NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఇదేనా..? ఫొటో వైరల్..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు చేస్తుంది. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర చిహ్నంలో రాజ చిహ్నాలు ఉండకూడదని ఆదేశించిన తర్వాత, పెయింటర్ రుద్ర రాజేష్ అనేక నమూనాలను ప్రభుత్వానికి సమర్పించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేందుకు, అమరవీరుల త్యాగాలను చాటిచెప్పేలా తెలంగాణ చిహ్నం ఉండబోతోందని సీఎం రేవంత్ ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ఆ మేరకు నాలుగైదు నమూనాలను కూడా పరిశీలించారు. అయితే వీటిలో ఏది ఫైనల్ అవుతుందనేది సస్పెన్స్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వ పరిశీలనలో మరికొన్ని అధికారిక చిహ్నాలు ఉన్నట్లు సమాచారం. రుద్రరాజేశం పలు రకాలుగా లోగోలు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ మ్యాప్లో బతుకమ్మ, చార్మినార్, రాజముద్రలో ఒక లోగో తయారీ చేశారు. తెలంగాణ మ్యాప్లో బతుకమ్మ, అమరవీరుల స్థూపంతో మరో లోగో డిజైన్ చేసినట్లు విశ్వనీయ సమాచారం. దీంతో.. అమరవీరుల స్థూపం, రాజముద్రలో మరో లోగో వైరల్ గా మారింది. అన్ని లోగోలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆవిర్భావ దినోత్సవం రోజు లోగోను రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. లోగో ఖరారుపై సీనియర్ నేతలతో సీఎం రేవంత్ ఇవాళ చర్చించనున్నారు. పార్టీ నేతలతో భేటీ తర్వాత ఇవాళ రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసే అవకాశాలున్నాయి.

చార్మినార్ ను తొలగించడం అంటే హైదరాబాదీని అవమానించినట్లే..
చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి ఒక్క హైదరాబాదీని అవమానించినట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. పదేళ్లలో సాధించిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధికార చిహ్నం మార్పును వ్యతిరేకిస్తూ చార్మినార్ వద్ద మాజీ మంత్రులు పద్మారావుగౌడ్, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రాజముద్రను మారుస్తోందన్నారు. చార్మినార్ అనగానే హైదరాబాద్ అందరికీ గుర్తుంటుందని అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించవద్దని సూచించారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తోందన్నారు. ఇంత త ర్వాత రాజముద్ర మార్చాల్సిన అవ స రం ఏంట ని ప్ర శ్నించారు. హైదరాబాద్‌ అభివృద్ధిని కాంగ్రెస్‌ ప్రభుత్వం చూడలేదని విమర్శించారు. కేసీఆర్ పేరు కనిపించకుండా తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈసీ, ఎన్డీయే కూటమి అన్యాయంగా వ్యవహరిస్తుంది: సజ్జల
ఎన్నికల కౌంటింగ్ కు వైసీపీ పకడ్బందీగా సిద్ధమవుతుంది. కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధానాలపై వరుస సమావేశాలను నిర్వహిస్తుంది. ఇవాళ జూమ్ లో కౌంటింగ్ రోజు అనుసరించలిసిన అంశాలపై 175 నియోజక వర్గల కౌంటింగ్ ఏజెంట్ల,కు పార్టీ నేతలకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈసీ, ఎన్డీయే కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు అన్నారు. ప్రజా తీర్పు వైసీపీ కు అనుకుంలాగా ఉంది.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారు జాగ్రత్తగా చూడాలి అని సూచించారు. వైసీపీకి పడిన ప్రతి ఒక్క ఓటు మన పార్టీకే చెందాలి.. చెల్లని ఓటు చెల్లదని గట్టిగా చెప్పాలి అని పేర్కొన్నారు. అవతల పార్టీలు నిబంధలను అతిక్రమిస్తే గట్టిగ నిలదీయాలన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నియమాలను ఫాలో అవ్వాలి అని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. అవసరం అయితే అవతల వాళ్ళని క్వశ్చన్ చేసి ఫిర్యాదు చేయాడానికి అయినా సిద్ధంగా ఉండాలి అని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు.

ఏపీలో కౌంటింగ్కు కొనసాగుతున్న ఏర్పాట్లు.. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతలు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఇతరులను అనుమతించోద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్‌ 4వ తేదీన ఉదయం 8 గంటలకు స్టార్ట్ కానుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలట్‌ సిస్టమ్‌లో వచ్చిన ఓట్లను లెక్కించి ఆ తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల్లోని ఓట్లను లెక్కించనున్నారు. ఈ లెక్కింపునకు అర్థగంట కంటే ఎక్కువ టైం పడితే ఓ వైపు వాటిని లెక్కిస్తూనే 8. 30నిమిషాలకు ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడం స్టార్ట్ చేస్తారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఉదయం 10-11 గంటలకు ఫలితాలపై కొంత క్లారిటీ వస్తుంది. మధ్యాహ్నం 2-3 గంటలకు లెక్కింపు పూర్తయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే, వీవీ ప్యాట్‌ల లెక్కింపు పూర్తయ్యాకే తుది ఫలితాలను అధికారికంగా రిలీజ్ చేస్తారు.

ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
ఏపీ ఈసెట్‌ 2024 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. అనంతపురం- జేఎన్‌టీయూలో ఈ సెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి, అధికారులు కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి మే 8వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 36, 369 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే, ఫలితాల్లో 90. 41 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో బాలురు 89. 35 శాతం కాగా, బాలికలు 93. 34 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.

రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రౌస్ అవెన్యూ కోర్టు ఈ పిటిషన్‌ను మధ్యాహ్నం 2 గంటలకు విచారించనుంది. రెగ్యులర్ బెయిల్ కోసం ఈ పిటిషన్ దాఖలు చేయబడింది. అయితే కేజ్రీవాల్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. అతను జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసులో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లాడు. మార్చి 21న ఇడి అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌ను చాలా రోజుల పాటు ఈడీ కస్టడీలో విచారించారు. ఏప్రిల్ 1 న అతను జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలుకు పంపబడ్డాడు. దాదాపు 49 రోజుల పాటు జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు మే 10న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ బెయిల్ లభించింది. కొన్ని షరతులతో జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది.

అంబటి రాయుడు కుటుంబానికి అత్యాచారం, హత్య బెదిరింపులు!
టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కుటుంబానికి అత్యాచారం, హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని రాయుడు స్నేహితుడు సామ్ పాల్ తెలిపారు. కొందరైతే రాయుడు కుటుంబ సభ్యులను చంపేస్తామని, అతడి కూతుళ్లను అత్యాచారం చేస్తామని కామెంట్స్ చేశారని అయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ బెదిరింపులతో రాయుడి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురువుతుందని, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సామ్ పాల్ కోరారు. అయితే ఈ వ్యవహారంపై తెలుగు తేజం రాయుడు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీఎల్ 2024 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఆ టీమ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అంబటి రాయుడు పదే పదే విమర్శలు చేశాడు. ఆరెంజ్‌ క్యాప్‌ ఐపీఎల్‌ టైటిల్‌ను గెలిపించలేదని కోహ్లీపై రాయుడు సెటైర్ వేశాడు. ప్లే ఆఫ్స్ చేరితేనే.. టైటిల్ గెలిచినంతగా బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారని మరోసారి విమర్శించాడు. కోహ్లీ, బెంగళూరు జట్టుని టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో.. రాయుడిపై ఆర్‌సీబీ ఫాన్స్ ట్రోలింగ్‌కు దిగారు. కొందరు రాయుడిని బండ బూతులు తిట్టారు. రాయుడు కుటుంబ సభ్యులను చంపేస్తామని, అతడి కూతుళ్లను అత్యాచారం చేస్తామని దారుణంగా కామెంట్స్ చేశారు. ఈ బెదిరింపులపై రాయుడు స్నేహితుడు సామ్ పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు.. ఆందోళనలో ఫాన్స్!
మరో మూడు రోజుల్లో వెస్టిండీస్‌, యూఎస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్‌ 2024 ఆరంభం కానుంది. జూన్ 2న మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది. ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ న్యూయార్క్‌ వేదికగా జూన్ 9న జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. మూడు వారాల క్రితమే ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ప్రధాని సైతం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ముష్కర ముఠాలు ముప్పు తలపెట్టనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ ఉగ్ర ముఠా చేసిన పోస్ట్ ఇందుకు కారణం. ‘మీరు టీ20 ప్రపంచకప్‌ 2024 మ్యాచ్‌ల కోసం వేచి చూస్తున్నారు. మేము మీకోసమే ఎదురుచూస్తున్నాం’ అని ఓ ఓ ఉగ్ర ముఠా పోస్ట్ చేసింది. దానికి ఓ వ్యక్తి ఆయుధాలు ధరించి ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. అంతేకాదు ‘నసావు స్టేడియం.. 09/06/2024’ అని కూడా ఆ పోస్టులో రాసుంది. దాంతో దాయాదుల మ్యాచ్‌కు ఉగ్రముప్పు ఉందనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఉగ్రముప్పుపై ఐసీసీ, న్యూయార్క్‌ గవర్నర్ ఆఫీస్‌ స్పందించింది. ప్రజా భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రశాంతంగా టీ20 ప్రపంచకప్‌ 2024 మ్యాచ్‌లను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.

బాలయ్య మందు సీసా వివాదం.. స్పందించిన నిర్మాత నాగ వంశీ..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి ముఖ్య పాత్రలో నటించింది. మేకర్స్ ఈ సినిమాను మే 31 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నట సింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో స్టేజిపైన నటి అంజలిని బాలయ్య తోసేసిన ఘటనపై వివాదం చేలరేగింది. బాలయ్యకు మహిళలను గౌరవించడం రాదనీ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో కూడా బాలయ్యపై ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. అయితే ఈవెంట్ లో బాలయ్య మందు తాగి వచ్చారని.. బాలయ్య పక్కన వున్నా మందు సీసాను హైలైట్ చేస్తూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై నిర్మాత నాగ వంశీ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మందు సీసా నిజం కాదు. అది వాటర్ బాటిల్ దానిలో మందు వున్నట్లుగా సీజి చేసి బాలయ్యపై ట్రోల్స్ చేస్తున్నారు. మేమంతా ఆ ఈవెంట్ లోనే వున్నాం కదా మాకు తెలీదా అక్కడ ఎం జరిగిందో అందుకే దయచేసి ఈ ట్రోల్స్ ఆపండి అని నాగవంశీ తెలిపారు.