Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. వైసీపీ నేతల హెచ్చరిక!

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అరెస్ట్‌లతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే ప్రజల నుంచి తిరిగుబాటు తప్పదన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్షంపై కక్ష్య పూరితంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. కాకాణిని అదుపులోకి తీసుకోవడంపై నెల్లూరు జిల్లా పోలీసులు అధికారిక ప్రకటన చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితర అభియోగాలపై శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసు స్టేషన్‌లో కాకాణి గోవర్ధన్‌ రెడ్డిపై కేసు నమోదయింది. ఈ కేసులో నాలుగో నిందితుడి (ఏ4)గా ఉన్నారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు పలుమార్లు నోటీసులిచ్చినా.. కాకాణి వాటిని బేఖాతరు చేశారు. అరెస్టు తప్పదని గ్రహించిన తర్వాత అజ్ఞాతంలో ఉండి.. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేసిన నిరాశ తప్పలేదు. గత రెండు నెలలుగా పరారీలో ఉన్న కాకాణి.. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు హైదరాబాద్‌లోని పలుచోట్ల తలదాచుకున్నారు. చివరకు బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరిలోని రిసార్ట్‌లో ఉన్నట్లు తెలుసుకున్నా పోలీసులు ఆదివారం సాయంత్రం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

నేడు రాయలసీమను తాకనున్న రుతుపవనాలు.. 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు!

నైరుతి రుతుపవనాలు కేరళతో పాటు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాగల మరికొద్ది గంటల్లో రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దాంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తా జిల్లాల్లో వానలు, ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. వారం రోజుల ముందుగానే ఏపీకి రుతుపవనాలు వస్తున్నాయి.

ఐపీఎల్ చరిత్రలో.. సూపర్ ఫాస్ట్ సెంచరీ వీరులు

కేకేఆర్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రెచ్చిపోయి ఆడింది. 278 పరుగులతో కేకేఆర్ బౌలర్లకు నరకం చూపించారు. రెస్ట్ ఆఫ్ సీజన్లో దారుణ విమర్శలు ఎదుర్కొన్న బ్యాటర్లు చివర్లో వరుస విజయాలతో సీజన్ ని ముగించారు. ఈ మ్యాచ్ లో హేన్రిచ్ క్లాస్సేన్, ట్రావిస్ హెడ్ విధ్వంసానికి కేకేఆర్ బౌలర్లు దాసోహమయ్యారు. నలుదిక్కులా షాట్లు బాదుతూ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. ముఖ్యంగా హేన్రిచ్ క్లాస్సేన్ విధ్వంసానికి బౌలర్ల కళ్ళలో రక్తం పారింది. 7 ఫోర్లు, 9 సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో 37 బంతుల్లోనే శతకం బాది చరిత్ర సృష్టించాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు నలుగురు ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేశారు. 2013లో ఆర్సీబీ బ్యాటర్ క్రిస్ గేల్ అప్పటి పూణే వారియర్స్ పై 30 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఆ తర్వాత 14 ఏళ్ళ ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆర్ ఆర్ తరుపున ఆడుతూ గుజరాత్ పై భారీ సెంచరీ నమోదు చేశాడు. వైభవ్ కేవలం 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీ.

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో విషాదం.. అత్తగారి ఇంటికి వెళ్తూ అనంత లోకాలకు

హైదరాబాద్‌ సమీపంలోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో దుర్ఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా దొండపూడికి సెలవుల సందర్భంగా అత్తగారి ఇంటికి వెళ్లే క్రమంలో ఓ మహిళ రైలులో పడ్డారు. ప్రమాదవశాత్తు ట్రైన్ కిందపడి శ్వేత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన రైల్వే స్టేషన్‌ వారిని కన్నీరు పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. శ్వేత, ఆమె భర్త వెంకటేష్, ఇద్దరు పిల్లలతో కలిసి లింగంపల్లి నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో ప్రయాణం ప్రారంభించారు. వారి సీట్లు D-8 బోగీలో ఉండగా, పొరపాటున వారు D-3 బోగీలో ఎక్కారు. అక్కడి ప్రయాణికులు తమ సీట్లు కావని తెలియజేయడంతో, శ్వేత బోగీ మారాలని నిర్ణయించుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి!

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. లారీని కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాళేశ్వరంలో నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు

కాళేశ్వరంలో ఆధ్యాత్మికతతో శోభిల్లిన సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు దంపతులు కలిసి త్రిగుణాత్మక నదుల సాన్నిధ్యంలో స్నానం చేసి పుణ్యఫలాన్ని అందుకుంటున్నారు. తీరం వెంట సైకత లింగాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే, పితృదేవతలకు శ్రాద్ధకర్మలతో తీరాన్ని పరిపూర్ణంగా మార్చారు.

అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేస్తున్నారు..

ఒక్కప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన రకుల్ ప్రీత్ సింగ్‌ మహేష్ బాబు, ఎన్టీఆర్ , అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అలా అనతి కాలంలోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్.. వరుస ప్లాపులతో డీలా పడిపోయింది. దీంతో టాలీవుడ్ నుండి కోలీవుడ్, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కలేదు. కానీ ప్రజంట్ తమిళంలో మాత్రం రెండు మూడు సినిమాలు లైన్‌లో పెట్టింది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అబార్షన్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది..

మహానాడు పనుల్లో బిజీగా మంత్రి నిమ్మల.. పార చేతపట్టి మరీ..!

కడపలో టీడీపీ ‘మహానాడు’ సంబరం మంగళవారం ప్రారంభమవుతోంది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా వైఎస్సార్‌ కడప జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. రేపటి నుండి మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. మహానాడు పనుల్లో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బిజీగా ఉన్నారు. మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్‌గా ఉన్న నిమ్మల.. వర్షం కారణంగా సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. పార చేతపట్టి మట్టి తొవ్వుతూ.. సభా ప్రాంగణాన్ని చదును చేశారు. వర్షం వచ్చినా మహానాడు నిర్వహణకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని చర్యలు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నిన్న కురిసిన వర్షానికి కాస్తంత ఆటంకం కలిగినా.. రాబోవు మూడు రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రెంసింగ్ పనులు చేపట్టినట్లు వివరించారు. వచ్చే 4-5 రోజుల పాటు వర్షాలు ఉన్నాయన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో మహానాడు ప్రాంగణంలో మంత్రి నిమ్మల ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

ఏరోజూ సినిమా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టలేదు.. మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు!

మమ్మల్ని కలవ లేదని ఏరోజూ తెలుగు సినిమా నిర్మాతల్ని తాము ఇబ్బంది పెట్టలేదని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సినీ ప్రముఖులు కలవలేదని తాము ఎప్పుడైనా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా? అని ప్రశ్నించారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ముందు ప్రపంచంలో థియేటర్లో బంధు అనే విషయం ఎందుకు బయటకు వచ్చిందన్నారు. సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది స్పష్టమైన వైఖరి అని పేర్కొన్నారు. సినిమా విషయాలపై పరిజ్ఞానం లేని వారు మాట్లాడుతున్నారని మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. ఏపీ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి, సినీ రంగానికి సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పలు పరిణామాల గురించి మంత్రి కందుల దుర్గేష్‌ స్పందించారు. రాజమహేంద్రవరంలో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది స్పష్టమైంది. త్వరలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొత్త పాలసీ తీసుకురాబోతున్నాం. సినిమా ఇండస్ట్రీ వారితో చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సినిమా పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది. కొందరి మాటలు అహంభావపూరితంగా ఉన్నాయి. ప్రతిసారీ ఎవరో ఒకరు టికెట్లు పెంచమని వస్తున్నారు, మేం ఓకే చేస్తున్నాం. ఆ వెంటనే ఎవరో ఒకరు కోర్టుల్లో పిల్‌ వేస్తున్నారు. అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయినా మేం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం మేం రేట్లు పెంపునకు అనుమతిస్తున్నాం’ అని అన్నారు.

కవిత లేఖ కలకలం.. కేసీఆర్ పై ఈటల షాకింగ్ కామెంట్స్

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. గులాబీ పార్టీలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటల మాట్లాడుతూ, కేసీఆర్ ఒకరిపై నెగటివ్ అభిప్రాయం పెంచుకుంటే ఇక ఆయనను ఒప్పించటం అసాధ్యమని అన్నారు. కవిత విషయంలోనూ ఇదే జరిగింది అని భావిస్తున్నట్లు తెలిపారు. “కేసీఆర్ తనకు తాను చక్రవర్తిలా భావిస్తారు. ఆయనను ఎవరు ప్రశ్నించకూడదు, విమర్శించకూడదు. ఆయన మాటే శాసనం,” అని ఈటల వ్యాఖ్యానించారు.

 

Exit mobile version