NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

ప్రాణం తీసిన స్నేహితులతో దిగిన ఫోటో.. నమ్మితే నట్టేట ముంచారు..

నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం జరిగింది. చింతలగూడెం గ్రామానికి చెందిన కోట రాజలింగం-రజిత కుమార్తె కోట కళ్యాణి(19) పాలిటెక్నిక్ పూర్తిచేసి ప్రస్తుతం ఇంటివద్ద ఉంటుంది. ఆమెను అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. ప్రేమించాలని, లేకుంటే తమ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఈ విషయం తెలిస్తే తన కుటుంబం పరువుపోతుందని కళ్యాణి భయపడింది. చివరకు ఆత్మహత్య చేసుకుంది.

ప్రజా కంటక ప్రభుత్వంలో దారుణాలు జరిగాయి

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైతు బజార్‌లో బియ్యం, కందిపప్పు సరసమైన ధరలకు విక్రయిస్తున్నా కౌంటర్‌ను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. నిన్న మొన్నటి వరకు ప్రజలపై ఏ విధంగా భారం పడిందో చూసామన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పదవి చేపట్టిన నాటి నుండి తనిఖీలు చేపట్టిన తర్వాత అవినీతి బయటపడిందని ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రజా కంటక ప్రభుత్వంలో దారుణాలు జరిగాయని ఆమె విమర్శించారు. ఇప్పుడు ప్రజా రంజికపాలన అధికారంలోకి వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపేట అని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కూడా ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ఎన్నో భాగంగానే బియ్యం కందిపప్పులను తక్కువ ధరలకు విక్రయమన్నారు. ప్రజలపై ధరల భారం తగ్గించాలని ఉద్దేశంతో ఇది అమలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

ప్రజల సమస్యలు తెలుసు.. కానీ అభిప్రాయం తీసుకుంటాం..

ఆదిలాబాద్ ప్రజల సమస్యలు తెలుసు.. అయినా అందరి అభిప్రాయం తీసుకుంటామమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసు అయినా అందరి అభిప్రాయం తీసుకుంటామన్నారు. అందరితో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే సదుద్దేశం తో ఉన్నాము. మాకు మేము ఏదో నిర్ణయం తీసుకోవడం లేదు. మీ అభిప్రాయం ను తీసుకొని నిర్ణయం తీసుకుంటాము. రైతుకి న్యాయ బద్దంగా ధర్మంగా సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటాము.

లాగిన్ కోసం ఓటీపీని డిజిటల్ టోకెన్ తో భర్తీ చేయనున్న సింగపూర్ బ్యాంకులు

సింగపూర్‌లోని ప్రధాన రిటైల్ బ్యాంకులు డిజిటల్ ఖాతాదారులచే బ్యాంక్ ఖాతా లాగిన్ కోసం వన్-టైమ్ పాస్‌వర్డ్‌ల (OTPలు) వినియోగాన్ని క్రమంగా తొలగిస్తాయని ప్రకటించాయి. రాబోయే మూడు నెలల్లో టోకెన్ వినియోగదారులు వీటికి మారాలని సింగపూర్‌లోని మానిటరీ అథారిటీ (MAS), సింగపూర్‌లోని బ్యాంకుల సంఘం (ABS) మంగళవారం అధికారికంగా ప్రకటించాయి. సైబర్ మోసాల వల్ల 2023లో దాదాపు 14.2మిలియన్ సింగపూర్ డాలర్లను పోగొట్టుకున్నారని బ్యాంకుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. కొత్తగా తీసుకుని వచ్చే విధానం ఐదు స్కామ్ ల నుండి ఇది వారిని మెరుగ్గా కాపాడుతుందని తెలిపింది.

విజయనగరంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

విజయనగరం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటంచనున్నారు. ఇందుక అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మ‌ధ్యాహ్నం 12 గంటల సమాయానికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించ‌నున్నారు. ఇప్పకే 25 శాతం పనులు పూర్తాకగా, మిగిలన పనుల‌ను సీఎం పరిశీలించనున్నారు. టెర్మినల్, రన్ వే, అప్రోచ్ రోడ్లుల పనుల ఏమేరకు జరిగాయని సీఎం పరిశీలించనున్నారు. అధికారులు ఇందు కోసం ఏర్పాటు చకచకా చేశారు. తొలిత ర‌న్‌వేపై ఏర్పాటు చేస్తున్న‌ హెలీప్యాడ్ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అక్క‌డి నుంచి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్కు చేరుకొని వివిధ శాఖ‌ల అధికారుల‌తో మాట్లాడనున్నారు.

చిన్నారుల పాలిట యమదూతలుగా మారుతున్న డేంజర్ డాగ్స్..

సంగారెడ్డి జిల్లాలో కుక్కల బెడదతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. గత 15 రోజులుగా సంగారెడ్డిలో జనాలపై వరుసగా కుక్కల దాడులతో చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారు. చిన్నారుల పాలిట డేంజర్ డాగ్స్ యమదూతలుగా మారుతున్నాయి. ఇప్పటికే ఇస్నాపూర్ లో ఓ బాలుడిని, మెదక్ లో చిన్నారిని కుక్కలు చంపేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.ఈ నెల జైలై 1న సంగారెడ్డిలోని శ్రీ నగర్ కాలనిలోనూ ఓ బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఇక రెండు రోజుల క్రితం సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేయడంతో పక్కింటి వ్యక్తి అరుపులు విని ఆ బాలుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కుక్క కాట్లతో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు.

ఢిల్లీలో చిన్నపాటి గొడవ.. యువకుడిపై 17 సార్లు కత్తితో దాడి

దేశ రాజధాని ఢిల్లీలోని భజన్‌పురాలో బుధవారం రాత్రి ముగ్గురు యువకులు దారుణ ఘటనకు పాల్పడ్డారు. ఇందులో చిన్న వివాదంపై వీధి బయట కూర్చున్న యువకుడిని దుర్మార్గులు మొదట కొట్టి, ఆపై 17 సార్లు కత్తితో పొడిచి చంపారు. నాలుగు-ఐదు సార్లు కత్తితో దాడి చేయగా ఆ యువకుడు స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. అయినప్పటికీ దుండగులు తమ దాడిని కొనసాగించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చుట్టుపక్కల వారు బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ సంఘటన బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో గమ్రీ ఎక్స్‌టెన్షన్‌లోని స్ట్రీట్‌ నం. 15లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను గుర్తించేందుకు ఎలక్ట్రానిక్, మాన్యువల్ నిఘా సహాయం తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో కొందరు అనుమానితుల దృశ్యాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే అక్రమార్కులను గుర్తిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అతడిని అరెస్టు చేయనున్నారు.

రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం

నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రంలో నిత్యావసర సరకులను ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంచడం, వారికి ఉపశమనం కలిగించడం అవసరమని శ్రీ మనోహర్ గారు తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.181 ఉన్న కందిపప్పు రూ.160, బియ్యం రూ.52.40 ఉంటే రూ.48కీ, స్టీమ్డ్ బియ్యం రూ.55.85 ఉంటే రూ.49 చొప్పున విక్రయిస్తారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయించాలని నిర్ణయించారు. వీటిని స్థానిక చుట్టుగుంట, ఆర్టీసీ బస్టాండ్‌ల సమీపంలోని రైతు బజార్లతోపాటు తెనాలి, పొన్నూరు, మంగళగిరి రైతు బజార్లలో విక్రయిస్తారన్నారు. జిల్లాలోని రైస్‌ మిల్‌ పాయింట్ల వద్ద బీపీటీ బియ్యం అందుబాటులో ఉంచుతామన్నారు. గుంటూరులోని 15 హోల్‌సేల్‌ డాల్‌ మిల్లుల వద్ద కూడా సబ్సిడీ సరుకుల విక్రయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

డయేరియా కేసులపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష

పిడుగురాళ్లలో డయేరియా కేసులపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. డయేరియాకు కారణాలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మున్సిపల్, వైద్యారోగ్య శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయణ. అయితే.. మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి పైప్ లైన్ల లీకేజిలను అరికట్టినట్లు చెప్పిన కమిషనర్… పట్టణంలోని బోర్లను మూసేసి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. డయేరియా కేసులు పెరగకుండా శానిటేషన్, బ్లీచింగ్, మురుగు కాలువల్లో స్ప్రే చేయడం, ఫాగింగ్ చేస్తున్నట్లు కమిషనర్ మంత్రి నారాయణకు వివరించారు. పట్టణంలో డయేరియాను అదుపులోకి తెచ్చేలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా వైద్యారోగ్య అధికారి రవి తెలిపారు. సున్నా కేసులు తీసుకొచ్చే వరకూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు DMHO చెప్పారు. డయేరియా నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మున్సిపల్, వైద్యారోగ్య అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్యం విషయంలో అప్రమత్తంగా ఉండి డయేరియా రాకుండా అరికట్టాలని అధికారులకు సూచించారు. కేసులు తగ్గిన తర్వాత కూడా మరికొన్ని రోజులు స్పెషల్ డ్రైవ్ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. పిడుగురాళ్ల లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు వివరించాలని ఆదేశించారు మంత్రి నారాయణ.

ఈ మహా నగరానికి ఏమైంది..? ట్విట్టర్ లో కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో అల‌ర్ట్ గా వుంటారు. ప్ర‌తి విష‌యాన్ని షేర్ చేసి అంద‌రితో పంచుకుంటుంటారు. ట్విట్ ద్వారా ఏవైన స‌మ‌స్య‌ల గురించి చెప్పినా వెంట‌నే స్పందిస్తారు కేటీఆర్. అయితే కాంగ్రెస్ పరిపాలనపై ట్విట్ చేశారు. హైదరాబాద్ అంటే.. కేవలం రాజధాని కాదని.. తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ అని తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే.. మన హైదరాబాద్ దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. దీని వల్ల రాష్ట్రానికి కష్టమే కాదు.. యావత్ దేశానికి కూడా నష్టం.. అంటూ కేటీఆర్ ట్విట్ చేశారు.