పొలాల్లో అల్లం దొంగతనం.. సీసీ కెమెరాలు పెట్టిన రైతన్నలు
గతంలో జరిగిన దొంగతనాలన్నీ బంగారం కోసమో.. డబ్బుల కోసమో జరిగేవి. కానీ ప్రస్తుతం కూరగాయల కోసం దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది ఒకింత ఆశ్చర్యం మరోవైపు ఆందోళన కలిగించే అంశం. ద్రవ్యోల్బణం పెరగడంతో పొలాల్లో పచ్చి కూరగాయలు, మసాలా దినుసుల చోరీ మొదలైంది. టమాటా తర్వాత దొంగలు అల్లం మీద దొంగలు కన్నేశారు. ఒక్కసారిగా ధరలు పెరగడంతో అల్లం చోరీ ఘటనలు ఎక్కువయ్యాయని ఆ పంట సాగు చేసిన రైతులు చెబుతున్నారు. దీంతో లక్షల రూపాయలు నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ పంటలను దొంగల బారి నుంచి కాపాడుకునేందుకు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో అల్లం చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చీకటి పడగానే దొంగలు అల్లం దొంగిలించడానికి బయలుదేరుతారు. పొలంలో రైతు లేని సమయం చూసి అల్లం పంటను ఈ దొంగలు ఎత్తుకెళ్లారు. విశేషమేమిటంటే.. కర్ణాటకకు వచ్చిన తర్వాత అల్లం సాగు చేసే కేరళ రైతులపైనే దొంగలు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అల్లం దొంగతనంపై కేరళకు చెందిన పలువురు రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఏబీవీపీ నాయకుల వీరంగం.. వీసీ, రిజిస్ట్రార్‌పై దాడి.. అడ్డొచ్చిన పోలీసులను వదలలేదు
విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాలు పనిచేస్తాయి. ఇది సర్వసాధారణం. విద్యార్థుల సమస్యలపై మిలిటెంట్ పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. విద్యార్థుల పోరాటాలతో ప్రభుత్వాలు కూలిన సందర్భాలు ఇండియాలో ఉన్నాయి. అయితే విద్యార్థుల సమస్యల పరిష్కారంలో అధికారులతో.. పోలీసులతో విద్యార్థి సంఘాల నాయకుల వాగ్వాదాలు.. గొడవలు సహజం. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏబీవీపీ నాయకులు రెచ్చిపోయారు. యూనివర్సిటీలో సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఆందోళన చేపట్టి చాలా సేపు అయినప్పటికీ యూనివర్సిటీ అధికారులు స్పందించలేదని.. ఏకంగా యూనివర్సిటీ వీసీ, రిజిస్ర్టార్‌పై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైనా ఏబీవీపీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటన సాక్షాత్తు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సొంతూరైన గోరఖ్‌పూర్‌లో జరిగింది.
ఏం కష్టం వచ్చిందో.. రన్నింగ్ బస్సు కింద తలపెట్టిన మహిళ
కేరళలో ఓ మహిళ వేగంగా వెళ్తున్న బస్సు ముందు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువకముందే జగిత్యాల జిల్లాలో ఓ మహిళ కదులుతున్న బస్సు కింద తల పెట్టింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. జులై 20న జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోని బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు ఆగింది. దిగి ప్రయాణికులను ఎక్కించాక కండక్టర్ చిన్నబుచ్చుకోవడంతో డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళ్లాడు. అయితే బస్సు కదలడంతో అక్కడే కూర్చున్న ఓ మహిళ నేరుగా వెనుక టైరు కింద తలపెట్టి నిద్రపోయింది. బస్సు ముందుకు కదులుతుండగా, ఆమె టైర్ల కింద పడి ఉండటాన్ని గమనించిన ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బ్రేకులు వేశాడు. బస్సు ఆమెను అర మీటరు ముందుకు లాగడంతో ఈ ఘటనలో ఆమె కుడి చేతికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు కింద పడిన ఆమెను ప్రయాణికులు బయటకు తీశారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు. బస్సు కింద పడిన మహిళను మెట్‌పల్లికి చెందిన పుప్పాల లక్ష్మిగా గుర్తించారు. అయితే లక్ష్మి కుటుంబ సభ్యులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. లక్ష్మికి బీపీ, షుగర్ ఉన్నాయని చెప్పారు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని.. లక్ష్మి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు.
ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకుంది
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని దిగుబడి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నదని, అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులు సహా మరి కొద్దిరోజుల్లో పూర్తికానున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులతో రాష్ట్రంలో వరిధాన్యం దిగుబడి మరో కోటి టన్నులకు పెరిగి 4 కోట్ల టన్నులకు చేరుకునే అవకాశాలున్నాయని, ఇటువంటి పరిస్థితులల్లో, రాష్ట్ర వ్యవసాయ విధానంలో భాగంగా ఫుడ్ ప్రాసెస్ కంపెనీలను స్థాపించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా మిల్లింగ్ కెపాసిటీని పెంచే దిశగా రాష్ట్రంలో కొనసాగుతున్న మిల్లులకు అధనంగా మరిన్ని అధునాతన రైస్ మిల్లులను అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు.
మైనర్‌పై సామూహిక అత్యాచారం.. తప్పించుకునే క్రమంలో బ్రిడ్జిపై నుంచి జంప్
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ మైనర్‌పై సామూహిక అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక నిందితుల బారి నుంచి తప్పించుకుని రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై నుంచి దూకింది. ఆ తర్వాత ఆమె ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసు సూపరింటెండెంట్ సత్యేంద్ర శుక్లా మాట్లాడుతూ – ఈ సంఘటన జూలై 15 రాత్రి జరిగింది. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం.. ఇద్దరు నిందితులు ఆమెపై అత్యాచారం చేసి చంపుతామని బెదిరించారు. వీరిద్దరిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇద్దరు యువకులు తనను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇద్దరూ పక్క ఊరి నివాసితులని, ఆమె ముఖానికి గుడ్డ కప్పి మోటార్‌సైకిల్‌పై కూర్చోబెట్టి తమ గ్రామానికి తీసుకెళ్లారని, ఇద్దరూ కలిసి కచ్చా ఇంట్లో అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపింది. ఘటన జరిగిన తర్వాత ఓ బాలుడు ఆమెను ఖాండ్వాకు తీసుకెళ్లాడు. ఇంతలో, బాధితురాలు తన కుటుంబ సభ్యులకు పదేపదే మిస్డ్ కాల్స్ చేసింది. ఆ తర్వాత బంధువులు ఆమెను వెతుకుతూ ఓవర్ బ్రిడ్జికి చేరుకున్నారు. వారిని చూసి ఆ యువతి వంతెనపై నుంచి కిందకు దూకింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
పెళ్లికి నిరాకరించిందని యువతిపై దారుణం..
రోజు రోజుకు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రేమ నిరాకరించినా.. పెళ్లి నిరాకరించినా.. అమ్మాయిలపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఘటనే ఇది. ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కురిచేడులో పెళ్లికి నిరాకరించిందని యువతిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురిచేశాడో యువకుడు.. మద్యం సీసాతో గొంతు కోసి ముఖంపై గాయాలు చేసి పరారయ్యాడు సదరు దుర్మార్గుడు. అలవలపాడు పోస్టాఫీసులో పనిచేస్తూ స్నేహితులతో కలసి కురిచేడులో ఓ రూంలో యువతి ఉంటోంది. గతంలో యువతిని పలుమార్లు పెళ్లి చేసుకోవాలని ఆమె స్వగ్రామానికి చెందిన వీరనారాయణాచారి అనే యువకుడు వేధించాడు.
దీంతో.. యువతి తల్లిదండ్రులు సదరు యువకుడిని మందలించారు. ఈక్రమంలో.. యువతిపై కక్ష్య పెంచుకుని ఓ కారులో మరో ఇద్దరు యువకులతో కలసి వచ్చి యువతిని ఎత్తుకెళ్లాడు యువకుడు.. కారులో దొనకొండ సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి మద్యం సీసతో దాడి చేసి.. అనంతరం కురిచేడులో వదిలివెళ్లాడు నిందితులు. దీంతో.. బాధితు యువతిని దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..
ఫ్లాప్ తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాకు సుప్రీంకోర్టు నుండి శుభవార్త
ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ చిత్రానికి సుప్రీం కోర్టు నుంచి శుభవార్త అందింది. జూలై 27న వ్యక్తిగతంగా హాజరుకావాలని నిర్మాత, దర్శకుడు, డైలాగ్ రైటర్‌ను కోర్టు ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానం స్టే విధించింది. అంతే కాకుండా సినిమా సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ దాఖలైన పిల్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.
ఆదిపురుష్ చిత్రంలో మతపరమైన పాత్రలను తప్పుగా చూపించారంటూ అలహాబాద్ హైకోర్టు జూన్ 27న మేకర్స్‌పై వేటు వేసింది. ఈ సినిమా నిర్మాత, దర్శకుడు, డైలాగ్ రైటర్‌ను వచ్చే 27వ తేదీన కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మేకర్స్ జూలై 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఈరోజు మేకర్స్‌కు కోర్టు నుండి పెద్ద ఉపశమనం లభించింది.
యాక్టివ్ సోషల్ మీడియా.. 64 శాతం మంది ఆన్‌లైన్‌లోనే
సమాజంలోని 80 శాతానికిపైగా ప్రజల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వాటిలో 90 శాతం మందికిపైగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో ఉన్న వాటన్నింటిని ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేని వారు చాలా తక్కువగా ఉంటారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా్గ్రామ్, ట్విట్టర్, రీల్స్, టెలీగ్రామ్ ఇలా అనేక రకాల సోషల్ మీడియాలో స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఏదో ఒకదాంట్లో ఉంటారు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు కూడా ఉంటున్నారు. మనిషి లేచిన దగ్గరి నుంచి పడుకొనే వరకు తనతోపాటు ఫోన్‌ను వదల కుండా ఉంటాడు. లేవగానే మొదట చూసుకునేది తన స్మార్ట్ ఫోన్‌నే. స్మార్ట్ ఫోన్‌తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు ప్రపంచ జనాభాలో 64 శాతానికిపైగా ఉన్నారంటే.. నమ్మకం తప్పదు. ప్రపంచ జనాభాలో 500 కోట్ల మందికిపైగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారని ఒక సర్వేలో వెల్లడయింది.
ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త.. త్వరలోనే సెకండ్ పీఆర్సీ అమలుకు కసరత్తు
తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రెండో పీఆర్సీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇందుకోసం నెలాఖరులో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మధ్యంతర ఉపశమనాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్)పై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వీటి అమలుకు సంబంధించిన విధివిధానాలను త్వరలో రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లపై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వీటన్నింటికి సంబంధించి కార్మిక సంఘాలతో సీఎం కేసీఆర్ త్వరలో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. కార్మిక సంఘాలతో కేసీఆర్ సమావేశమై నేరుగా వారి సమస్యలను విని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. అయితే అన్నీ కుదిరితే మరో పది రోజుల్లో ఈ సమావేశం కూడా జరగనున్నట్లు సమాచారం.కాగా, పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు, తాత్కాలిక పోస్టును త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గురువారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో టీఎన్‌జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, సత్యనారాయణగౌడ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ ప్రక్రియలోనే పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్‌ను ప్రకటించాలని కేటీఆర్‌ను కోరారు.
