Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

టీడీపీ రెండో జాబితా విడుదల

టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. 94 మంది అభ్యర్థులతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించింది. కానీ కొంతమంది సీనియర్లు వారి భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తే జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. కూటమి పార్టీల నేతల మధ్య పోటీ కూడా ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు టీడీపీ 34 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థులు ఎవ‌ర‌నే దానిపై మ‌రింత క్లారిటీ వ‌చ్చింది. సస్పెన్షన్‌కు గురైన వైసీపీ ఎమ్మెల్యే కూడా ఈ జాబితాలో చేరారు.

రాజమండ్రి రూరల్‌ సీటును సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మళ్లీ కేటాయించడంతో ఉత్కంఠకు తెరపడింది. ఆత్మకూరు స్థానం నుంచి వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన వెంకటగిరి స్థానం నుంచి ఆత్మకూర్‌కు తరలించారు. జాబితా మిశ్రమ బ్యాగ్‌గా చూడవచ్చు. సిట్టింగ్ అభ్యర్థులను అభ్యర్థులుగా ఎంపిక చేయగా, కొన్ని స్థానాల్లో సీనియర్లను కూడా ఎంపిక చేయడమే కారణం.

యుద్ధానికి సిద్ధం.. కమాండర్లతో నార్త్ కొరియా అధ్యక్షుడు భేటీ..?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా- అమెరికా సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన కొనసాగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ కమాండర్లతో మాట్లాడుతూ ఈ విన్యాసాలను నిజమైన యుద్ధంలా కసరత్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో ఒక కొత్త యుద్ధ ట్యాంక్ తన మొదటి ప్రదర్శనలో సక్సెస్ ఫుల్ గా మందుగుండు సామగ్రిని ప్రయోగించింది. తన కమాండర్ల పని తీరుకు కిమ్ జొంగ్ ఉన్ సంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా, ఈ విన్యాసాలకు సంబంధించిన వివరాలను ఒక నివేదికలో వెల్లడైంది.‘యుద్ధ పరిస్థితులలో సమర్థవంతంగా పని చేసే ఈ భారీ యుద్ధ ట్యాంకులు ఒకే సారి తమ ప్రత్యర్థి లక్ష్యాలపై దాడి చేసి, చిధ్రం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్ జొంగ్ ఉన్ తో పాటు రక్షణ మంత్రి కాంగ్‌ సున్‌నామ్‌, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. సైనిక విన్యాసాల సందర్భంగా నార్త్ కొరియా మీడియా పలు ఫోటోలను రిలిజీ చేసింది. ఒక ఫోటోలో నార్త్ కొరియా అధ్యక్షుడు యుద్ధట్యాంక్‌ను పరీక్షించడాన్ని చూడొచ్చు.. అలాగే, ఆ యుద్ధ ట్యాంక్ ను స్వయంగా నడిపినట్లు స్థానిక మీడియా పేర్కొనింది.

పెరిగిన ఉష్ణోగ్రతలు.. అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి ఐఎండి సూచన

వేసవి ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత భానుడు భగభగ మండుతుండటంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంతో.. ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మార్చిలోనే రికార్డు స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అయితే.. మార్చి చివరి నాటికి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాజాగా.. మధ్యాహ్నం నుంచి భారీ వడగళ్ల వాన కురుస్తోంది.

రేపు రాష్ట్రానికి ప్రధాని మోడీ.. మల్కాజ్‌గిరిలో రోడ్‌షో

త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి తెలంగాణ రాష్ట్రంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండోసారి రాష్ట్రానికి రావడం తెలంగాణపై బీజేపీ దృష్టి పెట్టిందని అర్థమవుతుంది. ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల బరిలోకి దిగుతాయన్న సంకేతాల నేపథ్యంలో ప్రధాని మోcw ఈ నెల 15న మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి స్థానంపై దృష్టి సారించింది. సిట్టింగ్ సికింద్రాబాద్ సీటుతోపాటు మల్కాజిగిరి, చేవెళ్ల, హైదరాబాద్ స్థానాలపై దృష్టి సారించిన కమలదళం.. జాతీయ నేతలను ప్రచారంలో దింపుతోంది. రెండు రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా నగరంలో పర్యటించారు. పదిరోజుల్లోనే రెండోసారి ప్రధాని రాష్ట్రానికి రావడం గమనార్హం. ఇటీవల నగర శివార్లలోని పటాన్చెరులో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఏపీపీఎస్సీ గ్రూప్-1లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలి

ఏపీపీఎస్సీ గ్రూప్-1లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. సర్వీస్ కమిషన్ను సీఎం జగన్ వైసీపీ కార్యాలయంగా మార్చి నాశనం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, ఏపీపీఎస్సీ పెద్దలు కోర్టును సైతం మోసగించే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు.

టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్

చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ చేరారు. పార్టీ కండువా కప్పి సంజీవ్ కుమార్ ను సాదరంగా చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. పొయ్యిమీద కాలుతున్న కుండను ముట్టుకునే ప్రయత్నం చేస్తే చెయ్యి కాలుతుందన్నారు. నాతో సహా రాష్ట్ర ప్రజలు వైసీపీను ఓసారి ముట్టుకుని ఆ తప్పు చేశారని ఆయన విమర్శించారు. రెండో చెయ్యి కూడా కాల్చుకోవద్దని ప్రజల్ని కోరుతున్నానన్నారు సంజీవ్‌ కుమార్‌. కర్నూల్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తెలుగుదేశంలో చేరా అని ఆయన వెల్లడించారు. ఎలాంటి సీటు ఆశించకుండా భేషరతుగానే తెలుగుదేశంలో చేరానని ఆయన పేర్కొన్నారు.

అంబేద్కర్ దిక్సూచిగానే వైఎస్సార్‌సీపీ పని చేస్తుంది

కృష్ణాజిల్లా గుడివాడలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్‌లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేశారు. బౌద్ధ విధానంలో ఎమ్మెల్యే కొడాలి నాని, ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. అంబేద్కర్ దిక్సూచిగానే వైఎస్సార్‌సీపీ పని చేస్తుందని ఆయన తెలిపారు. గుడివాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు శంకుస్థాపన చేసే మహాభాగ్యం తనకు రావడం పూర్వజన్మ సుకృతమని ఆయన వెల్లడించారు. పొత్తుల పేరిట ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు.

మనోభావాలు దెబ్బతిన్నాయి.. బీఆర్‌ఎస్‌ కు పెద్దిరెడ్డి రాజీనామా..!

బీఆర్‌ఎస్‌ కు ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. పార్టీ వ్యవహార శైలి నచ్చకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గౌరవనీయులైన భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి నేను బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నానని లేఖ రాశారు. రాజీనామా లేఖను తమ అనుచరులతో తెలంగాణ భవన్ కు పంపించినట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు లేఖ పంపారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేయాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలి అని మీరు ఆహ్వానిస్తే జులై 27.. 2021 రోజున మీ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగిందని వివరించారు. తర్వాత జరిగిన పరిణామ క్రమంలో మీరు నిర్ణయించిన పార్టీ అభ్యర్థి కోసం పనిచేశానని వెల్లడించారు.

 

Exit mobile version