లోకసభ ఎన్నికలకు ఏఐసీసీ చీఫ్ దూరం?.. కారణం ఇదే..!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కర్ణాటకలోని గుల్బార్గా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తారు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో కూడా పేరు చేర్చినట్లు తెలిసింది. కానీ ఖర్గే తన అల్లుడు రాధాకృష్ణన్ దొద్దమణిని గుల్బార్గా నుంచి ఎన్నికల బరిలోకి దించాలని చూస్తున్నట్లు టాక్. అయితే, మల్లికార్జున్ ఖర్గే గుల్బార్గా నుంచి రెండు సార్లు లోక్‌సభకు పోటీ చేయగా.. 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభకు ఆయన నామినేట్ అయ్యారు. ఇక, ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఆయన పదవి కాలం మరో నాలుగు సంవత్సరాల పాటు ఉంటుంది.
కేరళలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధి.. ఒక్క రోజులోనే 190మంది రోగులు
కేరళలో గవదబిళ్లలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీనిని హిందీలో కంఠమాల లేదా గల్సువా అని కూడా అంటారు. రాష్ట్రంలో ఒక్కరోజే 190 కేసులు నమోదైనట్లు సమాచారం. మార్చి నెలలో ఇప్పటివరకు 2505 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. రెండు నెలల్లో 11467 మంది రోగులు నమోదయ్యారు. కేరళలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ను కూడా అప్రమత్తం చేసినట్లు కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
పారామిక్సోవైరస్ అనే వైరస్ వల్ల గవదబిళ్లలు వ్యాపిస్తాయి. ఇది పరిచయం ద్వారా లేదా గాలిలోని నీటి బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాధిని కలిగిస్తుంది. దీని లక్షణాలు ప్రభావితమైన మూడు నాలుగు గంటల తర్వాత కనిపించడం ప్రారంభిస్తాయి. కొన్నిసార్లు దాని లక్షణాలు రెండు మూడు వారాల తర్వాత కనిపిస్తాయి. వైరస్ సోకిన తర్వాత కూడా లక్షణాలు కనిపించకపోవచ్చు. ఇందులో జ్వరం, తలనొప్పి, ఆయాసం, శరీరంలో నొప్పి, లాలాజల గ్రంథుల్లో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 70 శాతం కేసుల్లో బుగ్గల వాపు వస్తుంది. ఈ వ్యాధిని చిప్‌మంక్ చెంపలు అని కూడా అంటారు.
ఇందిరమ్మ ఇళ్లు.. గైడ్‌లైన్స్ ఇవే..
తెలంగాణ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం మార్గదర్శకాల్లో ప్రకటించింది. జిల్లా ఇన్ ఛార్జి మంత్రిని సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. కాగా… ఆర్థిక సహాయం పంపిణీకి గ్రామ, మండల స్థాయిలో అధికారులను ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేసిన అనంతరం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలల్లో జరిగే గ్రామ, వార్డు సభల్లో ప్రకటిస్తామని పేర్కొంది. కాంగ్రెస్ ఆరు హామీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున 4 లక్షల 50 వేల ఇళ్లను సొంత భూమి ఉన్న వారికి 100 శాతం సబ్సిడీతో మంజూరు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. అంతేకాకుండా.. ప్రభుత్వ పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అయితే.. ఈ పథకాన్ని సోమవారం బూర్గంపాడులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రారంభించి పలువురు లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
జాతీయ బడ్జెట్ లో కేంద్రం రైల్వేకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది..!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం కు వందే భారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ…ఇప్పటి వరకు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ప్రయాణికుల అనుగుణంగా సికింద్రాబాద్ నుంచి విశాఖ కు వందే భారత్ రైలు నడవడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ లో ఖాజీపేట్ రైల్ కోచ్ ప్రారంభం….చర్లపల్లి లో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రూ 750 కోట్ల పనులతో పున: నిర్మాణ పనులు జరుగుతుందని తెలిపారు. అదే విధానంగా నాంపల్లి లో త్వరలో రూ 350 కోట్ల నిధులతో కొత్త రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా రూ 85 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయని అన్నారు.
అందుబాటులోకి మరో రెండు వందే భారత్ ట్రైన్ సర్వీసులు
విశాఖ వాల్తేరు డివిజన్ కు మరో రెండు వందే భారత్ ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి… విశాఖ-భువనేశ్వర్, విశాఖ- సికింద్రాబాద్ స్టేషన్ ల మధ్య ఈ రెండు కొత్త వందే భారత్ ట్రైన్లు సేవలు అందించనున్నాయి… ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా రెండు ట్రైన్ లను ప్రారంభించారు… వాల్తేరు డివిజన్లో మొదటిసారి జనవరి 2023లో విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైంది.. ప్రయాణికుల నుండి మంచి ఆదరణ లభించడంతో మరో రెండు కొత్త వందే భారత్ ట్రైన్ లను అందుబాటులోకి చేస్తున్నట్టు తెలిపారు రైల్వే అధికారులు..సికింద్రబాద్ లో ఉదయం 5.30 కి బయలుదేరి మధ్యాహ్నం 1.30 కి వైజాగ్ చేరుకుంటుంది.. ఇక మరో వందే భారత్ ట్రైన్ ఉదయం 5:15 గంటలకు భువనేశ్వర్ నుండి బయలుదేరి, ఆ రోజు ఉదయం 11:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రిటర్న్ విశాఖపట్నం నుండి మధ్యాహ్నం 3:30 గంటలకు బయలుదేరి, అదే రోజున రాత్రి 9:30 గంటలకు తిరిగి భువనేశ్వర్‌కు చేరుకుంటుంది.
నేడు 22 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం.. మహిళలకు ఫ్రీ జర్నీ..!
మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించి లక్షలాది మంది మహిళా ప్రయాణికులు నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దీంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల ఏర్పాటుకు టీఎస్‌ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ నగరంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 22 కొత్త బస్సులను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.
ప్రతి అడుగులో అభివృద్ధిని చూపిస్తున్నాం
విజయవాడలో సీఎం జగన్ పర్యటించారు. ఈ నేపథ్యంలో కనకదుర్గ వారధి దగ్గర రిటైనింగ్ వాల్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. రివర్ ఫ్రంట్ పార్క్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. రూ.12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్క్ అభివృద్ధి చేశారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడలో ఇప్పటికే రూ.400 కోట్లతో అంబేద్కర్ పార్క్‌ను ప్రారంభించామని ఆయన తెలిపారు. ప్రతి అడుగులో అభివృద్ధిని చూపిస్తున్నామన్నారు. ఏపీ చేయని ప్రతి పక్షాలు అభివృద్ధి అంటున్నాయని ఆయన మండిపడ్డారు. రెండు కరకట్ట గోడలు 5 వందల కోట్లతో కట్టామని, ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు నాలుగు మాటలు చెప్పడమే కానీ…దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగిందని, రివర్ ఫ్రంట్ పార్క్ ఏర్పాటు చేసామన్నారు. విజయవాడ లో వివిధ కాలనీల్లో 31 వేల 866 కు పైగా పట్టాలను క్రమమబద్ధీకరిస్తూ సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇస్తున్నామని, 239 కోట్లతో సివరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసామన్నారు. అభివృద్ధిని ప్రతి అడుగులో చూపిస్తున్నామని, ఏమి చేయని విపక్షాల వారు అభివృద్ధి…అభివృద్ధి అంటారని ఆయన వ్యాఖ్యానించారు. వాలంటరీ వ్యవస్థ తో మంచి చేసే కార్యక్రమం కేవలం 58 నెలలుగా జరుగుతోందని, పార్క్ లకు కృష్ణమ్మ జలవిహార్ పేరు పెడుతున్నామని ఆయన తెలిపారు.
నా వాళ్ళు మాట్లాడితే మీరుతట్టుకోగలరా.. బతకగలరా..!
తిరుపతి జిల్లాలోని నగిరి లో తన వ్యతిరేకవర్గం నేతలపై తీవ్ర స్ధాయిలో మంత్రి రోజా ఫైర్ అయ్యారు. జగనన్న ముద్దు రోజమ్మ వద్దు అంటూ ప్రతిరోజు 500 కట్టి ప్రెస్ క్లబ్ లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. మీరు పార్టీలో ఉండడం వల్లే నగరిలో 500 ఓట్లు మెజార్టీ వస్తున్నాయని, మీరు పార్టీ నుండి బయటకు వెలితే నగరిలో 30,40 వేల మెజారిటీ గెలుస్తా అని ఆమె వ్యాఖ్యానించారు. నా వాళ్ళు మాట్లాడితే మీరుతట్టుకోలేగలరా..బతకగలరా అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారు
మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవంలో TSRTC ఎండీ సజ్జ నార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 50% ఎరియర్ బాండ్స్ నీ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలకి కోసం చాలా ఇబ్బంది పడేవారని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్చ ఉండేది కాదన్నారు. 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారన్నారు. TSRTC అభివృద్ధి కి ప్రభుత్వ సహాయం అందుతూనే ఉంటుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందని తెలిపారు. మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. మహిళల టికెట్ డబ్బులను ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ఒక కార్మికుడిలా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అభివృద్ధి కృషికి చూస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను మూడు నెలల్లోనే అమలు చేశామని అన్నారు.
