విశాఖ సిగలో మరో పర్యాటక మణిహారం
విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుంది విశాఖ పట్నం. అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలతో విశాఖ పోర్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పోర్టు డెవలప్ మెంట్ పై రాష్ట్రం ప్రభుత్వంతో పాటు కేంద్రప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇక కేంద్ర కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి శర్భానంద్ సోనోవాల్, సహాయ మంత్రి శ్రీపాద నాయక్ ఇవాళ, రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నతాధికారులతో, పలువురు మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 333.56 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర మంత్రులు. ఇక విశాఖ పోర్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు క్రూయిజ్ టెర్మినల్ రెడీ అయిపోయింది.
రిజర్వేషన్ల పరిమితిని 50శాతానికి పెంచాలి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఒవైసీ
ఓబీసీలను ఉప-వర్గాలుగా విభజించడానికి.. 2600 ఓబీసీ కులాల జాబితాను రోహిణి కమిషన్ నివేదికలో ఇవ్వబడింది. ఓబీసీ కోటాను ఎలా కేటాయించాలనేది కూడా ఈ నివేదికలో చెప్పబడింది. ఓబీసీ రిజర్వేషన్ అంశంపై ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. భారత జనాభాలో 50శాతం కంటే ఎక్కువ మంది కేవలం 27శాతం (రిజర్వేషన్లు) కోసం పోటీ పడవలసి వచ్చిందని ఒవైసీ ట్విట్టర్లో పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 50శాతం (రిజర్వేషన్లు) పరిమితిని పెంచాలి. ఆ కులాల రిజర్వేషన్లను పొడిగించాలి. రిజర్వేషన్ల ప్రయోజనాన్ని ఎప్పటికీ పొందలేని వారికి కొన్ని ఆధిపత్య కులాలు అన్ని ప్రయోజనాలను మూలన పడేశాయి. సమానత్వం ఆధారంగా అన్ని వర్గీకరణలు జరగాలి. తద్వారా చిన్న నేత కుటుంబంలోని పిల్లలు మాజీ భూస్వామి కుమారుడితో పోటీ పడకుండా బలవంతంగా ఉండాలి. సెంట్రల్ ఓబీసీ జాబితాలో చేర్చాలి.
యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రెండింగ్ గా నిలిచిన గణేష్ ఆంథమ్..
`భగవంత్ కేసరి` దసరా కానుకగా అక్టోబర్ 19 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దీంతో ఇప్పటి నుంచే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్.ప్రమోషన్స్ లో భాగంగానే `గణేష్ ఆంథమ్`ని విడుదల చేశారు.. ఇందులో బాలకృష్ణ, శ్రీలీల కలిసి అదిరిపోయే స్టెప్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు.. ఎల్లో డ్రెస్ లో బాలయ్య..బిడ్డ ఆంతలేదు జర చప్పుడు గట్టిగా చేయమని చెప్పు అని చెప్పగా.. దానికి బదులుగా శ్రీలీల అరే చిచ్చా వచ్చిండు తీసి పక్కన పెట్టండి మీ తీన్ మార్.. కొట్టండి సౌ మార్ అంటూ మాస్ స్టెప్స్ వేసి రచ్చ రచ్చ చేసింది.బాలయ్య, శ్రీలీల రెచ్చిపోయి మరి డాన్సు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది.. ఈ పాటకి థమన్ అదిరిపోయే సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. కరీముల్లా, మనీషా పాండ్రంకి ఈ పాట ను ఆలపించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ అదిరిపోయే కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఈ గణేష్ ఆంథమ్ యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రెండింగ్ నెం.1 గా నిలిచింది. దీనితో ఈ సాంగ్ వింటూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు.
జమిలీ ఎన్నికలపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం జమిలీ కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామన్న ఆయన సీఎం జగన్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తిరిగి జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడ లేవని సుబ్బారెడ్డి కితాబిచ్చారు. ఇక పోటీ విషయం గురించి మాట్లాడుతూ ప్రతి నిర్ణయం జగనే తీసుకుంటారన్నారు. .ఎన్నికల్లో పోటీ విషయంలో సీఎం జగన్ ఎలా నిర్ణయిస్తే అలా చేస్తామని తెలిపారు.
“సనాతన ధర్మాన్ని నిర్మూలించండి”.. స్టాలిన్ కొడుకు వివాదాస్పద వ్యాఖ్యలు..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని శనివారం అన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. ‘సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటది, దీన్ని నిర్మూలించాలి’’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. బీజేపీ పార్టీ ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తమిళనాడు మంత్రిపై కేసు పెట్టాలని పలువురు పిలుపునిచ్చారు. సీఎం స్టాలిన్, డీఎంకే పార్టీ వారసుడిగా పేరు సంపాదించుకున్న ఉదయనిధి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది.
సినీఫక్కీలో 4లక్షలు కాజేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు…
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తు లను అటకాయించి గొడవకు దిగడంతో పాటు సినీ ఫక్కీలో వారి దృష్టి మరల్చి డబ్బులు తస్కరిస్తున్న ముఠా సభ్యులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.. జూబ్లీహిల్స్కు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి గౌతమ్ యాదవ్(32) అనే వ్యక్తితో పాటు పని చేస్తున్న యువతి సబ్జా కాలనీలో నివాసం ఉంటుంది. గత నెల 31న రాత్రి 9.30 ప్రాంతంలో ఆమెతో పాటు కారులో తోడుగా వెళ్లిన గౌతమ్ ఆమె ఇంటివద్ద కారు దిగి తన స్నేహితుడి బైక్పై ఇంటికి బయలుదేరాడు. కొంతదూరం రాగానే రోడ్డుపై కాపుకాసిన హకీంషా, సమీపంలో నివాసం ఉండే అఫ్రోజాన్(24) అనే ఆటో డ్రైవర్, మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇబ్రహీం ఖలీలుల్లా(20), పారామౌంట్ కాల నీలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న అహ్మదాబాన్(21)లు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎందుకు యువతితో కలిసి వచ్చావంటూ ప్రశ్నించాడు. ఒంటరిగా వస్తున్న స్నేహితురాలిని ఇంటివద్దకు దింపేందుకు వచ్చానని చెప్పినా వినిపించుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది..
కొత్త సీసాలో పాత మందు.. కోట్లు సంపాదించిన ఢిల్లీ ప్రభుత్వం
కొత్త సీసాలో ‘పాత మద్యం’… అవును.. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన గత ఏడాది లెక్కలు చూస్తే ఈ ప్రకటన సరిగ్గా సరిపోతుంది. గత సంవత్సరం ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని మద్యం మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. అంతే కాకుండా దానిపై చాలా రాజకీయ ప్రకంపనలు కూడా రేగాయి. ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబరు 1, 2022 నుండి ‘పాత మద్యం విధానాన్ని’ అమలు చేసింది. ఇప్పుడు దీని కారణంగా ఆదాయాలు, అమ్మకాలలో ‘కొత్త రికార్డు’ సృష్టించబడింది. ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2022, ఆగస్టు 31, 2023 మధ్య 61 కోట్లకు పైగా మద్యం బాటిళ్లను విక్రయించింది. పాత ఎక్సైజ్ పాలసీ ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలు, కాంట్రాక్టుల విక్రయాల్లోనూ ఇదే సరికొత్త రికార్డు.
రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. నేటి నుంచి ఆ రైళ్లు రద్దు
రైల్వే ప్రయాణీకులకు అలర్ట్. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో పలు రైళ్లు పూర్తిగా రద్దుకానుండగా, మరికొన్ని పాక్షికంగా రద్దు అవనున్నాయి. నేటి నుంచి ఈ నెల 10 వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. విజయవాడ సెక్షన్‌లో భద్రతాపరమైన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఇక శాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్, గుంటూరు- రాయగఢ్ ఎక్స్ ప్రెస్, విశాఖ-విజయవాడ- విశాఖ-రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. 4 నుంచి 10వ తేదీ వరకు లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రద్దు చేయబడింది.
భయపెడుతున్న చిరుతలు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సంచారం
గత కొన్ని రోజులుగా తిరుమలలో చిరుత సంచారం భయాందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం అధికారులు ఆపరేషన్ చిరుత కూడా చేపట్టి చిరుతల్ని పట్టుకున్నారు. తాజాగా అలిపిరి నడకమార్గం నరశింహస్వామి ఆలయ సమీపంలో చిరుత సంచారాన్ని గుర్తించారు. గతంలో ఇదే ప్రాంతంలో రెండు చిరుతలను అధికారులు ట్రాప్ చేశారు. ఇక నిరంతరాయంగా చిరుతల కదలికలను గుర్తించేలా ఏర్పాట్లు చేసిన అధికారులు ఇప్పటి వరకు నాలుగు చిరుతలను ట్రాప్ చేశారు. అదేవిధంగా నడకమార్గంలో శాశ్వత ప్రాతిపాదికన ట్రాప్ కెమెరాలను టీటీడీ ఏర్పాటు చేసింది.
“టాక్టికల్ న్యూక్లియర్ అటాక్” డ్రిల్ నిర్వహించిన కిమ్..
ఉత్తర కొరియా మరసారి తన అణు సమర్థతను చాటుకునేందుకు కీలక చర్యకు పాల్పడింది. తాజాగా ‘వ్యూహాత్మక అణుదాడి’(టాక్టికల్ న్యూక్లియర్ అటాక్) డ్రిల్ చేపట్టినట్లు ఉత్తరకొరియా పేర్కొంది. కిమ్ జోంగ్ ఉన్ గత కొంత కాలంగా అమెరికా, దక్షిణ కొరియాలకు తన అణుక్షిపణులతో సవాల్ విసురుతున్నాడు. అణుయుద్ధం జరిగినప్పుడు ఈ దేశాల నుంచి దాడుల్ని తట్టుకుని వ్యూహాత్మకంగా అణుదాడి ఎలా చేయాలనేదానిపై డ్రిల్స్ నిర్వహించింది.
శనివారం ఈ డ్రిల్‌ని నిర్వహించింది. ఇందులో రెండు లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. దీంతో పాటు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న నౌకానిర్మాణం, ఆయుధ కర్మాగారాలను తనిఖీ చేసినట్లు ఆ దేశ మీడియా ఆదివారం నివేదించింది. శతృవులను హెచ్చరించేందుకు ఈ డ్రిల్ నిర్వహించినట్లు వెల్లడించింది. న్యూక్లియర్ వార్‌హెడ్లను మోసుకెళ్లే రెండు లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్లను దేశ పశ్చిమ ప్రాంతం నుంచి ప్రయోగించింది. రెండు క్షిపణులు 150 మీటర్ల ఎత్తులో 1500 కిలోమీటర్లు ప్రయాణించాయి.
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఐదుగురు మృతి..
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు, కర్నూలు, రహదారిలో లారీ వేగంగా వచ్చి ఆటోని ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఐదుగురు మరణించారు.. ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందగా మరొక ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. సంతమాగులురు రోడ్డు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
మృతులంతా పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన వాళ్లు ఆర్కెస్ట్రా గ్రూప్ సభ్యులు.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. లారీ డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది.. ఆ రోడ్డు మొత్తం రక్తంతో తడిసింది.. గుంటూరు , కర్నూలు రహదారిలో సంతమాగులూరు దగ్గర ఆర్కెస్ట్రా బృందంతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ఉన్న వాళ్లలో ముగ్గురు స్పాట్‌లో మృతి చెందారు. మరొక ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
జమిలి ఎన్నికలు మంచిదే కానీ… చర్చ జరగాలని లా కమిషన్‌కు చెప్పాం
జమిలి ఎన్నికలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ మాట్లాడుతూ.. 2018లో జమిలి ఎన్నికల పై మా అభిప్రాయం చెప్పామని, జమిలీ ఎన్నికలు మంచిదే కానీ…చర్చ జరగాలని లా కమిషన్ కు చెప్పామన్నారు. మోడీ సర్కార్ పదేళ్లుగా మాట్లాడకుండా ఇప్పుడు హడావుడిగా పార్లమెంట్ సమావేశాలు పిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు పెట్టీ మోడీ దేశాన్ని గందరగోళ పరిస్థితులోకి నెట్టాడని ఆయన మండిపడ్డారు. మోడీకి తప్ప… బీజేపీలో ఉన్న వారికి కూడా ఏమి జరుగుతుందో తెలియడం లేదని వినోద్ కుమార్ అన్నారు. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతితో కమిటీ వేయడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. కమిటిలో అంతా ఉత్తర భారతదేశ సభ్యులు మాత్రమే ఉన్నారని, దక్షిణ భారత దేశం నుంచి ఒక్కరూ కూడా లేరని ఆయన విమర్శలు గుప్పించారు.
