దావత్‌లపై ఆబ్కారీశాఖ ఫోకస్.. రాష్ట్రంలోని లిక్కర్ మాత్రమే అనుమతి..
తెలంగాణలో ఏ ఫంక్షన్‌కైనా దావత్ జరగాల్సిందే. తెలంగాణలో పండగ అయినా, ఫంక్షన్ల అయినా, దావత్ లు ఇలా సందర్భం ఏదైనా సరే మేకలు, గొర్రెల తలలు తెగాల్సిందే. మటన్ ముక్క లేనిది దావత్ ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిందే. మటన్ తో మందు ఉంటే ఆ సందడే వేరబ్బా.. మటన్ ముక్క.. మందు చుక్క.. పార్టీ లేకుండా తెలంగాణలో పార్టీనే ఉండదు. దీంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక నుంచి రాష్ట్రంలో జరిగే ప్రైవేట్ పార్టీలపై అబ్కారీ శాఖ దృష్టి సారిస్తుంది. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం వినియోగంపై ఇప్పటికే అబ్కారీ శాఖ కొరడా ఝులిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫంక్షన్లు, పార్టీలపై కూడా అబ్కారీ శాఖ ఓ కన్నేసి ఉంచనుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. వాస్తవానికి ఏ కార్యక్రమంలోనైనా మద్యం సేవించాలంటే ఎక్సైజ్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. పార్టీలలో రాష్ట్ర మద్యం మాత్రమే వాడాలి.
బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో గూటికి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?
లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం కొనసాగుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరి కేపూడి గాంధీ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే గులాబీ పార్టీకి మరో షాక్ తగలనుంది. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలవడంతో ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2014 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు.
ముచ్చుమర్రిలో బాలిక ఘటనలో వీడని సస్పెన్స్
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి లో బాలిక ఘటనలో సస్పెన్స్ వీడటం లేదు. ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక మృతదేహం కోసం 7వ రోజు గాలింపు కొనసాగతోంది. 7వ తేదీన బాలిక(9) అదృశ్యమైంది. పోలీసుల అదుపులో మైనర్ బాలులు, తల్లిదండ్రులు ఉన్నారు. అయితే.. నాలుగు రోజుల క్రితం కాలువలో మృతదేహాన్ని పడేశామన్న మైనర్ బాలురు. రెండు రోజుల క్రితమేమో గ్రామ సమీపంలోని స్మశానంలో పడేశామని తెలిపారు. తాజాగా బాలిక మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశామని మైనర్ బాలుని తండ్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కృష్ణా నదిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. పూటకో మాట చెబుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు మైనర్ బాలురు. డీఐజీ స్థాయి అధికారి కేసును పర్యవేక్షించినా బాలిక (9) మృతదేహం ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కనీసం బాలిక మృతదేహం అయిన అప్పజెప్పాలని బాలిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత
విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్న కారణంగా ఘాట్ రోడ్డు నిన్న రాత్రి నుంచి మూసివేశారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మహా మండపం నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. కొండరాళ్ళు దొర్లిపడకుండా ముందస్తుగా ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. దుర్గాఘాట్ నుంచి దేవస్ధానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఒకవైపు ఆదివారం సెలవు రోజు కావడంతో దుర్గమ్మ కు ఆషాఢం సారె సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వాహనాలను నిలిపేందుకు రధం సెంటర్, పద్మావతి ఘాట్ల వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
మీ డేటా ఎవరి చేతుల్లోనైనా పడిందా.. ఫ్రీగా చెక్ చేస్కోవచ్చు
ప్రస్తుత హైటెక్ యుగం నడుస్తోంది. ఇంటర్నెట్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇంటర్నెట్లో ఏది ఓపెన్ చేయాలన్నా పేరు, మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయడం కామన్ అయిపోయింది. దీంతో ఆయా సైట్ల నుంచి జనాల పర్సనల్ డేటానంతా సైబర్ నేరగాళ్లు ఈజీగా కొట్టేస్తూ లేదా కొంటూ రకరకాలుగా దోపిడీలకు పాల్పడుతున్నారు. అయితే, గూగుల్ యూజర్లు అందరూ ఇకపై వారి పర్సనల్ డేటా ఇంటర్‌నెట్ లో ఎవరి వద్దయినా ఉందా? అన్న విషయం చాల తేలికగా తెలుసుకోవచ్చు. ఎవరి వద్దయినా మన పర్సనల్ డేటా ఉన్నట్లు తెలిస్తే.. ఆ డేటాను సులభంగా డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం గూగుల్ కంపెనీ ఇదివరకే ‘డార్క్ వెబ్ రిపోర్ట్స్’ పేరుతో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు గూగుల్ వన్ మెంబర్షిప్ (ఎక్స్ ట్రా స్టోరేజ్ కొనుగోలు చేసిన యూజర్లు) ఉన్న వారికి మాత్రమే ఈ ఫీచర్ ను అందుబాటులోకి ఉంచింది. కానీ ఈ నెల చివరి నుంచి గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఫీచర్‌ను ఉచితంగా అందజేయనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు
ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు జరుగుతోంది. సభా నిర్వహణ విషయంలో కీలకాంశాలను యమమల రామకృష్ణుడు ప్రస్తావించారు. పూర్తి స్థాయి బడ్జెట్, ఓటాన్ అకౌంట్, ఆర్డినెన్స్ జారీ వంటి వాటిల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యనమల రామకృష్ణుడు సలహాలు ఇచ్చారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల మాట్లాడుతూ.. ఈ నెలాఖరుతో గత ప్రభుత్వం ఆమోదించిన ఓటాన్ అకౌంట్ గడువు ముగియనుంది. గడువు ముగిసేలోగా బడ్దెట్ లేదా ఓటాన్ అకౌంట్ లేదా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్సుకు ఆమోదం లేకుంటే ప్రభుత్వం ట్రెజరీ నుంచి డబ్బులు డ్రా చేయలేదని ఆయన అన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడమో లేక ఓటాన్ అకౌంట్ ఆమోదించడమో చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసే ఆలోచన ఉన్నట్టు కన్పిస్తోందన్నారు యనమల. ప్రస్తుతమున్న సభ ప్రొరోగ్ చేయలేదు కాబట్టి.. ఆర్డినెన్స్ జారీ చేయడం కుదరదని, సభ ప్రొరోగ్ కాని టైంలో ఆర్డినెన్సులను జారీ చేయడం నిబంధనలకు విరుద్దమన్నారు. ఈ పరిస్థితుల్లో సభలో పూర్తి స్థాయి బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ పెట్టి ఆమోదించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
అంగట్లో సరుకుల్లా నర్స్ పోస్టులు.. అమ్మకానికి పెట్టిన కిలాడి లేడీలు..
చదువు పూర్తయితే చాలు.. ఎవరి నోటి నుంచి అయినా వచ్చే మొదటి ప్రశ్న.. నీకు ఉద్యోగం వచ్చిందా? అదేమిటంటే.. ఇంట్లో ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చిందంటే.. ఈ వ్యక్తికి ఉద్యోగం వచ్చిందంటూ రోజూ పాఠం చదివారు. ఈ బాధలన్నీ తట్టుకోలేక పోటీ ప్రపంచంలో ఉద్యోగం కోసం చాలా మంది బ్యాక్ డోర్ ను ఎంచుకుంటున్నారు. ఎవరైనా ఉద్యోగం ఇప్పినంటే చాలు.. లైఫ్ సెటిల్ అవుతుందని లక్షలు తగలబెడుతున్నారు. నిరుద్యోగులే టార్గెట్ చేసుకుని స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరుతో ఇద్దరు లేడీలు భారీ మోసం చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలో అవినీతి బయట పడుతోంది
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం రూరల్ పరిధిలోని కొటిపిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన టిడ్కో గృహాలను ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు. కొటిపిలో రూ.4 కోట్ల విలువతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలో అవినీతి బయట పడుతోందన్నారు. మున్ముందు శాఖలో జరిగిన అక్రమాలు అన్ని బయటకు వస్తాయని, వ్తెసీపీలో వ్యవస్థలన్నింటిని నాశనం చేశారన్నారు బాలకృష్ణ. ఇసుక , మద్యం , మ్తెనింగ్ లలో అక్రమాల చేసి కమీషన్లకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. పరిపాలన చేయడం చేతకాక …మూడు రాజధానులు , నవరాత్నల పేరుతో మోసం చేశారని, టీడీపీ హాయంలో లేటేస్ట్ టెక్నాలజీ టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు.
ప్రజాభవన్ లో బోనాల సందడి.. నల్ల పోచమ్మ ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి
ఆషాడ మాసం సందర్భంగా ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలకు ఘనంగా నిర్వహిసున్నారు. అయితే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి సీఎం, డిప్యూటీ సీఎం బోనం సమర్పించుకున్నారు. అనంతరం ప్రజా భవన్ నుండి.. అబ్దుల్లాపూర్ మెట్ కు సీఎం రేవంత్ బయలుదేరారు. కాటమయ్య రక్ష పథకానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం శ్రీకారం చుట్టనున్నారు.
