NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

కొత్తగూడెం పర్యటనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు

కొత్తగూడెం పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బయలుదేరారు. ఆయనతో పాటు.. మంత్రులు కోమటిరడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. నేడు కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉదయం 11-00గంటలకు రూ.4కోట్ల రూపాయల DMFT నిధులతో బైపాస్ రోడ్డు నుంచి జివి మాల్ వరకు చేపట్టనున్న డ్రైన్ నిర్మాణ పనులు శంకుస్థాపన చేయనున్నారు. అంనతరం 11.30 గంటలకు అమృత్ 2.0 గ్రాంటు రూ.124.48కోట్ల నిధులతో కొత్తగూడెం, పోస్టాఫీసు సెంటర్ లో చేపట్టనున్న వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీం పనులకు రాష్ట్ర మంత్రులచే శంకుస్థాపన చేపట్టనున్నారు. శంకుస్థాపనల అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. గత మూడు రోజులు ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేటి ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాకుండా.. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇతర రాష్ట్ర సమస్యల పరిష్కారంపై కేంద్రమంత్రులతో మూడు రోజుల పాటు భేటీ అయ్యారు.

భారీ బందోబస్తు నడుమ నెల్లూరు సెంట్రల్‌ జైలుకు పిన్నెల్లి..

మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బిగ్‌ షాకే తగిలింది. తాజాగా న్యాయస్థానం ఆయనకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో వాదనలు విన్న న్యాయమూర్తి చివరికి ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించారు. దింతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అమెరికాలో భగ్గుమంటున్న సూరీడు.. పిట్టల్లా రాలుతున్న జనం

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వేడి తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. మండుతున్న ఎండల కారణంగా భారత్, పాకిస్థాన్, సూడాన్, బ్రిటన్, అమెరికా వంటి పలు దేశాలు తీవ్ర వేడిని చవిచూస్తున్నాయి. దీంతో అమెరికాలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడంతో జనం ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇల్లు కూడా లేని వారికి ఎండ తీవ్ర సమస్యగా మారింది. అమెరికాలో నిరాశ్రయుల సంఖ్య పెరిగింది. 2007 సంవత్సరంలో అమెరికా నిరాశ్రయుల డేటాను సేకరించడం ప్రారంభించింది. ఆ తర్వాత నిరాశ్రయులైన వారి సంఖ్య 2023 సంవత్సరంలో అత్యధిక స్థాయికి చేరుకుంది. 2023లో అమెరికాలో ఒక్క రాత్రిలో 650,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

ఆషాఢ మాసం బోనాల జాతరపై మంత్రి పొన్నం సమీక్షా

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల జాతర మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ,దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ,సెక్రటరీ హన్మంతరావు , సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోటా నీలిమ,మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ,దేవాలయ కమిటీ ,ఇతర స్థానిక ముఖ్యనేతలు.. పోలీస్ , జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బి,వాటర్ వర్క్స్ ,విద్యుత్ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని , భక్తులకు ఇబ్బందులు కలగకుండా సరైన సౌకర్యాలు చేపట్టేలా సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే.. తెలంగాణలో జులై 7 నుండి ఆగస్టు 4 వరకు నెల రోజుల పాటు ఆషాఢమాస బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఇక, జూలై 21, 22వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో 21న బోనాల జాతర, 22న రంగం, అంబారి అమ్మవారి ఊరేగింపు, పలారం బండ్ల ఊరేగింపు ఉంటుంది.

సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన స్టాక్ మార్కెట్.. 24వేలు దాటిన నిఫ్టీ

భారత స్టాక్ మార్కెట్‌లో పెరుగుదల గురువారం కూడా కొనసాగింది. స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న బూమ్ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు నిరంతరం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. గురువారం కూడా సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయికి చేరి సరికొత్త రికార్డు సృష్టించాయి. సెన్సెక్స్ 79 వేల స్థాయిని దాటగా, నిఫ్టీ కూడా రికార్డు గరిష్ట స్థాయి 24 వేలు దాటింది. అయితే, ట్రేడింగ్ సెషన్‌లో రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న తరువాత, రెండు ఇండెక్స్‌లు జారిపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 269.62 పాయింట్ల లాభంతో 78943.87 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 76 పాయింట్ల లాభంతో 23945 వద్ద కొనసాగుతోంది.

తెలంగాణలో మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు సర్వం సిద్ధం

జూలై 1 నుంచి అమల్లోకి రానున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అనే మూడు కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తెలంగాణ ఏర్పాటు చేసిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కొత్త చట్టాల అనువాద ప్రక్రియ కూడా అధునాతన దశలో ఉందని, జులై 1లోపు పూర్తి చేయాలని భావిస్తున్నామని, నోటిఫికేషన్ డ్రాఫ్ట్‌లు సిద్ధంగా ఉన్నాయని, కొత్త చట్టాలను సజావుగా అమలు చేయడం కోసం మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌లు వస్తాయని అధికారి తెలిపారు.

కొత్త క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయాలని మమత మోడీని కోరారు. కొత్త చట్టాల అమలుకు జూలై 1 తేదీని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఈ కొత్త చట్టాలు అమలు అయ్యేలా చూడడానికి వివిధ స్థాయిలలో బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి , రాష్ట్రం (ఈ కొత్త చట్టాల అమలుకు సిద్ధంగా ఉంది. చట్టాలు), ఆయన చెప్పాడు.

60ఏళ్ల తర్వాత వరుసగా మూడో సారి స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం లోక్‌సభ, రాజ్యసభల ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. ‘18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరంతా ఓటర్ల విశ్వాసాన్ని చూరగొన్న తర్వాత ఇక్కడికి వచ్చారు. దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలని అన్నారు. దాదాపు 64 కోట్ల మంది ఓటర్లు తమ కర్తవ్యాన్ని ఉత్సాహంగా నిర్వర్తించారు. ఈసారి కూడా మహిళలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. కశ్మీర్ లోయలో దశాబ్దాల ఓటింగ్ రికార్డులు బద్దలయ్యాయి. మా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ మూడు మూల స్తంభాలైన తయారీ, సేవలు, వ్యవసాయానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పీఎల్‌ఐ పథకాలు, వ్యాపారాన్ని సులభతరం చేయడం వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి.

తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై చర్చ జరగలేదు

రెండు మూడు రోజులుగా తెలంగాణలో , కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు.. వివిధ అంశాలపై మీడియా లో వార్తలు వస్తున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల దృష్ట్యా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లోకి వచ్చారని, కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. ఈ విషయంలో జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురి అయ్యారని, మా వైపున , పీసీసీ నుంచి సమన్వయం చేయడంలో గందర గోళం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం జీవన్ రెడ్డి తో చర్చించిందని, జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. జీవన్ రెడ్డి రెట్టించిన ఉత్సాహం తో పని చేస్తారని, కొందరు నక్కలు, ఏదయినా జరిగితే బాగుండు అని చూస్తున్నారన్నారు. జీవన్ రెడ్డి గుంట నక్కలకు అవకాశం ఇవ్వలేదన్నారు. జీవన్ రెడ్డి పార్టీ పట్ల కమిట్మెంట్ తో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో విద్యాశాఖ చేసిన పనులు.. ఇపుడు మేం చేసిన పనులు చూడండన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

వందే భారత్‌తో సహా 22 రైళ్లు రద్దు.. 18 రైళ్ల రూట్ ఛేంజ్

రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పెద్ద షాక్‌ తగులుతోంది. భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. గురువారం నుంచి రూర్కీ రైల్వే స్టేషన్‌లో నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో వందేభారత్‌తో సహా 22 రైళ్లను రద్దు చేయగా, దాదాపు 18 రైళ్ల రూట్‌ను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రభావం హరిద్వార్ , రిషికేశ్ ప్రయాణికులపై ఎక్కువగా పడబోతోంది. రూర్కీ రైల్వే స్టేషన్‌లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు ఏడు రోజుల పాటు కొనసాగుతాయి. అంటే వారం రోజుల పాటు రైలు సేవలు ప్రభావితం కానున్నాయి.