టాటా వారి మొట్టమొదటి భారతీయ చిప్ ఫ్యాక్టరీలో నియామకాలు షురూ
భారతదేశంలో సెమీకండక్టర్ విప్లవం తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. అమెరికన్ సెమీకండక్టర్ కంపెనీ మైక్రోన్ టెక్నాలజీ భారతదేశంలో తన మొదటి ప్లాంట్‌ను ప్రారంభించింది. మైక్రాన్ ఈ ప్లాంట్ కోసం భారతీయ కంపెనీ టాటా ప్రాజెక్ట్స్ సహాయం తీసుకుంది. ఈ ప్లాంట్ కోసం కంపెనీ నియామక ప్రక్రియను కూడా ప్రారంభించింది. మైక్రోన్ లిమిటెడ్ ప్లాంట్ గుజరాత్‌లోని సనంద్‌లో నిర్మించబడుతోంది. కంపెనీ తన ప్రతిపాదిత ఫ్యాక్టరీలో 2.75 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఇందుకోసం మైక్రాన్ శనివారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించింది. సనంద్ ఇండస్ట్రియల్ ఏరియాలో మైక్రాన్ మొట్టమొదటి భారతీయ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
పెళ్లి తర్వాత.. పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా మొదటి ఫోటో!
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగవైభవంగా జరిగింది. ఆదివారం ‘ది లీలా ప్యాలెస్’లో జరిగిన ఈ వేడుకకి పరిణీతి-రాఘవ్ కుటుంబాలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీ, పంజాబ్‌ల సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లు కొత్త జంటను ఆశీర్వదించారు.
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లి వేడుక మూడు రోజులు అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా కొత్త జంట ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే అధికారికంగా పెళ్లి ఫోటోలను రిలీజ్ చేయనున్నారు. అయితే వివాహం అనంతరం పరిణీతి-రాఘవ్ జంటగా దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పరిణీతి సీక్విన్డ్ పింక్ చీరలో భర్త రాఘవ్ చద్దాతో కలిసి పోజులిచ్చారు. పరిణీతి నుదుటిపై సిందూరం ఉంది. మే నెలలో ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
నేడు జైలులో చంద్రబాబుతో ములాఖాత్ కానున్న కుటుంబ సభ్యులు
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదర్కొంటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. నేటికి 16వ రోజుకు చంద్రబాబు రిమాండ్ చేరింది. అయితే.. నేడు జైలులో చంద్రబాబుతో ములాఖాత్ కానున్నారు కుటుంబ సభ్యులు. ఉదయం 8 గంటల తర్వాత ములాకాత్ కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ములాఖాత్ కు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణితోపాటు మరొకరు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబును మళ్లీ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీకి ఎందుకు..? ఇంకా ఏం చేయాల్సి ఉంది..? అనేదానిపై ఏసీబీ న్యాయమూర్తికి సీఐడీ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. దీంతో రిమాండ్ ఇవ్వాలన్న సీఐడీ వాదనలపై చంద్రబాబు తరపున లాయర్ పోసాని వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమాండ్ పొడిగిస్తే కారణాలు చెప్పాలని పోసాని డిమాండ్ చేయగా.. సీఐడీ తరఫు లాయర్లు వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత అక్టోబర్-05 వరకు చంద్రబాబును రిమాండ్ విధిస్తున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
చైనా బొగ్గు గనిలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
దక్షిణ చైనాలోని బొగ్గు గనిలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది మరణించారు. గుయిజౌ ప్రావిన్స్‌లోని పంఝౌ నగరంలోని షాంజియావోషు బొగ్గు గనిలో మంటలు చెలరేగాయని స్థానిక యంత్రాంగం తెలిపింది. పంఝౌ నగర ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటన ప్రకారం, గనిలోని కన్వేయర్ బెల్ట్‌కు మంటలు అంటుకోవడంతో మరణించిన వారు చిక్కుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేసే చైనా, దాని పవన, సౌర విద్యుత్ సామర్థ్యాన్ని భారీగా విస్తరించినప్పటికీ విద్యుత్ కోసం బొగ్గుపై ఎక్కువగా ఆధారపడి ఉంది. దేశంలోని బొగ్గు గనుల పరిశ్రమ ఇటీవలి సంవత్సరాలలో కార్మికులకు భద్రతా పరిస్థితులను మెరుగుపరిచింది. అయితే అలాంటి ప్రమాదాల వల్ల మరణాలు ఇప్పటికీ సంభవిస్తున్నాయి.
రేపు సీఎం జగన్ గడప గడపకు కార్యక్రమంపై సమీక్ష
రేపు ఏపీ సీఎం జగన్ గడప గడపకు సమీక్ష నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పై సమీక్ష నిర్వహించి చర్చించనున్నారు. ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం జగన్ కి నివేదికలు చేరడంతో.. ఎమ్మెల్యేల భవిష్యత్తు తేలేది రేపేనా అని ఆయన అందరూ భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మారుతున్న పొత్తుల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. విస్తృతమైన బహిరంగ చర్చలు, కార్యకర్తలతో సమావేవాలు, అభ్యర్థుల ప్రకటనలు, ప్రతిపక్ష పార్టీలపై అవలంబించే వ్యూహం కోసం ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రజల పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ విస్తృతంగా ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.
హైదరాబాద్‌లో బయటపడ్డ ఫేక్ డాక్టర్ బండారం.. బాధితుల్లో వీఐపీలు..!
కూరగాయలు అమ్మే వారితో బేరం కుదుర్చుకుని కూరలు తీసుకుంటాం.. అదేంటో.. కాస్త జబ్బు అయితే ఎవరు ఏం చెప్పినా నమ్మి.. అసలు వైద్యులా కాదా అని కూడా తెలియకుండా వెళ్లి లక్షలు చెల్లిస్తాం. కారణం ఆరోగ్యం బాగుంటే మళ్లీ అయినా సంపాదించుకోవచ్చు కదా అనే నమ్మకం. అయితే కొంతమంది చేసే చేష్టలు డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ.. అవివేకంగా చేసే వాళ్లతీరుపై అమాయకులో లేక ఆలోచించి పనులు చేస్తారో అర్థంకానీ పరిస్థితిలో ఉంటారు. డబ్బుపెట్టి ఏదైనా కోనాలన్నా.. తినాలన్నా అనే ఆలోచించే వారు ఒక్కొక్కసారి వారు చేసే పనులపై వారికే అవగాహన లేకుండా పోతుంటుంది. వివేకాన్ని వదిలేసి మూఢనమ్మకాలతో మత్తులో కూరుకుపోయి.. అన్నీ సమర్పిస్తాం. కానీ.. వీటన్నింటికీ కారణం.. మనలోని ఆ విపరీతమైన జాగ్రత్త, భయం, అమాయకత్వమే. వీరికి మద్దతుగా కొందరు నకిలీ బాబాలు, నకిలీ వైద్యులు పుట్టుకొస్తున్నారు. అలాంటి ఓ నకిలీ ఆయుర్వేద వైద్యుడు వెలుగులోకి వచ్చాడు.
పార్కింగ్ విషయంలో గొడవ..పోలీసు చెంప దెబ్బ కొట్టడంతో మృతి
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవల కారణంతోనే మనుషుల ప్రాణాలను తీసేస్తున్నారు. తమ పంతం నెగ్గించుకోవడం కోసమో, ఇగోల కారణంతోనే ఎదుటివారిపై దాడి చేస్తున్నారు. ప్రాణాలంటే విలువలేకుండా క్షణాల్లో హత్య చేసేస్తున్నారు. తరువాతి పరిణామాలు, జీవితం గురించి ఆలోచించకుండా విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. ఈ ఘర్షణలో విచక్షణ కోల్పోయి ఓ వ్యక్తిని కొట్టింది ఓ పోలీసు అధికారి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో జరిగింది ఈ షాకింగ్ ఘటన. వివరాల ప్రకారం ఎస్‌ఆర్‌పీఎఫ్‌కు చెందిన నిఖిల్ గుప్తా వథోడా పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న తన చెల్లిల్ని చూడటానికి వచ్చాడు. ఆయన రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పని చేస్తున్నాడు. ఇంటి ముందు కారు పార్క్ చేస్తుండగా హెడ్‌లైట్ హైబీమ్‌లో ఉండటంతో అక్కడే ఉంటున్న స్థానికుడు 54 ఏళ్ల వ్యక్తి మురణీధర్ రామరావ్‌జీ నవారే ఇబ్బంది పడ్డాడు. దీంతో కారు లైట్ లో బీమ్ లో పెట్టి పార్క్ చేయాలని సూచించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన నిఖిల్, నవారే చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
రాష్ట్రంలో కక్ష్య సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి
రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రంలో కక్ష్య సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 15 రోజులుగా ఎమ్మెల్యేలు, మంత్రులు వెకిలి మాటలు, వికృత చేష్టలతో ప్రజల దృష్టి మరల్చుతున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం కక్ష్య సాధింపులపై పెడుతున్న దృష్టి.. వ్యవసాయం, రైతాంగం సమస్యలపై దృష్టి పెట్టడం లేదని సత్యకుమార్ ఆరోపించారు. ఏడు సార్లు కరెంట్ చార్జీలు పెంచారు… కరెంట్ కోతలు పెరిగాయని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో నిత్యావసరాల ధరలు ఉన్నాయన్నారు సత్యకుమార్. స్కిల్ డెవలప్మెంట్ కేసులానే… వైసీపీ ప్రభుత్వ బైజూస్ అవినీతి కూడా బయటకు వస్తుందని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.
తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన భారత్!
ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులకు సవరించగా.. 28.2 ఓవర్లలో 217 పరుగులకు స్మిత్ సేన ఆలౌట్ అయింది. రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. సిక్సుల వర్షం కురిపిస్తూ భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో భారత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు మొత్తం 18 సిక్స్‌లు బాదారు. దాంతో వన్డేల్లో 3000కి పైగా సిక్స్‌లు బాదిన తొలి జట్టుగా టీమిండియా రికార్డుల్లో నిలిచింది. వన్డే చరిత్రలో భారత్ 3007 సిక్స్‌లతో కొనసాగుతోంది. ఏ జాబితాలో వెస్టిండీస్ 2953 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ (2566), ఆస్ట్రేలియా (2476), న్యూజీలాండ్ (2387), ఇంగ్లండ్ (2032), దక్షిణాఫ్రికా (1947), శ్రీలంక (1779)లు వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో నెదర్లాండ్స్ (307) చివరి స్థానంలో ఉంది.
రెండు టికెట్లు ఇస్తా అన్నారు.. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌లో చేరుతా..
కాంగ్రెస్‌లో మాకు రెండు టికెట్లు ఇస్తానని హామీ ఇచ్చారని.. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌లో చేరుతా అని మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా అని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీకి వెళతానని అన్నారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌లో చేరుతా అని క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ సోనియా గాంధీ అంటే నాకు గౌరవం అన్నారు. వాళ్ళ నుంచి నేను ఎన్నో ఆదర్శాలను నేర్చుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో చేరిన తర్వాత హైదరాబాద్‌లో సోనియాగాంధీతో సభ ఉంటుందని మైనంపల్లి తెలిపారు.
ఇక తాజాగా.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ఓ వీడియోను రిలీజ్ చేస్తూ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మైనంపల్లి ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు. మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ నిరాకరిస్తున్నానని.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మైనంపల్లి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. “నేను భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నేను నా నియోజకవర్గం మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ను తిరస్కరించాను. నా మద్దతుదారులు మరియు నియోజకవర్గాలతో చాలా చర్చలు మరియు సంప్రదింపుల తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలో చేరినప్పుడు.
చంద్రబాబు పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ
న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. అయితే రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని సీజేఐ వారికి చెప్పారు. చంద్రబాబు ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ అడిగారు. రేపు మెన్షన్ లిస్టులో పూర్తిగా వింటామని చెప్పారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని లూథ్రా వాదించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యవహారం అని… అక్కడ ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని సిద్దార్థ లూథ్రా చెప్పారు. ఎన్ని రోజుల నుంచి కస్టడీలో ఉన్నారని సీజేఐ అడుగగా.. ఈనెల 8న అరెస్టు చేశారని లూథ్రా చెప్పారు. దీంతో రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని సీజేఐ సూచించారు. ఏపీ ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గీ, సీఐడీ తరపున వాదించిన రంజిత్ కుమార్‌లు కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.
రేవంత్ గారూ.. ఢిల్లీ కేసులు సరే.. మరి గల్లీ కేసుల సంగతేంటి?
రేవంత్ రెడ్డి ఢిల్లీ కేసులు మాట్లాడుతున్నారు మరి గల్లీ కేసులు ఎందుకు మాట్లాడుతలేరని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక క్యాంపు కార్యాలయంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు, అధ్యక్షులు అబద్దాల పునాదుల మీద అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ మీద బట్ట కాల్చి మీదేసి హెడ్లైన్స్ లో మొదటి పేజీ వార్తల కోసం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎంపీలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టీ, లిక్కర్ కేసులో ప్రెస్ మీట్ పెట్టీ దాని మూలాలు ఆంధ్ర, తెలంగాణకు ఉన్నాయని చెప్పారు. అప్పుడు Ed, cbi మీ జేబు సంస్థనా అని అన్నారు. Cwc సమావేశం నుంచి కొత్త కొత్త అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కవిత అరెస్ట్ అయితది అని రేవంత్ అంటున్నారు.. అంటే ED lu, సీబీఐ లు మీ జేబు సంస్థలా? మీకు సమాచారం ఎట్లా వచ్చింది? అని ప్రశ్నించారు. అప్రూవర్ గా మారిన దాంట్లో మీ చట్టాలు ఉన్నారు కదా ఆయన చెప్పాడా? వాళ్ళు మీకు చెప్పారా? అన్నారు. కవితతో మీ వ్యాపార సంబంధం తెంచుకోమని చెప్పాడా? అన్నారు.
కక్ష్య పూరిత రాజకీయాలు కాకుండా… ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి
రాష్ట్రంలో ప్రజలు , సమస్యల గురించి ఆలోచించడం లేదన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించాలనే ప్రభుత్వం ఆలోచన ఉందన్నారు శైలజానాథ్. కక్ష్య పూరిత రాజకీయాలు కాకుండా… ప్రజలకు మేలు చేసే పనులు చేయాలన్నారు శైలజానాథ్. ఎవర్ని జైలులో పెట్టాలా అని ఎమ్మెల్యేలు, మంత్రులు ఆలోచిస్తున్నారని, ప్రభుత్వం చేతగాని తనం వల్ల అనంతపురం జిల్లాలో వంద ఎకరాల్లో కూడా వరి పంట సాగు చేయలేదన్నారు శైలజానాథ్. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే.. అంత మంచిదని, టీటీడీ బస్ దొంగతనం జరిగితే దిక్కులేదన్నారు. రాజధానిగా అమరావతిని ఉంచండి… లేదంటే మా రాజధాని మాకు ఇవ్వండని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. రాయలసీమలో ఎక్కడైనా మా రాజధాని ఏర్పాటు చేయండని, బీజేపీ ప్రమేయం లేకుండా చంద్రబాబు అరెస్ట్ జరగదు అంటే… అన్ని వేళ్ళు బీజేపీ వైపు చూపిస్తున్నాయన్నారు శైలజానాథ్.
