NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

పాక్ ఆర్థిక సంక్షోభం:
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్, కనీసం తన ప్రభుత్వ ఎయిర్ లైనర్ సంస్థ అయిన పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కష్టాలు తీర్చే పరిస్థితిలో కూడా లేదు. పీఐఏకి ఇంధనాన్ని సరఫరా చేస్తున్న పాకిస్తాన్ స్టేట్ ఆయిల్(పీఎస్ఓ) ఇకపై ఇంధనాన్ని సరఫరా చేసేది లేదని స్పష్టం చేసింది. పీఐఏ, పీఎష్ఓకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లించనిదే, ఇంధనాన్ని సరఫరా చేయనని తెలిపింది. మరోవైపు పీఐఏని ఆదుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ముందుకు రావడం లేదు.

చంద్రబాబు బయటకు వచ్చేలోపు:
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ముగిసింది. ఈ సందర్బంగా మాజీ మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ… ‘చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారు. అందర్నీ ధైర్యంగా ఉండమన్నారు. తాను క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనలు చేస్తున్న ప్రజలందరికి కృతజ్ఞతలు చెప్పామన్నారు. చంద్రబాబు బయటకు వచ్చేలోపు టీడీపీ- జనసేన పార్టీలు కలిసి పలు కార్యక్రమాలతో జనంలోకి వెళ్తారు’ అంటూ నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.

బండి సంజయ్ హాట్ కామెంట్స్:
మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు మునిగిపోయాయి, ఇవాళ ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు. ప్రాజెక్టుకు ఇంజనీర్ అని చెప్పుకుని తిరిగే కేసీఆర్ నుంచే డబ్బులు వసూలు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. నదులకు నడక నేర్పిన అపర భగీరథుడు ఎక్కడకి పోయాడు అని ప్రశ్నించారు.

అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం:
తూర్పు తీరానికి తుఫాన్ ప్రమాదం పొంచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత దీనికి ‘హమూన్’గా పిలుస్తారు. ఈ పేరును ఇరాన్ పెట్టింది. ఆదివారం రాత్రి ఈశాన్య దిశగా కదిలిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉంది. ఇది ఒడిశాలోని పారాదీప్ నుంచి 400 కిలోమీటర్లు, పశ్చిమబెంగాల్ లోని దిఘాకు నైరుతి దిశలో 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

దేశంలో తొలి సీఎన్‌జీ బైక్:
సీఎన్‌జీ వేరియెంట్‌లలో మనం బస్సులు, కార్లు, ఆటోలను మాత్రమే చూశాం. ఇప్పటివరకూ ద్విచక్ర వాహనాల్లో సీఎన్‌జీ వేరియంట్ లేదు. అయితే రానున్న రోజుల్లో భారత మార్కెట్‌లోకి ద్విచక్ర వాహనాల్లో సీఎన్‌జీ వేరియంట్ రానుంది. ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ కంపెనీ నుంచి సీఎన్‌జీ బైక్ రానుందని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే సీఎన్‌జీ బైక్‌కు సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ‘బజాజ్ 110 సీసీ ప్లాటినా’ బైక్ సీఎన్‌జీ వేరియెంట్‌లో రానున్నట్లు సమాచారం.

Also Read: Virat Kohli-Anushka Sharma: విరాట్ కోహ్లీకి కొత్త పేరు పెట్టిన అనుష్క శర్మ!

నాని ‘సరిపోదా శనివారం’ మూవీ ఫస్ట్ లుక్:
దసరా సినిమా తరువాత హీరో నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ చేస్తున్నాడు. ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 7న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్ంది. హాయ్ నాన్న సినిమా చేస్తూనే దర్శకుడు వివేక్ అత్రేయతో నాని మరో సినిమాను అనౌన్స్ చేసాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దసరా పండగ సందర్భంగా నేడు ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

కోహ్లీకి కొత్త పేరు:
వన్డే ప్రపంచకప్ 2023లో విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడుతున్నాడు. మెగా టోర్నీలో 5 మ్యాచులు ఆడిన విరాట్ 354 రన్స్ చేశాడు. అంతేకాదు చివరి 13 ఇన్నింగ్స్‌లలో 779 పరుగులు చేశాడు. ఇందులో ఛేజింగ్ సమయంలోనే ఏక్కువగా పరుగులు చేశాడు. ఛేజింగ్ అంటే ఇష్టమని కోహ్లీ కూడా చాలాసార్లు చెప్పాడు. కివీస్ ఇన్నింగ్స్ అనంతరం కోహ్లీకి అతడి సతీమణి అనుష్క శర్మ ఓ నిక్ నేమ్ పెట్టారు. ‘స్టార్మ్ ఛేజర్’ అని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు.