అస్సాంలో మణిపూర్ కేసుల విచారణ
మణిపూర్‌లోని హింసాకాండకు సంబంధించిన కేసులను అస్సాంలో విచారణ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం జారీ చేసింది. మణిపూర్ హింసాకాండకు సంబంధించిన కేసుల విచారణను పక్క రాష్ట్రాల్లో చేపట్టాలని సూచించిన సుప్రీంకోర్టు.. సీబీఐ విచారణను అస్సాంలో చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. విచారణకు సంబంధించి అవసరమైన న్యాయాధికారుల(జడ్డి)ను నియమించాలని గౌహతి హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, దారుణంగా లైంగిక హింసకు పాల్పడిన కేసులతో పాటు మొత్తం 17 కేసులను సీబీఐ విచారించనుంది. అన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేర విచారణ, న్యాయ ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ పార్డివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులని అస్సాంకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు లాయర్లు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
మధురైలో ఘోర రైలు ప్రమాదం.. 9 మంది మృతి!
తమిళనాడులోని మధురైలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలు టూరిస్ట్ కోచ్‌లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రైలు బోగీ పూర్తిగా కాలిపోగా.. 9 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వివరాల ప్రకారం.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) టూరిస్ట్ రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళ్తోంది. ఈ రైలులో 63 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఈ టూరిస్ట్ రైలు తమిళనాడులోని మధురైకి శనివారం ఉదయం 5.15 గంటలకు చేరుకుంది. మధురై రైల్వే స్టేషన్ సమీపంకు రాగానే ప్రైవేటు పార్టీ కోచ్‌లో (కిచెన్ బోగీ) సిలిండర్ పేలింది. దాంతో ట్రైన్‌లో మంటలు చెలరేగాయి. గాలుల కారణంగా మంటలు మరింత ఉదృతమయ్యాయి. దాంతో ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని కేకలు వేశారు. కొంతమంది అప్రమత్తమై కిందకు దిగారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను నియమించిన ప్రభుత్వం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 24 మంది సభ్యులతో పాటు మరో నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఈ పాలకమండలిలో ఉండనున్నారు. అయితే.. ఈ ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్, కమీషనర్, టీటీడీ ఛైర్మన్, టీటీడీ ఈవోలను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా చోటు కల్పించాలని పలు రాష్ట్రాలు, రంగాల నుంచి అనేక అభ్యర్థనలు వచ్చాయి. దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ 24 మందికి బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించింది.
ఏపీకి చెందిన బీసీలు నలుగురు, ఎస్సీ, ఎస్టీ ఒకరు ఉండటం గమనార్హం. ఈ నెల 5వ తేదీన టీటీడీ కొత్త చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. 10వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించారు. 24 మందిలో 18 మంది కొత్త సభ్యులను నియమించగా, ఆరుగురు పాత సభ్యులను పాలక మండలిలో కొనసాగించారు. తెలంగాణ నుంచి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి భార్య గడ్డా సీతారెడ్డితోపాటు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రాంరెడ్డికి చోటు దక్కింది. తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి నలుగురికి పాలక మండలిలో చోటు కల్పించారు.
సార్ నా మేకపిల్లను కిడ్నాప్ చేశారు.. ప్లీజ్ వెతికి పెట్టండి
మనలో చాలామంది కాస్లీ వస్తువులు, బంగారం ధరించడానికి ఇష్టపడతారు. అవి ఒక్కోసారి దొంగతనాలకు గురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. విలువైన వస్తులు పోయాయని, కష్టపడి సంపాదించామని దాన్ని ఎలాగైన తీసుకురావాలని కోరుతుంటారు. ఇక్కడ పోయింది కాస్లీ వస్తువు కాదు అంతకన్నా విలువైనది అది ఏంటనే కదా.. తను రెండేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మేకపిల్ల. మేకపిల్ల పోయిందని పోలీస్టేషన్ కు వెళ్లింది ఓ మహిళన. తన మేకపిల్లను రెండు సంవత్సరాలుగా అల్లారుముద్దుగా పెంచుకున్నానని వాపోయింది. అంతేకాదండోయ్ త్వరాలోనే పట్టుకుని తనకు అప్పగించాలని పోలీస్టేషన్ లో బోరున ఏడ్చేసింది. ఇంక చేసేది ఏమీలేక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ముషీరాబాద్ పోలీస్టేషన్ పరిధిలో ఓ మహిళ నివాసం ఉంటుంది. తనతో పాటు ఓ చిన్న మేకపిల్లను తన ఇంట్లో పెంచుకుంటోంది. అయితే నిన్న మధ్యాహ్నం వరకు తనతోనే వున్న మేకపిల్ల సాయంత్రం కనిపించకుండా పోయింది. దీంతో ఆమె అక్కడ పరిసర ప్రాంతాలు వెతికింది. అయినా మేకపిల్ల జాడ కనపడలేదు. రాత్రంతా మేకపిల్లకోసం వెతికినా కనిపించకుండా పోవడంతో పోలీస్టేషన్ కు వెళ్లింది. తమ మేకపిల్లను ఎవరో కిడ్నాప్ చేశారని ముషీరాబాద్ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తన మేకపిల్లను త్వరలో పట్టుకుని అప్పగించాలని కోరింది. గత 2 సంవత్సరాలుగా మేకపిల్లను అల్లారుముద్దుగా పెంచుకున్నానని వాపోయింది. ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అయితే ఇంటి ఆవరణలో ఉన్న మేకపిల్లను ఎవరు తీసుకుని వెళ్లింటారనేదానిపై ఆరా తీస్తున్నారు. కొద్ది రోజులుగా ప్లాన్ వేసి మేకపిల్లను ఎత్తుకుని పోయింటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలిసిన వాళ్లే ఈ పనిచేశారా? లేక ఎవరైనా కావాలనే మేక పిల్లను ఎత్తుకెళ్లారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
విరాట్ కోహ్లీ కాదు.. యో-యో టెస్టు టాప్ స్కోరర్ ఎవరో తెలుసా?! అస్సలు ఊహించలేరు
ఆగస్ట్ 30న ఆసియా కప్ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. భారత్ అయితే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఏర్పాటు చేసిన వారం రోజుల ట్రెయినింగ్ క్యాంపులో పాల్గొంటుంది. మరోవైపు బీసీసీఐ ఆటగాళ్లకు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహిస్తోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. యో-యో టెస్టును క్లియర్ చేశాడు. తాను 17.2 స్కోర్ సాధించినట్లు ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు. అయితే ఫిట్‌నెస్‌కు మారుపేరైన కోహ్లీ స్కోరునే ఓ యువ ఆటగాడు బీట్ చేశాడు.
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ యో-యో టెస్టులో 18.7 స్కోరు సాధించాడు. శుక్రవారం కర్ణాటకలోని ఆలూర్‌లో నిర్వహించిన టెస్టులో గిల్ ఈ స్కోర్ సాధించాడు. జట్టులో అందరిలో కెల్లా ఉత్తమ స్కోర్ గిల్‌దే. కెరీర్ ఆరంభం నుంచి ఎంతో ఫిట్‌గా ఉంటున్న విరాట్ కోహ్లీ స్కోరునే గిల్ అధిగమించడం విశేషం. భారత జట్టులో కొనసాగడానికి ఆటగాళ్ల యో-యో టెస్ట్ అర్హత మార్కు 16.5 అన్న విషయం తెలిసిందే.
శుక్రవారం బీసీసీఐ నిర్వహించిన యో-యో టెస్టులో భారత ఆటగాళ్లు పాల్గొన్నారు. ఐర్లాండ్ పర్యటన నుంచి తిరిగొస్తున్న జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, తిలక్ వర్మ, సంజు శాంసన్‌లతో పాటు గాయం నుంచి పూర్తిగా కోలుకోని కేఎల్ రాహుల్ మినహా మిగతా ఆటగాళ్లు అందరూ యో-యో పరీక్షలో పాల్గొన్నారు. అందరూ పాస్ అయ్యారట. భారత క్రికెటర్లలో ఎక్కువ మంది యో-యో టెస్టులో 16.5 నుంచి 18 మధ్య స్కోరు చేస్తారు. అయితే శుభ్‌మన్ గిల్ ఏకంగా 18.7 స్కోరు సాధించడం విశేషం.
ఓటీటీ లో దుమ్మురేపుతున్న బ్లాక్ బస్టర్ మూవీ..
బేబీ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్లింది. సుమారు 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం భారీ లాభాలు తెచ్చిపెట్టింది. రూ.80 కోట్లపైగానే కలెక్షన్స్ సాధించింది. తక్కువ బడ్జెట్ తో తీసినా కూడా కథ బాగుంటే.. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ సినిమా నిరూపించింది.అయితే బేబీ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఈ సినిమాను ఎస్కేఎన్ నిర్మించారు. బేబీ సినిమా థియేటర్ రన్ పూర్తి అయింది.దీనితో ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూసారు.. నిన్నటితో ప్రేక్షకుల నిరీక్షణకు తెర పడింది. బేబీ సినిమా ఆగస్టు 25 నుంచి ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్ లో అద్భుత విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ లో కూడా దుమ్మురేపుతుంది.ఈ సినిమా ఆహా ఓటీటీ లో విడుదల అయిన 32 గంటలలోనే అత్యంత వేగంగా 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ పొందినట్లు ఆహా వెల్లడించింది.బేబీ సినిమా తీన్మార్ మ్రోగింది అంటూ కాప్షన్ కూడా ఇచ్చింది..
ఉత్తరప్రదేశ్ లో దారుణం.. ముస్లిం బాలుడిని హిందూ పిల్లలతో కొట్టించిన టీచర్
విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ బుద్ధి లేకుండా ప్రవర్తించింది. విద్యార్థుులందరిని సమానంగా చూడాల్సిన గురువై ఉండి మత వివక్షను రెచ్చగొట్టేలా చేసింది. మనది లౌకిక రాజ్యం ఇక్కడ అందరికి సమానంగా బతికే హక్కు ఉంది అని చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు అడవి మనిషిలా ప్రవర్తించింది. చిన్నారులలో మతం అనే విషం నింపే ప్రయత్నం చేసింది. ఒక ముస్లిం బాలుడిని తోటి హిందూ పిల్లలతో కొట్టించి రాక్షసానందం పొందింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ ముస్లిం పిల్లవాడు నిల్చొని ఉంటాడు. అతనిని కొట్టాలని ఓ హిందూ బాలుడిని పిలుస్తుంది టీచర్. ఆ బాలుడి నిలుచున్న ముస్లిం పిల్లవాడి చెంప మీద కొట్టి వెళ్లిపోతాడు. అయితే అప్పుడు ఆ టీచర్ అలాగేనా కొట్టేది నీ బలం మొత్తం పెట్టి కొట్టాలి అని చెబుతుంది. అంతేకాకుండా వేరే పిల్లలను పిలిచి కూడా కొట్టిస్తుంది. నడుము మీద గుద్దండి, కడుపులో తన్నండి, చెంప పగలగొట్టండి గట్టిగా అంటూ తోటి విద్యార్థులకు చెబుతూ ఆ బాలుడిని కొట్టిస్తూ వికృత చేష్టలకు పాల్పడింది. క్లాస్ లో ఉన్న హిందూ పిల్లలందరి చేత ముస్లిం బాలుడిని కొట్టించింది. పిల్లవాడు ఏడుస్తున్న కనికరించలేదు. అయితే ఆమె కొట్టించడమే కాకుండా ముస్లిం పిల్లలు అంటూ మతం గురించి మాట్లాడటం మధ్యలో అసభ్యంగా తిట్టడం కూడా కెమెరాలో రికార్డు అయ్యాయి.
భోలక్ పూర్ లో వింత ఘటన.. విషం పెట్టి పిల్లులను చంపారని ఫిర్యాదు
మారుతున్న సమాజంలో ఎవరు ఎవరికి ఎడిక్ట్ అవతున్నారనేది అర్థంకాని పరిస్థితుల్లో ఉంటున్నాము. కుటుంబ కలహాలతో ఒకరినొకరు చంపుకుంటున్న రోజుల్లో మూగజీవాలపై ప్రేమను కురిపిస్తున్నారు. మనషులకంటే మూగజీవాలను పెంచుకుంటే అవి విశ్వాసం చూపుతాయనేది వారి నమ్మకం. మూగ జీవాలను ఇంట్లో పెంచుకునే వారిలో మన దేశంలోనే చాలా మందే వున్నారు. కుక్కలు, పిల్లులు, కోళ్లు, మేకలు ఇలా ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకుంటుంటారు. అది తినకపోతే విలవిల లాడుతుంటారు. కనిపించకపోతే ప్రాణాలే పోయేంత పని జరుగుతంది. ఈ కోవకు చెందిందే ఘటన. తన పిల్లులను ఎవరో విషం పెట్టి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా వాటిని పోస్ట్ మార్టం చేసి నేరస్తులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు పిల్లుల యజమాని. ఈఘటన హైదరాబాద్ లోని భోలక్ పూర్ లో చోటుచేసుకుంది.
హస్తినకు ఓటర్ జాబితాలో అవకతవకల ఎపిసోడ్
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓట్ల తొలగింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ విపక్షాల ఓట్లను తొలగించేందుకు భారీగా ఫామ్ 7ను వాడి ఫిర్యాదాలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హస్తినకు ఓటర్ జాబితాలో అవకతవకల ఎపిసోడ్ చేరుకుంది. ఈ నెల 28న పోటాపోటీగా టీడీపీ, వైసీపీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీవీతో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో సేవామిత్రా యాప్ ద్వారా ఓటర్ల సమాచారం సేకరించారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను పెద్ద ఎత్తున తొలిగించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు హయాంలోనే ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, ఇప్పుడు వాళ్ళే ఏ ముఖం పెట్టుకుని ఈసి దగ్గరకు వెళతారు?? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని ఈసీ దృష్టికి తీసుకుని వెళతామని ఆయన అన్నారు.
నేను ఎవరో జడిపిస్తే జడిసే రకం కాదు..
శ్రీకాకుళం కత్తెర వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎవరో జడిపిస్తే జడిసే రకం కాదని, 40 ఏండ్లుగా వాస్తవాలు మాటాడుతునే ఉన్నాని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. నా నోరు మూయాలని బాణాలు సందిస్తుంటారు.? అని మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యాఖ్యానించారు. భూములు దోచేసానంటూ ఆరోపిస్తుంటారని, ప్రజల తరుపున నా గొంతు మాట్లాడుతునే ఉంటుందని ఆయన తెలిపారు. ధర్మ బద్దంగా ఓ ఆదాయం కోసం పని చేస్తే తప్పని చూపిస్తున్నారని, నేను ఏంటో .. నా క్యారెక్టర్ ఏంటో నాసన్నిహితులు , నా పౌరులు చెప్పాలన్నారు.
టీటీడీ బోర్డు రాజకీయ పునరావాసంగా మారిపోయింది
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 24 మంది సభ్యులతో పాటు మరో నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఈ పాలకమండలిలో ఉండనున్నారు. అయితే.. ఈ ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్, కమీషనర్, టీటీడీ ఛైర్మన్, టీటీడీ ఈవోలను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. లిక్కర్ కేసులో లింకులు ఉన్న శరత్ చంద్రారెడ్డి ని బోర్డు సభ్యునిగా నియమించడం సమంజసం కాదన్నారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాసం గా మారిపోయిందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. 2019లో 81 మందిని బోర్డు సభ్యులుగా నియమించారని, కోర్టు సూచనతో 51 మందిగా కుదించారని ఆయన అన్నారు.