*వేగం పెంచిన సిట్.. నేడు కొలిక్కి వచ్చే అవకాశం!
ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా నియమించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. ఈ క్రమంలోనే సిట్ బృందం వేగంగా విచారణ జరుపుతోంది. పోలింగ్ అనంతర అల్లర్లపై సిట్ విచారణ నేడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిన్నటి నుంచే సిట్ రంగంలోకి దిగింది. తాడిపత్రి, నరసరావు పేట, తిరుపతిలో శనివారం నుంచే సిట్ టీమ్ విచారిస్తోంది. ఇప్పటికే అల్లర్లపై నమోదైన కేసులను సిట్ బృందం పరిశీలించింది. కేసులు నమోదైనా అరెస్ట్ అవ్వని నేతలు ఎక్కడున్నారనే దానిపై ఆరా తీస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్ లు, వీడియోలు, ఫొటోస్ ద్వారా కొన్ని కొత్త కేసులు నమోదు చేయనుంది. ఇవాళ సాయంత్రానికి విచారణ నివేదికను అందించేలా ప్రత్యేక విచారణ బృందం పని చేస్తోంది. సిట్ విచారణకు 2 రోజుల గడువు ఇవాళతో ముగియనున్న నేపథ్యంలో ముమ్మర విచారణ చేపట్టింది సిట్ బృందం. తిరుపతిలో సిట్ బృందం విచారణ కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో కేసులతో పాటు అల్లర్లకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ వివరాలను అధికారులు పరిశీలించారు.
*భర్తపై దాడి.. వైన్ షాప్ సిబ్బందిపై భార్య ప్రతీకారం..
భార్తను కొట్టే భార్యలను చూసాం.. భార్యలను కొట్టే భర్తను చూసే ఉంటాము. కానీ.. ఇప్పుడు ఓ భార్య గురించి చెప్తే నిర్ఘంగా పోవాల్సిందే. ఎందుకంటే చీటికి మాటికి పార్టీలనీ పబ్బులనీ మద్యం సేవిస్తూ ఉండే భర్తను మానేయాలని సలహాచెప్పే భార్యలను చూసే ఉంటాము. అంతేకాదు భర్త మందు మానకపోతే భర్తనే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయే భార్యలున్న ఈరోజుల్లో వైన్ షాప్ లో భర్త మందు అడిగితే కొట్టారనే ఆగ్రహంతో ఊగిపోయిన భార్య వైన్ షాప్ సిబ్బందిపైనే కాకుండా.. అడ్డొచ్చని పోలీసులపై దాడి చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. మద్యం కొనేందుకు అక్కడే వైన్ షాప్ వద్దకు వెళ్లి ఓ వ్యక్తి మద్యం ఇవ్వాలని అడిగాడు. దీంతో అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. మద్యం అడిగిన వ్యక్తిపై వైన్ షాప్ సిబ్బంది దాడి చేశారు. ఆ వ్యక్తి తల పగల గొట్టి తీవ్రంగా గాయపరచారు. దీంతో భర్తను రక్తంతో చూసిన భార్య కాసేపు ఏం జరుగుతుందో అర్థంకాలేదు. వైన్ షాప్ సిబ్బందిని అడ్డుకున్నా ఎవరు మాట వినకపోవడం భర్తపై దాడి చేస్తుండటంతో భర్య రెచ్చిపోయింది. వైన్ షాపులోకి జొరబడి సిబ్బందిపై దాడికి దిగింది. మద్యం కొనేందుకు వచ్చిన నా భర్తపై దాడి చేస్తారా? అంటూ దాడికి చేసింది. అయితే స్థానిక సమాచారంతో వైన్ షాప్ దగ్గరకు చేరుకున్న పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ పోలీసులని చూడకుండా జుట్టు పట్టుకుని కొట్టింది. దాడి చేసిన వారిపై కాకుండా నన్ను, నా భర్తను అడ్డుకుంటారా? నా భర్తపై తల పగిలేట్టు కొట్టినా మీకు కనిపించడం లేదా? అంటూ ప్రశ్నిస్తూ దాడికి దిగింది. దీంతో పోలీసులకు గాయాలయ్యాయి. వైన్ షాప్ సిబ్బందితో దాడి, అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై దాడి చేసిన మహిళపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. వైన్ షాప్ సిబ్బంది మద్యం కొనేందుకు వచ్చని వ్యక్తిపై ఎందుకు దాడి చేశారు? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
*దారుణం.. ఫోనులో డాక్టర్.. ఆపరేషన్ చేసిన నర్సులు.. పాప మృతి
వరంగల్ జిల్లా వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి ఫోన్ ద్వారా డాక్టర్ సలహా తీసుకుంటూ ఇద్దరు నర్సులు డెలివరి చేశారు. దాంతో పుట్టిన మగశిశువు ఒక రోజు తర్వాత చనిపోయింది. డాక్టర్ నర్సుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయిందంటూ పోలీసులకు బిడ్డ తండ్రి ఇచ్చిన పిర్యాదు చేయడంతో కథ వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామానికి చెందిన కసిరెడ్డి నరేశ్ భార్య బేబీ శ్రీజ పురిటి నొప్పులతో ఈ నెల 16న వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో చేరింది. 17న నొప్పులు రావడంతో డెలీవరీ చేయాలని నరేశ్ కుటుంబసభ్యులు డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ ని కోరారు. అయితే డాక్టర్ శ్రీజను చూడకుండానే గర్భిని అని కూడా కనికరం లేకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే నొప్పులు మరింత పెరగడంతో అక్కడే ఉన్న స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎమ్ లు శ్రీజ పరిస్థితిని డాక్టర్ కు ఫోన్ లో వివరించారు. దీంతో వైద్యురాలు. స్టాఫ్ నర్స్ కి ఏఎన్ఎంకి తాను ఫోన్ లో చెబుతున్న తీరు చేయండి అని వారికి సూచన చేయడంతో ఇద్దరు నర్సులు శ్రీజను లేబర్ రూమ్ కి తీసుకెళ్లారు. ఫోన్ లో డాక్టర్ తో మాట్లాడుతూ ఆమె ఇస్తున్న సూచనలతో శ్రీజకు డెలీవరీ చేశారు నర్సులు. అయితే.. డెలివరి తర్వాత మగశిశువు పుట్టగా.. బిడ్డను తల్లికి చూపించకుండానే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ ఆ శిశువు చికిత్స పొందుతూ చనిపోయింది. తమ బిడ్డ చనిపోవడానికి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎమ్ ల నిర్లక్ష్యమే కారణమంటూ శ్రీజ భర్త నరేశ్ వర్థన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీజ భర్త నరేశ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కూడా డాక్టర్ ఫోన్ లో చేస్తున్న సూచనలతో డెలివరి చేసినట్లు స్టాఫ్ నర్స్ ఏఎన్ఎమ్ ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎమ్ ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనేది ఉప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
*రేపు టీజీ ఈసెట్ ఫలితాలు.. మధ్యాహ్నం 12:30 గంటలకు..
TG ESET 2024 ఫలితాలు రేపు (సోమవారం మే 20) విడుదల కానున్నాయి. మసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈసెట్ కన్వీనర్ పి చంద్రశేఖర్ ప్రకటించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. Ecet ఫలితాల కోసం ఈ వెబ్‌సైట్ https://ecet.tsche.ac.in/ లాగిన్ చేయండి. టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్షను మే 6న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ పరీక్షకు తెలంగాణ జిల్లాల్లో 48, హైదరాబాద్ రీజియన్‌లో 44, ఏపీలో 7 కేంద్రాలు మొత్తం 99 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. మరోవైపు తెలంగాణలో PGESET-2024 పరీక్షల షెడ్యూల్ మారింది. ఈ మేరకు అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. TSPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో PGECET రాత పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఎ అరుణ కుమారి వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. PGESET పరీక్షలు జూన్ 6 నుండి ప్రారంభం కానున్నాయి. జూన్ 9వ తేదీలోగా పరీక్షలు పూర్తి కావాలి. అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు, టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. తెలంగాణ పీజీఈసెట్ రాత పరీక్షలు జూన్ 10 నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 13న పూర్తవుతాయి. ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పీజీఈసెట్ (టీఎస్ పీజీఈసెట్ 2024) నిర్వహిస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయి. పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు https://pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
*ఇజ్రాయెల్ ప్రభుత్వానికి కొత్త చిక్కు.. అల్టిమేటం జారీ చేసిన మంత్రి
హమాస్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధానిని రెండు వైపులా చుట్టుముట్టారు. ఓ వైపు రఫాలో ఆపరేషన్ ప్రారంభించడంతో అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు గాజా విషయంలో నెతన్యాహుతో సొంత ప్రభుత్వ మంత్రులే విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రి కూడా అల్టిమేటం జారీ చేసి మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. అటువంటి పరిస్థితిలో, ఇజ్రాయెల్‌లోని నెతన్యాహు ప్రభుత్వాన్ని సంక్షోభ మేఘాలు చుట్టుముట్టాయి. సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ ముగ్గురు సభ్యుల యుద్ధ కేబినెట్ సభ్యుడు బెన్నీ గాంట్జ్, గాజాలో యుద్ధానికి కొత్త ప్రణాళికను ఆమోదించకపోతే ప్రభుత్వం నుంచి రాజీనామా చేస్తానని బెదిరించాడు. యుద్ధంపై కొత్త ప్రణాళికను ఆమోదించకుంటే జూన్ 8న పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. హమాస్‌ను నిర్మూలించడం, అక్టోబర్ 7 దాడిలో కిడ్నాప్ చేయబడిన అనేక మంది బందీలను విడిపించడం కోసం గాజాలో ఏడు నెలలకు పైగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ నాయకత్వంలో చీలికను శనివారం అతని ప్రకటన సూచిస్తుంది.
ఆగ్రహానికి కారణం ఏమిటి?
గాజా తర్వాత నెతన్యాహు రఫాలో యుద్ధాన్ని ప్రారంభించారని, అయితే యుద్ధం ముగిసిన తర్వాత హమాస్ వృద్ధిని ఆపాలనే ఆలోచన తనకు లేదని బెన్నీ గాంట్జ్ చెప్పారు. గాజాపై విజయం సాధించిన తర్వాత అక్కడ ఎలాంటి పాలన ఉంటుందో, ఎవరు పాలిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని గాంట్జ్ అంటున్నారు. నెతన్యాహు దీనిపై ఎలాంటి ఒప్పందాన్ని సిద్ధం చేసుకోకుంటే.. ఈ సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగనున్నారు. ఒకవైపు ఇజ్రాయెల్ సైనికులు హమాస్‌పై ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంటే మరోవైపు తమను యుద్ధానికి పంపిన వారు పిరికితనాన్ని ప్రదర్శిస్తూ తమ బాధ్యతల నుంచి పారిపోతున్నారని ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై విమర్శలు చేశారు.
*తోషాఖానా కేసులో కొత్త ట్విస్ట్.. ఇమ్రాన్ ఖాన్‌కు మరో దెబ్బ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు తోషేఖానా కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీ తోషాఖానాకు చెందిన ఏడు గడియారాలను అక్రమంగా విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. గతేడాది తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఆయన భార్య బుష్రీ బీబీపై చర్యలు తీసుకున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తమ ప్రముఖ నేతలకు ఇతర దేశాల నుంచి ఎలాంటి బహుమతులు వచ్చినా ప్రభుత్వ ఖజానాలో జమచేయాలనే నిబంధన ఉంది (దీనిని పాకిస్థాన్‌లో తోషాఖానా అంటారు). ఇది చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇమ్రాన్ ఖాన్ అలా చేయలేదని ఆరోపించారు. ఇందులో ఆయనపై అనేక రకాల అవినీతి ఆరోపణలు వచ్చాయి. తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేలిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ అని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కొత్త దర్యాప్తు నివేదిక వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో తోషాఖానాకు చెందిన ఏడు గడియారాలను అక్రమంగా కొనుగోలు చేసి విక్రయించినట్లు నివేదికలు వెల్లడించాయి. మాజీ ప్రధానిపై తోషాఖానాలో అవినీతికి సంబంధించిన కొత్త కేసులో 10 ఖరీదైన బహుమతులను సంబంధిత అధికారులకు నివేదించకుండా, వాటిని తోషాఖానాలో డిపాజిట్ చేయకుండా ఉంచడం.. విక్రయించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్ చట్టాల ప్రకారం.. ఏ దేశాధినేత, ప్రథమ మహిళ, రాష్ట్రపతి ఎవరైనా పాక్ అధినేతకు బహుమతిగా ఇచ్చినా, ఆ బహుమతి విలువ రూ.30 వేలకు మించి ఉంటే దానిని తోషాఖానాలో జమ చేయాల్సి ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ ఒక గడియారం, ఉంగరం, నెక్లెస్‌తో సహా ఆభరణాలు సంపాదించి, తోషాఖానాలో జమ చేయకుండా తన వద్దే ఉంచుకున్నట్లు ఎన్‌ఏబీ దర్యాప్తు నివేదిక వెల్లడించింది.
*రఫాలో ఇజ్రాయెల్ విధ్వంసక దాడులు.. ఎనిమిది లక్షలమంది వలసబాట
గాజా, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఆగడం లేదు. ఇప్పుడు దక్షిణ గాజాలోని రఫా నగరం రణరంగంగా మారిపోయింది. గాజాలో దాడుల తరువాత, పాలస్తీనియన్లు దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఆశ్రయం పొందారు. కానీ ఇప్పుడు ఆ నగరం కూడా వారికి సురక్షితమైన స్వర్గధామం కాదు. శనివారం ఇజ్రాయెల్ సైన్యం రఫాపై బాంబు దాడి చేసి దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా 8 లక్షల మంది పాలస్తీనియన్లు రఫా నుండి పారిపోవాల్సి వచ్చిందని ఐక్యరాజ్య సమితి నివేదిక ఇప్పుడు బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో 70 కంటే ఎక్కువ లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది, అలాగే తూర్పు రఫాలో దళాలు “దాడులు” నిర్వహించాయి. ఇందులో 50 మంది ఉగ్రవాదులు మరణించారు. డజన్ల కొద్దీ సొరంగాలు కనుగొనబడ్డాయి. ఇజ్రాయెల్ రఫా ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుండి ప్రజలు పెద్ద ఎత్తున పారిపోయారని పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ UNRWA అధిపతి ఫిలిప్ లాజారిని అన్నారు. అంటూ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు ఇజ్రాయెల్‌లోని అష్కెలోన్ నౌకాశ్రయంపై హమాస్ రాకెట్లను ప్రయోగించిందని.. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంలో ఉన్న ఇజ్రాయెల్ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు హమాస్ సాయుధ విభాగం, ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం గత 10 రోజులుగా రఫా ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది. దీనిని ఇజ్రాయెల్ సైన్యం రఫాలో లిమిటెడ్ ఆపరేషన్ అని పిలిచింది. ఈ ఇజ్రాయెల్ ఆపరేషన్ కారణంగా, పాలస్తీనియన్ల వలస ప్రారంభమైంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఈ యుద్ధం అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత ప్రారంభమైంది. దీని కారణంగా ఇప్పటివరకు వేలాది మంది చనిపోయారు. హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గాజాలో సుమారు 35 వేల మంది మరణించారు.
*స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
ఈరోజు బంగారం కొనాలేనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 68,400, 24 క్యారెట్ల ధర రూ.74,620 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 96,500 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,840, ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,620 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,840 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.74,620 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,470. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..68,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.74,770 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.68,840, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.74,620 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. ఇక వెండి విషయానికొస్తే.. బంగారం తగ్గితే , వెండి భారీగా తగ్గింది .. చెన్నై లో 96,500 ముంబైలో 93,000 ఢిల్లీలో 93,000 బెంగుళూరు లో 89,000, అదే విధంగా హైదరాబాద్ లో 96,500 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..