె అన్నారు. ఆమె మాట్లాడుతూ.. బహుశా ఈ డబ్బును అమెరికా పోలసులు, అమెరికాలో శాంతిభద్రతలను నిర్ధారించే ఇతర సేవలకు నిధులు సమకూర్చడం మించిదేమో..? అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల పలుమార్లు ఎన్నికల ప్రచారంలో తాను అధ్యక్షుడిగా గెలిస్తే, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగిపోయేలా చేస్తానంటూ ప్రకటించారు. అయితే, ఈ పరిణామం ఉక్రెయిన్‌కి రుచించడం లేదని తెలుస్తోంది. ఒక వేళ నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే, ఉక్రెయిన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది. దాడి గురించి మాట్లాడుతూ.. పుతిన్ యుద్ధాన్ని ముగించడం గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ‘‘చాలా తీవ్రంగా’’ తీసుకున్నట్లు చెప్పారు. 1963లో ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నెడీ హత్యను ప్రస్తావిస్తూ ‘‘ సమస్యాత్మక అధ్యక్షుడిని వదిలించుకోవడానికి ఇతర మార్గాలు అయిపోయినప్పుడు, మంచి పాత లీ హార్వే ఓస్వాల్డ్ అమలులోకి వస్తాడు’’ అని జఖరోవా అన్నారు. ఆయన మరణం అనేక కుట్ర సిద్ధాంతాలకు మూలమని, ఇది అమెరికా రాష్ట్ర యంత్రాంగం లోపలి నుంచి ఆదేశించబడిందని ఆరోపించారు. యూఎస్ మాజీ మెరైన్ లీ హార్వే ఓస్వాల్డ్ జే ఎఫ్ కెన్నడీని హతమార్చాడు.

 

ఇండియా-జింబాబ్వే మధ్య ఐదో టీ 20.. భారత్ బ్యాటింగ్
ఇండియా-జింబాబ్వే మధ్య ఈరోజు ఐదో టీ 20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. మొదట బ్యాటింగ్కు దిగనుంది. ఇప్పటికే భారత్ సిరీస్ కైవసం చేసుకోగా.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి 4-1 తేడాతో ముగించాలని టీమిండియా చూస్తోంది. కాగా.. చివరి టీ20లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. ముకేష్ కుమార్, రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నారు.
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్, రింకు సింగ్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముకేశ్‌ కుమార్.
జింబాబ్వే ప్లేయింగ్ ఎలెవన్
వెస్లీ మధెవెర్‌, మారుమాని, బ్రియాన్ బెనెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్‌), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మడాండే (వికెట్ కీపర్‌), బ్రాండన్ మవుటా, ఎంగరవ, ముజరబాని.