NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు!

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబర్ 19న హోమ్ డెలివరీ అయిన డెడ్ బాడీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి శ్రీధర్ వర్మ అని పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ అందుకున్న సాగి తులసి చెల్లెలి భర్తే ఈ శ్రీధర్ వర్మ. నిందితుడు చిక్కితే కేసులో చిక్కుముడులు వీడే అవకాశాలు ఉన్నాయి. కేసులు త్వరగా చేదించేందుకు ఉండి పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పునఃప్రారంభం

హైదరాబాద్ (HYD) నుంచి యాదాద్రి (Yadadri) , వరంగల్ (Warangal) మార్గంలో పెండింగ్లో ఉన్న ఉప్పల్-నారపల్లి (Uppal-Narapalli) ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులకు మోక్షం లభించింది. గాయత్రి కన్‌‌స్ట్రక్షన్స్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ మొదటి వారంలో హెచ్చరించడంతో, టెండర్ రద్దు చేయడం జరుగుతుందని, ఈ హెచ్చరికపై కంపెనీ పనులను తిరిగి ప్రారంభించింది. ఈ ఫ్లై ఓవర్ ను హైదరాబాద్ నుంచి యాదాద్రి-భువనగిరి-వరంగల్ మార్గంలో రద్దీ తగ్గించేందుకు నిర్మిస్తున్నారు. మొత్తం ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రారంభించాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ ఫ్లై ఓవర్ నిర్మించబడుతోంది. ఈ ప్రాజెక్టుకు రూ.600 కోట్లగా అంచనా వేసినప్పటికీ, 2020 జూలైలో పూర్తి చేయాల్సిన పనులు వివిధ కారణాల వల్ల ఆలస్యమయ్యాయి.

340 మందికి నియామక పత్రాలు అందజేసిన బండి సంజయ్

హకీం పేట్ లోని నిసా కేంద్రంలో రోజ్ గార్ మేళా లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. 340 మందికి నియామక పత్రాలను బండి సంజయ్ అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. దేశ యువత సాధికారత లక్ష్యంగా ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అంకితభావం, పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన వారికి అభినందనలు తెలిపారు బండి సంజయ్‌. అంతేకాకుండా.. సీఐఎఎస్, బిఎస్ఎఫ్, ఐటీవీపీ, ఐఐటీ లలో ఉద్యోగాలు రావడం సంతోషమన్నారు. ప్రధాని మోడీ కి ఇష్టమైన కార్యక్రమం రోజ్ గర్ మేళా అని ఆయన వ్యాఖ్యానించారు.

మీడియాకు క్షమాపణలు చెప్పిన సీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. తన వ్యక్తిగత ఎక్స్ ఖాతా ద్వారా, “విచారణ కొనసాగుతున్న సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా రెచ్చగొట్టే ప్రశ్నలు వేయరంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయాను. నేను చేసినది పొరపాటుగా భావిస్తున్నాను. పరిస్థితులు ఏవీ అయినా, సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. నా వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుతున్నాను” అంటూ పోస్ట్ చేశారు.

నేను చెబితే సీఎం చంద్రబాబు చెప్పినట్టే.. ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు!

కర్నూలులో నిర్వహించిన కూటమి కార్యకర్తల సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాను చెబితే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టే అని, తాను చెబితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లే అని పేర్కొన్నారు. వైసీపీకి చెందిన వారు ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు వదలేసి వెళ్లాలని హెచ్చరించారు. వైసీపీ వారు లబ్ధి చేకూర్చే అన్నింటిని విడిచి పెట్టాలని, లేకపోతే లెక్క వేరేగా ఉంటుందని ఎమ్మెల్యే పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల అనంతరం బీజేపీ కార్యకర్తలు 5 రేషన్ షాపులకు తాళాలు వేశారు. మరికొన్ని చోట్ల రేషన్ షాపులు తమకే అని లాగేసుకున్నారు.

ఇతర దేశాలతో నిల్బడడంలో ఆర్థిక సంస్కరణలు చేసిన ఘనుడు.. పీవీ

భారత రత్న స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా పీవీ ఘాట్ వద్ద రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు నివాళులు అర్పించారు. అనంతరం పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి భారతరత్న క్యాలండర్ ను ఆవిష్కరించారు. పీవీ నరసింహారావు ఘాట్ ప్రాంగణంలో ఐ క్యాంప్ ను ప్రారంభించి కళ్లద్దాలు అందజేశారు.. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దు బిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కి సంబంధించిన బిడ్డ అని ఆయన వ్యాఖ్యానించారు. వారు అంత అత్యున్నత స్థానానికి ఎదగడానికి మన అందరికీ గర్వ కారణమన్నారు మంత్రి పొన్నం. వారి వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వారి జ్ఞాపకాన్ని, వారు ఇచ్చిన మార్గదర్శకత్వం ఈనాటి యువత అవలంభించినట్లైతే అందరూ సన్మార్గంలో నడుస్తారన్నారు.

మేయర్ పక్కనే కుర్చీ వేయాలి.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి డిమాండ్!

కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. కార్పొరేషన్ సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దాంతో వైసీపీకి చెందిన మేయర్‌ సురేశ్‌ బాబు తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పక్కనే తనకు కుర్చీ వేయాలని డిమాండ్ చేశారు. ‘హూ ఈజ్ జైశ్రీ’ అంటూ మేయర్ స్టేడియం వద్ద నినాదాలు చేశారు. రెండు అంతస్తులు పర్మిషన్ తీసుకొని.. నాలుగు అంతస్తులు ఎలా కడుతున్నారు? అని ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మండిపడ్డారు. దాంతో పోడియం వద్ద టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

రేవతి కుటుంబానికి అండగా తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. రేవతి కుటుంబానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి రూ.25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ ప్రస్తుతం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. శ్రీతేజ్ వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.

రికమెండేషన్లకు తలొగ్గకుండా నియామక పత్రాలు

రోజ్‌గారి మేళాలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొని ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 10 రోజ్ గార్ మేళాలు పూర్తి అయ్యాయి… ఇది 11 వ మేళా అని ఆయన అన్నారు. ఈ రోజుతో (ఈ 11 మేళాలో) కలుపుకొని సుమారుగా పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు కిషన్‌ రెడ్డి. ప్రతి నెల ఉద్యోగ నియామకాలు జరగాలి, ఖాళీలు ఉండొద్దు అని ప్రధాని ఆదేశాలు ఇచ్చారన్నారు. అందుకే రెగ్యులర్ గా నియామకాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. గతంలో ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగేది… ఇప్పుడు పూర్తిగా పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని, నా మంత్రిత్వ శాఖలో మొత్తం రెగ్యులర్ కాంట్రాక్టు ఇతర కలిపి 8 లక్షల ఉద్యోగులు ఉంటారు… ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు కిషన్‌ రెడ్డి.

ఒకటిన్నర ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలిచ్చాం..

నేడు జరుగుతున్న రోజ్‌గార్‌ మేళాలోనూ 71,000 మందికి పైగా యువతకు అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. వారిలోని సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారా సర్కార్ మరింత ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు తమ పాలనలో యువతకు పెద్ద మొత్తంలో కేంద్ర ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గత ఒకటిన్నర ఏళ్లలో ఏకంగా 10 లక్షల ఉద్యోగాలిచ్చాం.. దేశ చరిత్రలో ఇది పెద్ద రికార్డ్‌ అని ప్రధాని మోడీ వెల్లడించారు.

 

Show comments