NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అక్షరాల మార్పు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అక్షరాల మార్పు కోసం 1000 కోట్ల రూపాయల ఖర్చు? రైతుల కోసం ‘రైతు భరోసా’ అమలు చేయలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, పింఛన్లు పెంచలేదు. ఇక ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేని కాంగ్రెస్ ప్రభుత్వం, అనవసరమైన విషయాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందా?” అని ప్రశ్నించారు.

రష్యా నుంచి ఉక్రెయిన్ బందీల విడుదల.. జెలెన్‌ స్కీ ట్వీట్

గత ఏడాదిలో తమ దేశానికి చెందిన 1,358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్‌ స్కీ తెలిపారు. వారిని విడిపించడానికి ఉక్రెయిన్‌ అధికారులు చాలా కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. కొత్త సంవత్సరం 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉందని తాజాగా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా అతడు పోస్టు పెట్టారు. రష్యా దగ్గర బందీలుగా ఉన్న తమ సైనికులు, పౌరుల విడుదలలో మిత్ర దేశాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం కూడా ఈ ఏడాదిలోనే ముగియాలని ఈ సందర్భంగా జెలెన్‌స్కీ కోరారు.

నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు

ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుండి మధ్యాహ్న భోజనం అందించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు ఈ పథకం ప్రారంభచనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో 1,48,419 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. విజయవాడ పాయకాపురం నుండి మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

భారత బౌలర్ల దాటికి కంగారులు విలవిల.. స్వల్ప ఆధిక్యంలో భారత్

బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంలోని సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 4 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా తరఫున బ్యూ వెబ్‌స్టర్ 57 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, నితీష్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు.

టీమిండియాకు షాక్.. ఆట మధ్యలోనే మైదానం వీడిన బుమ్రా.. కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట మధ్యలోనే స్టాండిన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మైదానం వీడాడు. 31వ ఓవర్ ముగిసిన తర్వాత గాయం వల్ల అకస్మాత్తుగా గ్రౌండ్ ను వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత వైద్య బృందంతో కలిసి స్కానింగ్ కోసం అతడు హస్పటల్ కి వెళ్లాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అప్పగించారు. దీంతో బుమ్రా మైదానం వీడటం భారత్‌కు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. దీంతో బుమ్రాకు ఏం కావొద్దంటూ సోషల్ మీడియాలో టీమిండియా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

యూనివర్సిటీల్లో కుల వివక్ష.. యూజీసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిని అరికట్టేందుకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించాలని చెప్పుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో విద్యార్థులపై కుల వివక్షను రూపుమాపేందుకు ముసాయిదాను రెడీ చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించడానికి సిద్ధం చేసిన 2012 రూల్స్ ప్రకారం.. ఎన్ని ఈక్వల్ అపార్చునిటీ యూనిట్స్ స్థాపించారో డేటా అందజేయాలని పేర్కొనింది. ఈ సమస్యపై మాకు పూర్తి అవగాహన ఉంది.. దీనిపై ఏదో ఒకటి చేస్తామన్నారు.

పావురాలతో ఆ పని చేస్తూ పట్టుబడ్డ కేటుగాళ్లు

వికారాబాద్ జిల్లా పరిగి లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ట్రాలీ ఆటోలో తెచ్చిన పావురాలను ఆకాశంలోకి వదులుతుండగా స్థానికులు పట్టుకున్నారు. అయితే.. ముందు పావురాలతో వైరస్‌ను వ్యాపించేందుకు ప్లాన్‌ చేశారనే అనుమానంతో స్థానికులు వారిని ప్రశ్నించారు. దీంతో.. వాళ్లు స్థానికులతో బేరసారాలకు దిగారు. దీంతో పావురాల బెట్టింగ్‌ కథ బయటపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ట్రాలీ ఆటోలో పావురాలను తెచ్చి పందెం నిర్వహిస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ట్రాలీ ఆటోను తనిఖీ చేయగా 20 బాక్సులలో సుమారు 300 పావురాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

ప్రజలను జగన్ మోసం చేశారన్న మంత్రి నిమ్మల

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని 6 గ్రామాలలో రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు రూ. 6 కోట్ల 86 లక్షల నిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పాలకొల్లు మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం విడుదల చేసిన 832 కోట్ల రూపాయల నిధులు, దళారీ వ్యవస్థ లేకుండా వారి అకౌంట్లలో జమ అవుతున్నాయని తెలిపారు.

అగ్ని మాపక శాఖలో చేరబోతున్న 196 డ్రైవర్ ఆపరేటర్లకు అభినందనలు..

ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత అగ్నిమాపక శాఖలో డ్రైవర్ అపరేటర్‌లకు మొట్టమొదటి బ్యాచ్‌కు నేడు పాసింగ్‌ అవుట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. విపత్తు స్పందన , అగ్ని మాపక శాఖలో చేరబోతున్న 196 డ్రైవర్ ఆపరేటర్లకు అభినందనలు తెలిపారు. నాలుగు నెలల పాటు మీ ట్రైనింగ్ ఎలా ఉందో వివరించారని, డ్రైవర్ ఆపరేటర్ల అందరి పైన గురుతుర బాధ్యత ఉందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. విపత్తు ఎక్కడ జరిగిన మేమున్నామన్నా ధైర్యం కల్పించేలా ఉండాలని, ఫిబ్రవరిలో ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ను సీఎం రేవంత్ ప్రారంభించారన్నారు. నియమాకాలకు సంబంధించి ఓ పరిష్కాయం చూపించి న్యాయ పరంగా ఉన్న చిక్కులను తొలగిస్తూ ఉద్యోగ నియమకాలను చేస్తుంది ప్రజా ప్రభుత్వమని, మొత్తం 878 మందికి ప్రజా ప్రభుత్వంలో ఎస్‌డీఆర్ఎఫ్ లో నియామకాలు చేయడం గర్వంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. గోదావరి పరిసర ప్రాంత ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చారని, వరంగల్, ఖమ్మంలో వరదల సమయంలో ముందుండి నిలబడి భరోసా ఇచ్చిన ఫైర్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి శ్రీధర్‌బాబు. ఈ రోజు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడి , చదివించి నేడు పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా వారి ఆనందభాష్పాలు మీకందరికి స్పూర్తిధాయకంగా నిలవాలని, ఉద్యోగ ధర్మంలో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు రాష్ర్టానికి, డిపార్ట్మెంట్ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా అని ఆయన వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామంటున్న మాజీ మంత్రి

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ తీరును ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ తీరును, ముఖ్యంగా ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. అలాగే నెల్లూరు జిల్లా ఎస్.పి. తన విధులకు కాస్త దూరంగా ఉంటున్నాడని, వెంకటాచలం మాజీ జెడ్పిటిసి వెంకట శేషయ్య యాదవ్ పై శ్రావణి అనే మహిళ ఫిర్యాదు చేయించి తప్పుడు కేసు నమోదు చేయించారన్నారు. ఆ కేసులో శ్రావణి తన వద్ద ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్లు పేర్కొందని తెలిపారు. కానీ, మెటీరియల్ ఏవిడెన్స్ ఉందని చెబుతూ.. మళ్లీ ఆ రిమాండ్ రిపోర్ట్ ను మార్చి తీసుకెళ్లారని అన్నారు. కొవ్వురూలో స్టాంపు వెండర్ లోక్ నాథ్ సింగ్ నుంచి కొనుగోలు చేశారని ఆయన అన్నారు.

 

Show comments