అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ మళ్లీ వాయిదా
జస్టిస్ కె.ఎం. జోసెఫ్ మరియు జస్టిస్ B.V. నాగరత్న కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ప్రతిపాదిత మూడు రాజధానులు మరియు అనుసంధాన విషయాలపై హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిని అత్యవసరంగా విచారించాల్సి ఉందని రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రతివాదుల (అమరావతి రైతులు) తరపు న్యాయవాదులు దీనికి సంబంధించి కోర్టు అందించిన నోటీసులు గత నెల చివరిలో తమకు అందాయని, కౌంటర్లు దాఖలు చేయడానికి రెండు వారాలు అవసరమని బదులిచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసును ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. అయితే ఈ నేపథ్యంలో.. నేడు విచారణ జరగాల్సిన జాబితాలో ఏపీ రాజధానికి సంబంధించిన కేసు లేకపోవడంతో విచారణ మళ్లీ వాయిదా పడింది. అయితే.. తిరిగి ఎప్పుడు దీనిపై విచారణ చేపడుతారో తెలియరాలేదు. అయితే.. ఇవాళ్టి విచారణ ఎందుకు వాయిదా పడిందనేది ఇంకా స్పష్టత రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వర్సెస్ మూడు రాజధానుల అంశంపై త్వరలో సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ వస్తుందని ఏపీ ప్రభుత్వం ఆశపడుతోంది. అయితే.. అందుకు తగ్గట్టుగానే ఇటీవల కొద్దిరోజులుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా మంత్రులు విశాఖ నుంచి పరిపాలన చేపట్టనున్నామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇన్వెస్టర్లతో జరిగిన వివిధ సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ అశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. అనూహ్యంగా విచారణ మళ్లీ వాయిదా పడింది
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.190 లకే ఫైబర్ నెట్
బోర్డు మీటింగ్ లో 15 అంశాలపై కూలంకషంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పి.గౌతమ్ రెడ్డి. ఎపీఎస్ఎఫ్ఎల్ విస్తరణ కోసం అవసరమైన సాంకేతిక పరికరాల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామని, రాష్ట్రంలో కొత్తగా మరో 24వేల కి.మీ ఎపీ ఎస్ ఎఫ్ఎల్ కేబుల్ వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట వ్యాప్తంగా టిడ్కో, జగనన్న కాలనీల్లో ఏపీ ఫైబర్ కనెక్షన్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిన ఆయన తెలిపారు. టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీలకు ప్రైవేట్ నెట్ వర్కులు కనెక్షన్లు ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రూ. 190కే ఇంటర్నెట్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు గౌతమ్ రెడ్డి. అవసరమైన చోట్ల వినియోగదారులకు డబుల్ బాక్సులు ఇస్తామని, ఇప్పటికే ఇచ్చిన బాక్సులు రిపేర్ కోసం విజయవాడ, విశాఖ, తిరుపతి సహా పలు ప్రాంతాల్లో సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏపీఎస్ఎఫ్ఎల్ వార్షిక జనరల్ బాడీ మీటింగును మార్చి నెలాఖరుకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీఎస్ఎన్ఎల్ ప్రాజెక్టు నుంచి రావాల్సిన వెయ్యి కోట్లల్లో రూ. 500కోట్లు వచ్చాయని, కేంద్రం నుంచి రావాల్సిన మిగిలిన రూ. 500 కోట్లను తెప్పించుకునేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అంతేకాకుండా.. ‘రాష్ట్రవ్యాప్తంగా ఎపీఎస్ఎఫ్ఎల్ ఏర్పాటు చేసిన సీసీటీవీలను హోం శాఖకు అప్పగించాలన్న ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెట్టాం. ప్రభుత్వ కార్యాలయాలు నుంచి ఎపీఎస్ఎఫ్ఎల్ కు రూ. 120 కోట్లు రావాల్సి ఉంది. వాటి వసూలుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం. ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్షన్లకు రేట్లు పెంచే ప్రశ్నే లేదు. ఎవరైనా బ్రాడ్ కాస్టర్లు టారిఫ్ రేట్లు పెంచేందుకు చూస్తే సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయం. ఇతరులు కూడా కనెక్షన్ రేట్లు పెంచవద్దని కోరుతున్నా. సినిమాల కోసం త్వరలో ఎపీఎస్ఎఫ్ఎల్ యాప్ ను తయారు చేసి అందుబాటులోకి తెస్తాం. కొత్త సినిమా రిలీజై సినిమా ధియేటర్లో ప్రదర్శించిన సమయంలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ఓటీటీలో ప్రదర్శించేెదుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏపీఎస్ఎఫ్ఎల్ కు రూ. 50 లక్షల కొత్త బాక్సులు మాకు అవసరమై ఉంది. సీఎం టు సిటిజన్ పద్దతుల్లో కస్టమర్లు ఇబ్బందులు పడకుండా కనెక్షన్లు ఇస్తాం. కొత్త బాక్సులకు సరఫరా కోసం తయారు చేసే కొత్త సంస్థలను ఆహ్వానిస్తున్నాం.కొత్త కంపెనీల ద్వారా బాక్సులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.’ అని ఆయన పేర్కొన్నారు.
కరెంట్ బిల్లు పేరిట సైబర్ మోసం.. ఖాతాలు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు
రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఒక దానిపై ప్రజలు తెలుసుకునే లోపే మరొక సైబర్ నేరానికి తెర లేపుతున్నారు. ఈకాలంలో ఆన్‌లైన్ పేమెంట్లు, షాపింగ్ పెరిగుతుండటంతో.. మోసాలు కూడా అదే రేంజ్‌లో పెరుగుతున్నాయి. దీంతో..ఇక సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. ఎక్కడా లేని విధంగా.. ఎవరూ ఊహించని రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక జనాలను మోసం చేయడానికి సైబర్ మోసగాళ్లు ఎలాంటి మార్గం వదలిపెట్టడం లేదు. అయితే దీనిపై పోలీసులు సైబర్ నేరాల గురించి ఎంత అవగాహన కల్పించినా సరే.. ఏదో రకమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఒకరకమైన నేరాల గురించి అవగాహన కల్పించేలోపే మరో రకమైన మోసాలకు వెలుగులోకి వస్తున్నారు. కాగా.. నిన్నటి వరకు ఓటీపీ స్కామ్ గురించి తెలుసుకున్నాం. కొద్దిరోజుల క్రితం డెలివరీ బాయ్ రూపంలో కేటుగాళ్లు ఎలా మోసాలకు పాల్పడుతున్నారో చూశాం. ఇక తాజాగా మరో రకమైన మోసం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కరెంట్ బిల్లు పేరు చెప్పి అకౌంట్ ఖాళీ చేశారు సైబర్ కేటుగాళ్లు. ఈఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
భారత క్రికెటర్ ఉమేష్ యాదవ్ ఇంట విషాదం
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. తన తండ్రి తిలక్ యాదవ్ (74) కన్నుమూశారు. తిలక్ యాదవ్ తండ్రి కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంతోనే ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినప్పటికీ అతని పరిస్థితి మెరుగుపడకపోవడంతో, ఖపర్ఖేడాలోని మిలన్ చౌక్‌లోని అతని ఇంటికి తీసుకువచ్చారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఉమేష్ తండ్రి బుధవారం సాయంత్రం 6.30 గంటలకు తుది శ్వాస విడిచారు.
బ్రేకప్ గజల్… స్లో పాయిజన్ లా ఉందే…
యంగ్ హీరో నాగ శౌర్య, మాళవిక నాయర్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పలానా అబ్బాయి-పలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసింది. ఇటివలే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన పలానా అబ్బాయి-పలానా అమ్మాయి చిత్ర యూనిట్… తాజాగా ఈ మూవీ నుంచి బ్రేకప్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘కనుల చాటు మేఘమా’ అంటూ సాగే గజల్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. కళ్యాణీ మాలిక్ కంపోజ్ చేసిన సోల్ ఫుల్ ట్యూన్ కి, లక్ష్మీ భూపాల్ రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. ఆభస్, లిప్సిక వాయిస్ ఈ కనుల చాటు మేఘమా సాంగ్ ని బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచాయి. లిరికల్ సాంగ్ లో అక్కడక్కడా ప్లే చేసిన విజువల్స్ లో నాగ శౌర్య, మాళవిక నాయర్ లు విడిపోయిన ప్రేమజంటలా కనిపిస్తున్నారు. మొత్తానికి ఒక్క సాంగ్ తో మేకర్స్ పలానా అబ్బాయి-పలానా అమ్మాయి సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ అవుతుంది అనే నమ్మకం కలిగించారు.
త్వరలోనే అక్కడ బీఆర్ఎస్ న్యూస్ పేపర్..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ పేరును బీఆర్‌ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రో ఇస్తున్న సంగతి అందిరకీ తెలిసిందే. ఈ ప్రణాళికల్లో భాగంగా..ఆయన కొన్ని రాష్ట్రాలపై దృష్టి సారించిన కేసీఆర్ అందులో మరో తెలుగు రాష్ట్ర్టమైన ఆంధ్రప్రదేశ్ కూడాఉంది. అయితే ఇప్పటికే ఏపీలో బీఆర్‌ఎస్ విస్తరణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. అయితే ఇప్పటికే పలువురు ఏపీ నేతలు కూడా బీఆర్‌ఎస్ కండువా కప్పుకప్పుకున్నారు అందులో తోట చంద్రశేఖర్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు కూడా. ఇక పార్టీలో చేరిన రావెల కిషోర్, పార్థసారథి, పలు నేతలకు కూడా కేసీఆర్ పలు బాధ్యతలు అప్పజెప్పారు. కాగా.. ఏపీలో పార్టీ విస్తరణలో భాగంగా అక్కడ తమకు అనుకూల మీడియా ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ప్రజలకు ఏ సమస్య వచ్చిన బీజేపీ అండగా ఉంటుంది : బండి సంజయ్
ప్రజలకు ఏ సమస్యా వచ్చిన బీజేపీ అండగా ఉంటుందని నమ్మకం ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. బీజేపీ పోలింగ్ బూత్ సశక్తి కరణ్ అభియాన్ బూత్ స్థాయిలో బలోపేతం పై ప్రత్యేక దృష్టి సాదించింది. ఈనేపథ్యంలో నేడు కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈకార్యక్రమంలో.. జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జి లు , సశక్తి కరణ్ అభియాన్ రాష్ట్ర, జిల్లా సమన్వయ కమిటీలతోపాటు బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, రాష్ట్ర సహా ఇంఛార్జి అరవింద్ మీనన్ హాజరయ్యారు. సరల్ యాప్, పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్య అంశాలను కింది స్థాయికి తీసుకోవడంపై కూడా సమావేశంలో చర్చించారు. కార్నర్ మీటింగ్ లు జరుగుతున్న తీరు, వస్తున్న స్పందన పై సమీక్ష నిర్వహించారు.
తమ్ముడి గురించి కాలభైరవ ఎమోషనల్ ట్వీట్!
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి ఇద్దరు కొడుకులు. ఒకరు గాయకుడు, సంగీత దర్శకుడు కాలభైరవ కాగా, మరొకరు వర్థమాన కథానాయకుడు శ్రీసింహా! ఇవాళ శ్రీసింహా బర్త్ డే. అతను నటించిన పలు చిత్రాలకు కాలభైరవే సంగీత దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘భాగ్ సాలే’కూ కాలభైరవ స్వరరచన చేస్తున్నాడు. శ్రీసింహా మరో సినిమా ‘ఉస్తాద్’తో పాటు ‘భాగ్ సాలే’ మూవీ నుండి కూడా అతని బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. ఇదే సమయంలో తన తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని కాలభైవర ఎమోషనల్ ట్వీట్ ద్వారా తెలిపాడు. “ఇవాళ నాకు ఎంతో ఇష్టమైన రోజు. నా హీరో, నా బెస్ట్ ఫ్రెండ్ పుట్టిన రోజు. నేను చేసే క్రైమ్ లో వాడు భాగస్వామి, నా బలం కూడా వాడే! నా నిధి, నా ఉత్సాహం, నా ఆనందం అన్నీ అతనే!!” అంటూ శ్రీసింహను భుజానికి ఎత్తుకున్న ఫోటోను కాలభైరవ పోస్ట్ చేశాడు.