దేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జిని నేడు జాతికి అంకితం ఇవ్వనున్న మోడీ
తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిని సందర్శించిన తర్వాత, ప్రధాని మోడీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రధానమంత్రి రాష్ట్రానికి రూ. 52 వేల కోట్లకు పైగా కొత్త ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వనున్నారు. కాగా, సుదర్శన్ బ్రిడ్జిని కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ వంతెనను గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలో నిర్మించారు. దీనికి ముందు వారణాసి ప్రజలకు వేల కోట్ల విలువైన కానుక కూడా ఇచ్చాడు.
జామ్‌నగర్, ద్వారక, పోర్ బందర్ జిల్లాల్లో రూ.4 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లలో చేర్చబడిన సుదర్శన్ సేతును కూడా మోడీ ఈరోజు ప్రారంభించనున్నారు. సమాచారం ప్రకారం, ఈ వంతెన ప్రధానమంత్రి కలల ప్రాజెక్ట్, ఇది ప్రజలకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. సుదర్శన్ సేతు 2.32 కిలోమీటర్ల పొడవుతో ఇప్పటివరకు భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్టెడ్ వంతెన. ఈ వంతెన నిర్మాణానికి మొత్తం రూ.980 కోట్లు ఖర్చు చేశారు. ఈ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని, బెట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతుంది.
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ముగ్గురికి నో టికెట్
టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. తొలి జాబితాలో ఉండవల్లి శ్రీదేవికి(తాడికొండ) కాకుండా శ్రవణ్ కుమార్, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్రెడ్డికి కాకుండా కాకర్ల సురేశ్కు టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్లు కేటాయించారు. అలాగే ఆనం రాంనారాయణరెడ్డి(వెంకటగిరి) పేరు ఫస్ట్ లిస్టులో లేదు. కేవలం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి మాత్రమే నెల్లూరు రూరల్ టికెట్ దక్కింది. అయితే.. టీడీపీ – జనసేన తొలి జాబితా: తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈరోజు ప్రకటించారు. ఉమ్మడి జాబితా రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాన్ని నిర్ధారిస్తుంది.
హైదరాబాద్ లో భారీగా పెరిగిన కాలుష్యం.. గ్రీన్ పీస్ ఇండియా సర్వేలో వెల్లడి
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అనేక అంశాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే భాగ్యనగరం ముందుంది. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం చాలా మంది హైదరాబాద్‌కు వలస వస్తుంటారు. అయితే నంబర్ వన్ సిటీగా నిలవాలనుకుంటున్న మన నగరం మాత్రం పెను ప్రమాదంలో పడింది. హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దక్షిణ భారతదేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ అత్యంత కాలుష్య నగరం. గ్రీన్ పీస్ ఇండియా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు కొచ్చి వంటి దక్షిణ భారత మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం స్థాయిని తెలుసుకోవడానికి గ్రీన్‌పీస్ ఇండియా ఒక సర్వే నిర్వహించింది. ఇతర నగరాల కంటే భాగ్యనగరంలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బెంగళూరు, కొచ్చి, చెన్నైలతో పోల్చితే హైదరాబాద్‌లో 2.5 PM కాలుష్య కారకాలు ఉన్నట్లు తేలింది.
విజయనగరంలో పర్యటించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలోని భాష్యం స్కూల్ వెనుక సీనియర్ సిటిజన్స్ సమావేశంలో పాల్గొంటారు. 37వ వార్డులో తాగునీటి సరఫరా టాంక్ ను, ఆర్ అండ్ బి కూడలి నుంచి అయ్యన్న పేట వరకు నూతనంగా నిర్మించిన రోడ్డును ఆర్ అండ్ బి కూడలి వద్ద ప్రారంభిస్తారు. మెరకముడిదాం మండల పరిషత్ కార్యాలయం చేరుకొని మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షిస్తారు. చీపురుపల్లి చేరుకొని వైశ్య కల్యాణ మండపం చేరుకొని ఆ కుల పెద్దలతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. మూడు రోడ్ల కూడలి వద్ద పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. గరికివలస లో గ్రామ సచివాలయం, రైతు కేంద్రం, ఆరోగ్య కేంద్రం భవనాలను ప్రారంభిస్తారు.
నేడు ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి వివ్రమార్క, మంత్రి తుమ్మల పర్యటన
ఉమ్మడి జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు వైరా మండలం స్నానాల లక్ష్మీపురం చేరుకుని సోదరుడి దశదినకర్మ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకు సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు. టేకులపల్లి మండలం కోయగూడెంలో సభలో పాల్గొన్న అనంతరం ఖమ్మం చేరుకుని బస చేస్తారు. భట్టి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం జిల్లాకు రానున్నారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోదరుడి దశదినకర్మలో పాల్గొన్న అనంతరం సాయంత్రం కొత్తగూడెంలో సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడి నుంచి తుమ్మల హైదరాబాద్ వెళ్తారు.
కార్యకర్తల ఆలోచన విధానమే మా ఆలోచన విధానం
ఏపీలో రాజకీయం వేడెక్కింది. నిన్న టీడీపీ-జనసేన పార్టీలు అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్లో అసంతృప్తి సెగలు రగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ జనసేనకు కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి వర్గం స్పందించారు.. 25 ఏళ్లుగా గతంలో సంపర, ప్రస్తుతం కాకినాడ రూరల్ టీడీపీ బీసీలకు కేటాయిస్తుందని పార్టీ నిర్ణయంతో శెట్టిబలిజలు మనస్తాపం చెందారని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణ. కార్యకర్తల ఆలోచన విధానమే మా ఆలోచన విధానం అని రెండు మూడు రోజుల్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్తున్నారు..
రెండు రోజులు తగ్గనున్న పగటి ఉష్ణోగ్రతలు.. సిటీలో వర్షం కురిసే ఛాన్స్
తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దక్షిణ తెలంగాణ నుండి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఒక ఎత్తైన ఉపరితల ద్రోణి ఉంది. దీంతో నేడు మరాఠ్వాడా నుండి దక్షిణ థమినాడు వరకు కర్ణాటక అంతర్భాగం మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నేడు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే సమయం కారణంగా హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమైంది. రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
టీడీపీ – జనసేన మొదటి లిస్ట్ పై నేతల అసంతృప్తి
టీడీపీ – జనసేన మొదటి లిస్ట్‌పై నేతల అసంతృప్తి వ్యక్తి చేస్తున్నారు. అవనిగడ్డ సీటు పెండింగ్‌లో పెట్టింది టీడీపీ అధిష్టానం. టికెట్ ఆశించిన మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఫేస్ బుక్ పోస్ట్ లో టీడీపీ పై, రాజకీయాలపై నైరాశ్యం వ్యాఖ్యలు చేశారు. అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారని ఇప్పటికే ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో.. పెడన సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ చంద్రబాబు, పవన్ ను కలిసిన తర్వాత నిర్ణయం ఉంటుందని ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. మొదటి లిస్ట్ లో నా పేరు లేకపోవటంతో మహదానందంగా ఉన్నాన్నారు.
టీడీపీలో లెక్క చిక్కులు..
గుంటూరు టీడీపీలో లెక్క చిక్కులకు దారి తీసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన ప్రకటించిన 12 స్థానాలు ఒక లెక్క ఉంటే.. ప్రకటించాల్సిన ఐదు స్థానాలు మరో లెక్కగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా వర్గ పోరు, ఆశావాహుల లిస్టు పెద్ద ఎత్తున ఉన్న నియోజకవర్గాల అభ్యర్థుల లిస్టును పెండింగ్ లో పెట్టింది టీడీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో.. ఆచితూచి అడుగులు వేస్తోంది టీడీపీ. పలనాడు జిల్లాలోని కీలక నేత యరపతినేని శ్రీనివాసరావు కు సీటును మొదటి లిస్టులో ప్రకటించకపోవడంతో పలనాడులో తీవ్ర చర్చకు దారితీసింది. యరపతినేనికి సీటు ఇస్తారా లేదా అంటూ చర్చ మొదలైంది. అంతేకాకుండా.. గురజాల నియోజకవర్గంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు, పల్నాడు జిల్లా కేంద్రంలో టీడీపీ గెలిచి తీరాలన ఆలోచనతో యరపతినేనికి స్థాన బదిలీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. యరపతినేనిని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేపిస్తారని వార్తలు గుప్పుమన్నాయి. అందుకే గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టును టీడీపీ ప్రకటించలేకపోయిందని భావిస్తున్నారు టీడీపీ సీనియర్లు… ఇక గురజాల నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీలో చేరబోతున్న జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇస్తారా లేదా అన్న సందిగ్ధత నెలకొంది.
