రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మే 13తర్వాత రాష్ట్రంలో మార్పు మొదలు అవుతుందని, మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఎన్ డి ఏ కూటమికి మద్ధత్తు పలకాలన్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందన్నారు. వచ్చేది వుత్తరాయనం పండుగలు సీజన్ కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎన్నికల విధుల నుంచి ఎండోమెంట్ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలన్నారు పురంధేశ్వరి. ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆమె వ్యాఖ్యానించారు.
శవరాజకీయాలు చేసింది టీడీపీ మంత్రులే..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తానంటున్నారని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. నాకు అనుభవం ఉందని చెప్పుకోవడమే తప్ప పేదల పక్షాన ఇది చేస్తానని చెప్పే సత్తా చంద్రబాబుకు లేదన్నారు. శవరాజకీయాలు చేసింది టిడిపి మంత్రులే అని ఆమె ధ్వజమెత్తారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఏర్పాట్లు చేయకుండా షూటింగ్ ల పేరుతో 32 మంది అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, వృద్ధులకు పెన్షన్లు అందకూడదని టిడిపి నాయకులు చేత ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేయించారన్నారు.
ప్రముఖ తెలుగు మాజీ న్యూస్ రీడర్ ‘శాంతి స్వరూప్’ మృతి..!
తాజాగా ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ శుక్రవారం ఉదయం గుండె పోటుతో కన్నుమూశారు. హైదరాబాదులోని మలక్ పేటలో ఉన్న యశోద ఆసుపత్రిలో గుండెపోటు అనంతరం చికిత్స పొందుతూ ఆయన కోలుకోలేక మృతి చెందాడు. ప్రస్తుత తరం వారికి అంతగా తెలియకపోయినా.. ముందుతరం వారికి తెలుగు దూరదర్శన్ అంటే మొదటిగా చెప్పే పేరు శాంతి స్వరూప్. రాత్రి అయితే చాలు ఆయన వార్తలు చదవటానికి ప్రత్యక్షమవుతారు. ఇక 1977 అక్టోబర్ 23న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలను మొదలుపెట్టగా.. అందులో మొట్టమొదటిగా తెలుగు యాంకర్ గా శాంతి స్వరూప్ పనిచేశారు. ఇప్పుడంటే న్యూస్ చదివే వారికి టెలీప్రాంప్టర్ ఉంది. అయితే టెలీప్రాంప్టర్ లేని రోజులలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా న్యూస్ చదివి అందరి మన్నలను పొందాడు శాంతి స్వరూప్. ఇలా ఆయన 2011లో దూరదర్శన్ నుండి పదవి విరమణ పొందాడు.
గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించాం
గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించామని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఇవాళ ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారని, ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణమన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారని, వైసీపీ విజయానికి మనమంతా కృషి చేయాలన్నారు.
గంజాయి మత్తులో తండ్రిని కిరాతకంగా చంపిన కొడుకు..!
డ్రగ్స్ కు బాలిసగా మారిన కన్న కొడుకును మందలించిన తండ్రిని దారుణంగా చంపిన ఘటన ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో కలకలంగా మారింది. కొడుకు మారుతాడని సొంత ఊరినే వదిలేసి వచ్చిన తీరు మారకపోవడంతో.. తండ్రిని బండరాయితో మోది, పెట్రోల్ పోసి తగలపెట్టాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో చోటుచేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కొడుకును అదుపులో తీసుకున్నారు.
చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు టీడీపీని దెబ్బతీస్తాయి
నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ రుక్మిణి, ఎస్.సి.కమిషన్ మాజీ సభ్యుడు బద్దేపూడి రవీంద్రలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరుతున్నారన్నారు. జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు వస్తున్నారని, వాలంటీర్ వ్యవస్థ పై ఫిర్యాదులు చేయించి.. పింఛన్ దారులను చంద్రబాబు ఇబ్బందులకు గురి చేశారన్నారు. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు టీడీపీని దెబ్బతీస్తాయన్నారు విజయసాయిరెడ్డి. వాలంటీర్ మీద ఆధారపడిన ప్రతి కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తోందని, వై.సి.పి.అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తామన్నారు. రేపు జగన్ బస్సు యాత్ర నెల్లూరు జిల్లాలో సాగుతుందని ఆయన వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల ఎఫెక్ట్.. హైదరాబాద్ లో రూ.40 లక్షలు సీజ్..!’
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఇవి ఎన్నిక కోడ్ నిబంధనలు. లేకుంటే నగదు స్వాధీనం చేసుకుంటారు. బంగారు, వెండి ఆభరణాలకు కూడా సరైన ఆధారాలు చూపాలి. మద్యం రవాణాపై ఆంక్షలు ఉంటాయి. అయితే ఇవి ఎన్నికల కోడ్ నిబంధనలు.. దీంతో.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ సోదాలు నిర్వహించి అక్రమ నగదు తరలింపును అడ్డుకుంటున్నారు. తాజాగా ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీగా నగదు సీజ్ చేస్తున్నారు. సరైన పత్రాలు లేని రూ.40 లక్షల డబ్బును హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలు!
దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ‘న్యాయ్‌పత్ర’ పేరుతో మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే.. ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఎన్నికల మేనిఫెస్టోను ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రిలీజ్ చేశారు. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై మేనిఫెస్టో రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ పీ చిదంబరం తెలిపారు.
గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని, అన్నిరంగాల్లో విధ్వంసం జరిగిందని మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం అన్నారు. అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ, దేశవ్యాప్తంగా కులగణన, రిజర్వేషన్‌పై 50శాతం పరిమితి తొలగింపు, వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు లాంటి అంశాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి.
పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుని చంద్రబాబు వృద్ధుల ఉసురు పోసుకున్నాడు
ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుని చంద్రబాబు వృద్ధుల ఉసురు పోసుకున్నాడని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. మండు టెండలో పింఛన్ కోసం వృద్ధులు పడుతున్న ఇబ్బంది చూసి బాధగా ఉందన్నారు. ఈ ఊరులో వరదరాజుల రెడ్డికి.. అక్కడ చంద్రబాబుకు కనికరం లేదన్నారు. చంద్రబాబు చేసినా దుర్మార్గమైన చర్యకు చంద్రబాబు ఒక్కరు ఓటు కుడా వేయరని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వృద్ధులకు, దివ్యంగులకు, వితంతువులకు ఈ పింఛన్ గొప్ప వరమని ఆయన తెలిపారు. పింఛన్ 4 వేల నుండి 5వేల రూపాయలు ఇవ్వాలని జగన్ కు విన్నవించుకొంటున్న అని ఆయన వ్యాఖ్యానించారు.
మోడీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు..
మోడీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో పర్యటిస్తున్నా ఆయన ఇవాళ అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతుంది. అనంతరం ఆయన మట్లాడుతూ.. దేశంలో 7 దశలలో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. మే 13న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయన్నారు. నగర ప్రజలను కొరేది ఒక్కటి అందరూ తమ ఓటు హక్కు వినియోగించాలి, ఓటు మన ప్రాథమిక హక్కు అన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యం గురించి అబ్దుల్ కలాం ఇంతగా వివరించారో మనకు తెలుసన్నారు. ఎంఐఎం ఉన్న ప్రాంతాలలో 80 శాతం ఓటింగ్ పోల్ అవుతుందన్నారు. మనం నివసించే ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని, పోలింగ్ శాతం పెంచే దిశగా క్యాంపెన్ చేయాలన్నారు.
