NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

కర్ణాటక బస్సులో ఏపీ మంత్రుల ప్రయాణం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నేడు బెంగళూరులో పర్యటిస్తోంది. కర్నాటక మంత్రులు, అధికారులతో ఈ పధకం అమలు జరుగుతున్న తీరును సబ్ కమిటీ తెలుసుకుంటోంది. బెంగళూరులో ప్రధాన డిపోలను కమిటీ పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణిలు కర్ణాటక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. సాయంత్రం 5 గంటలకు సీఎం సిద్దరామయ్యను ఏపీ మంత్రుల బృందం కలవనుంది.

బీసీలను గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది:
బీసీలను గత ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తనను, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును అన్యాయంగా జైలులో పెట్టారని మండిపడ్డారు. గత ప్రభుత్వం తప్పిదం వలన అన్ని ఆగిపోయాయని విమర్శించారు. త్వరలో నాగబాబు మంత్రి వర్గంలోకి వస్తారని, ఇక మార్పులు ఉండకపోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో రైస్ పుల్లింగ్ జరిగిందని, తప్పు చేయకపోతే పేర్ని నాని ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు.

విధుల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదు:
హైదరాబాద్ మధురానగర్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పురోగతిని, పని తీరును, పథకాల అమలును మంత్రి సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాల సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలకు తానే మంత్రిగా ఉన్నానని అన్నారు. దీంతో గ్రామ అభివృద్ధి నిధులను అంగన్వాడి కేంద్రాల నిర్మాణం కోసం వెచ్చించే అవకాశం దక్కిందని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా సంక్షేమ అధికారి సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.

అది నాలుకా, తాటి మట్టా:
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాటలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పందించారు. నీది నాలుక తాటి మట్ట.. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు కేసీఆర్ కుటుంబంతో కూడి పొగిడిన వ్యక్తివి నువ్వు కాదా అని దుయ్యబట్టారు. అవకాశవాది నుంచి అవినీతి మాట రావడం సిగ్గుచేటు అని అన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డి సానుభూతి పొందడానికే తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని రాజయ్య అన్నారు. కవితను అరెస్టు చేసిన రోజు రోడ్డుపై బైఠాయించి కవితను విడుదల చేయాలని ధర్నా చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. నువ్వు చేసిన మోసానికి బీఆర్ఎస్ వాళ్లే కాదు.. కాంగ్రెస్ వాళ్లు కూడా తు తు అంటున్నారని తాటికొండ రాజయ్య ఆరోపించారు.

నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిషోర్:
బీపీఎస్సీ పరీక్షల రద్దు సహా 5 డిమాండ్లతో నిరాహార దీక్ష చేస్తున్న జన్ సూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ పై విచారణ జరిగింది. ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు పీకే ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూనే, ఆయన తన పాత ప్రకటనలకే వెనక్కు తగ్గుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ ప్రతి ఇంటర్వ్యూలో సమాజంలో జరుగుతున్న ఉద్యమాలను తప్పుబడుతున్నారు. ఆందోళన సమాజంలో ఎటువంటి మార్పు తీసుకురాదు. దీనికి విరుద్ధంగా, కొంతమందికి ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు లభిస్తాయి. ప్రశాంత్ కిషోర్ 2022లో జన్ సూరజ్ ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు, అరవింద్ కేజ్రీవాల్ లాగా ఉద్యమించి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దీని తర్వాత పీకే ప్రతి ఇంటర్వ్యూలో ఉద్యమానికి సంబంధించి తన స్టేట్‌మెంట్ ఇవ్వడం ప్రారంభించారు. పీకే ప్రకారం.. అతడికి ఎలాంటి ఉద్యమం మీద నమ్మకం లేదు. ఉద్యమం సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురాదు. దీంతో ప్రజలు మోసపోయినట్లు భావిస్తున్నారు. ఈ కాలంలో జేపీ నుంచి అన్నా ఉద్యమం వరకు పీకే ఉదాహరిస్తూనే ఉన్నారు. ఇంతకుముందు దేశంలో, బీహార్‌లో జరిగిన అనేక పెద్ద ఉద్యమాలు, ప్రదర్శనలకు పీకే దూరంగా ఉండడానికి ఇదే కారణం.

ఢిల్లీ ప్రజలకు వరాల జల్లు కురిపించిన ప్రధాని మోడీ:
ఢిల్లీ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు రూ.4,500 కోట్ల విలువైన వివిధ పథకాలను కానుకగా అందించనున్నారు. ప్రధాని మోదీ శుక్రవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేసారు. ‘అందరికీ హౌసింగ్’ ప్రతిజ్ఞలో భాగంగా, ఢిల్లీలోని అశోక్ విహార్‌లోని స్వాభిమాన్ అపార్ట్‌మెంట్‌లో ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్ కింద మురికివాడల కోసం నిర్మించిన కొత్త ఫ్లాట్‌లను ప్రధాని మోదీ శుక్రవారం సందర్శించారు. ఢిల్లీలో ర్యాలీకి ముందు ప్రధాని మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఢిల్లీ ప్రజలకు మెరుగైన అవకాశాలు, నాణ్యమైన జీవితాన్ని అందించాలనే మా అచంచలమైన నిబద్ధత ఈ రోజు ప్రారంభించబడుతున్న ప్రాజెక్టులలో ప్రతిబింబిస్తుందని రాసుకొచ్చారు.

బాలకృష్ణ రియల్ ఓజి:
ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షోలో మీనాక్షి చౌదరి పాల్గొంది. ఈ క్రమంలో బాలకృష్ణతో ఉన్న అనుబంధం గురించి పంచుకోమంటే బాలకృష్ణ గురించి హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘’’ఆయన ఎప్పటికీ జై బాలయ్య నే.. ఆయన ఫుల్ ఎనర్జీ పర్శన్, ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం, ఆయన చాలా ఎనర్జిటిక్, చాలా యాక్టివ్. నాకు ఆయన అంటే చాలా గౌరవం ఎందుకంటే ఆయన మనుషుల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడో ఒక షోలో నేను ఆయనను కలిసి మా పర్సనల్ విషయాలు వెల్లడించాను వాటిని షో వరకే వదిలేయకుండా తరువాత మళ్లీ కలిసినప్పుడు కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అన్ స్టాపబుల్ సెట్ లో నేను ఆయన కుమార్తెలను కూడా కలిశాను. బాలకృష్ణ గారు ఒక అద్భుతమైన వ్యక్తి . బాలకృష్ణలా ఇంకెవరూ ఉండలేరు. బాలకృష్ణ రియల్ ఓజి.. ఆయనలా ఇంకా ఎవరూ ఉండలేరు అంటూ మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది.

ప్రయోగాలొద్దమ్మా.. కమర్షియల్ సినిమాలే కావాలి:
ఇప్పుడు తెలుగులో పైసా వసూల్ మూవీలన్నీ కమర్శియల్ యాంగిల్లోనే ఎక్స్ పోజ్ అవుతున్నాయి.చివరకు క్లాసీ సినిమాలు చేసుకునే నాని లాంటి హీరోలు కూడా తమ రేంజ్ పెంచుకోవడానికి దసరా,సరిపోదా శనివారం సినిమాలను కమర్షియల్ గా తీర్చిదిద్ది ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా హిట్ 3 పోస్టర్ తో ఇక ముందు కూడా అలాగే వస్తానని చెప్పకనే చెప్పేశాడు. నిజానికి బి,సి సెంటర్స్ మూమెంట్ పట్టేది కమర్శియల్ పిక్చర్సే .కలెక్షన్ రికార్డ్ లన్నీ కమర్శియల్ చిత్రాలతోనే సాధ్యం అవుతున్నాయి.ఒకవేల కమర్శియల్ ఫిలిం ఫ్లాప్ టాక్ దక్కించుకున్నా… మినిమమ్ ఓపెనింగ్స్ వస్తున్నాయి.

ముగిసిన మొదటి రోజు ఆట:
భారత్ vs ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ, చివరి టెస్ట్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 185 పరుగులకు ఆలౌటైంది. ఇక moiరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా కూడా 9 పరుగులకే 1 వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బాట్స్మెన్ ఉస్మాన్ ఖవాజాను టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పెవిలియన్ కు పంపించాడు. ఉస్మాన్ ఖవాజా వికెట్‌కు ముందు.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో జస్ప్రీత్ బుమ్రా, సామ్ కాన్‌స్టాంట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Show comments