మహీంద్రా గ్రూప్ మాజీ చైర్మన్ కన్నుమూత
ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా కన్నుమూశారు. ఆయన వయసు 99 ఏళ్లు. కేశబ్ మహీంద్రా 1963 నుండి 2012 వరకు మహీంద్రా గ్రూప్ కు ఛైర్మన్‌గా పనిచేశారు. మహీంద్రా మరణాన్ని సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించారు. భారతదేశంలోని అత్యంత వృద్ధ బిలియనీర్ మహీంద్రా ఆగస్టు 9, 2012న మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేసిన చేశారు. అనంతరం ఆ బాధ్యతలను ఆనంద్ మహీంద్రాకు పగ్గాలు అప్పగించారు. కేశబ్ మహీంద్రా వ్యాపారవేత్తగా మహీంద్రా సెయిల్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్ మరియు ఐసిఐసిఐతో సహా అనేక కంపెనీల బోర్డులలో పనిచేశారు. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా కూడా ఉన్నారు.
బండితో మాట్లాడింది 40 సెకెండ్లే.. ఏ2 నిందితుడు కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టయి కరీంనగర్ జైలులో ఉన్న నిందితులు బెయిల్‌పై ఇవాల విడుదలయ్యారు. A2 – ప్రశాంత్, A3 – మహేష్, A4 – గణేష్ ఈరోజు ఉదయం విడుదలయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మీడియాతో మాట్లాడారు. 10వ హిందీ ప్రశ్నపత్రం బయటకు రాగానే జర్నలిస్టుల బృందంలో జర్నలిస్టుగా పంచుకున్నానని ప్రశాంత్ చెప్పాడు. ఆ గ్రూపుల్లో పోలీసు అధికారులు కూడా ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో తానేమీ తప్పు చేయలేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాడతానని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ అన్నారు. తాను బండి సంజయ్‌తో ఒకేసారి 40 సెకన్లు మాత్రమే మాట్లాడానని చెప్పారు. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులతో జైలుకు పంపారని, న్యాయం గెలిచిందని, కోర్టు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీకి కారణమైన వారి గురించి విచారణలో భాగంగా తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పి పోలీసులకు సహకరించినట్లు ప్రశాంత్ తెలిపాడు. జర్నలిస్టుగా తాను గతంలో విద్యార్థుల సమస్యలను బయటికి తెచ్చానని, అలాంటిది వారి భవిష్యత్తును ఎలా పాడుచేస్తానని అన్నారు. తనకు బెయిల్ రావడానికి ఏ రాజకీయ పార్టీ సహకరించలేదన్నారు. తనకు నేరుగా కోర్టు నుంచి బెయిల్ వచ్చిందన్నారు.
రాజస్థాన్‌లో తొలి వందేభారత్ రైలు.. ఆ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది!
రాజస్థాన్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఈ రైలు అజ్మీర్ నుంచి న్యూఢిల్లీ మధ్య నడుస్తుంది. జైపూర్, అల్వార్, గుర్గావ్‌లలో వందేభారత్ రైలు ఆగుతుంది. జైపూర్-ఢిల్లీ కాంట్ వందే భారత్ ప్రారంభ ప్రత్యేక రైలు సర్వీస్ జైపూర్ నుండి ఉదయం 11.00 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటుందని నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అజ్మీర్ నుండి ఢిల్లీ వరకు 5 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్‌ప్రెస్. ఇది ఢిల్లీ నుండి అజ్మీర్ మధ్య 6 గంటల 15 నిమిషాలలో ప్రయాణిస్తుంది. అందువల్ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆ మార్గంలో నడుస్తున్న ప్రస్తుత వేగవంతమైన రైలు కంటే 60 నిమిషాలు వేగంగా ఉంటుంది.
ఇది జరిగితే పక్కా పవన్ ఫాన్స్ కి పూనకాలు లోడింగే…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ బ్రేక్ లో ఉన్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ‘తెరి’ రీమేక్‌గా తెరకెక్కుతుందని అంటున్నారు కానీ హరీష్ శంకర్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ మచ్ అవైటింగ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటివలే స్టార్ట్ అయ్యింది, ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పార్ట్ అయిపోవడంతో పవర్ స్టార్ బ్రేక్ లో ఉన్నాడు. ఏప్రిల్ 18 నుంచి పవన్ కళ్యాణ్, సుజీత్ ‘ఓజి’ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత హరిహర వీరమల్లు షూటింగ్ ఉంటుంది. ఇక ఇప్పటికే వినోదయ సీతం రీమేక్ షూటింగ్ ఫినిష్ చేశారు పవన్. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాలతో పాటు పవన్ మరికొన్ని ప్రాజెక్ట్స్ ని డిస్కషన్ స్టేజ్ లో ఉంచాడు. ఎప్పుడు ఏ సినిమా స్టార్ట్ అవుతుందో అనేది సెట్స్ పైకి వెళ్లే వరకూ ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు, అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్, ఒక సీక్వెల్ కి ఓకే చెప్పాడట. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ కి రీఎంట్రీ సినిమాగా నిలిచింది ‘వకీల్ సాబ్’ మూవీ.
ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయి
ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయని సీపీ సీవి ఆనంద్ అన్నారు. సైబర్ ట్రోలింగ్, వ్యాపార సముదాయాల్లో సైబర్ సెక్యూరిటీ లో అంశాలపై ఈ సమ్మిట్ లో చర్చించారు. కోవిడ్ సమయంలో హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎంతో సహకరించిందని తెలిపారు. ఏడాది ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో భాగంగానే హ్యాక్ సమ్మిట్ అన్నారు. నగరంలో నార్కోటిక్ డ్రగ్స్ పెరుగుతూ వస్తున్నాయని తెలిపారు. నా మీద రోజుల్లో మరో రెండు సమ్మిట్లు ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. ఆ సమ్మిట్ లో ఒకటి మహిళల భద్రత మరొకటి చిన్నపిల్లల లైంగిక దాడుల అంశాలపై చర్చిస్తామని తెలిపారు. 40 నుండి 50% కేసులు సైబర్ క్రైమ్ కు చెందిన కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. స్నాచింగ్ లాంటి నేరాలని ఏ విధంగా కట్టడి చేసామో సైబర్ క్రైమ్ లో కూడా అలా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
యశోద ఆస్పత్రిలో చేరిన జానారెడ్డి.. స్టంట్ వేసిన వైద్యులు
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి యశోద ఆస్పత్రిలో చేరారు. వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. జానారెడ్డి మంగళవారం మోకాలి చికిత్స కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. మోకాలికి చికిత్స సమయంలో వివిధ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో జానా రెడ్డి గుండె రక్తనాళాల్లో ఒకటి మూసుకుపోయినట్లు తేలిందని వైద్యులు తెలిపారు. జానారెడ్డికి నిన్న రాత్రి వైద్యులు స్టంట్ చేశారు. ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకగా ఉందని భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విశ్రాంతి అవసరమని తెలిపారు. ఆరోగ్యం పట్ల భయపడవలసిన పరిస్థితి లేదని పేర్కొన్నారు. జానారెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు భయాందోలనకు గురయ్యారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు కుటుంబ సభ్యులు.
బీజేపీ కొత్త ప్రయోగాలు.. అభ్యర్థుల జాబితాలో కాషాయ వ్యూహం
రతీయ జనతా పార్టీ (బిజెపి) రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలో 52 మంది కొత్త వారిని టిక్కెట్లు కేటాయించడం చర్చనీయాంశమైంది. బిజెపి ఇతర పార్టీలకు భిన్నంగా ప్రయోగాలు చేస్తూనే ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి అన్నారు. చిక్కమగళూరు నియోజకవర్గం నుంచి సీటీ రవిని బీజేపీ పోటీకి దింపింది. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినందుకు పార్టీ పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొత్తగా 52 మందికి అవకాశం కల్పించారు. కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది కాబట్టి బీజేపీని భిన్నత్వం ఉన్న పార్టీ అంటారు అని సీటీ రావి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని ఆయన చెప్పారు. ఏప్రిల్ 20లోగా పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) ఒంటరిగా పోరాడుతున్నాయని, బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడతామని చెబుతూనే ఉన్నారని ఆయన అన్నారు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గానూ 189 స్థానాలకు గానూ 52 మంది కొత్త అభ్యర్థులకు టికెట్లు లభించడంతో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను మంగళవారం విడుదల చేసింది. 52 మందిలో ఎనిమిది మంది మహిళలు, 9 మంది వైద్యులు, ఐదుగురు లాయర్లు, ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ముగ్గురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, 8 మంది సామాజిక కార్యకర్తలకు టిక్కెట్లు ఇచ్చారు.