ఐఆర్ఆర్ కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట:
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు బెయిల్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ కేసులో విచారణ చేసిన ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టి వేసింది. చంద్రబాబు విచారణకు సహకరించపోతే బెయిల్ రద్దు పిటిషన్ వేయండి.. ఈ దశలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని కేసు విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దిపాంకర దత్తల సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. డిపరేన్స్ ఒపీనియన్ తీర్పుతో ఈ కేసుకు సంబందం ఉందా అని సుప్రీం కోర్టు జడ్జి అడిగారు. ఐఆర్ఆర్ కేసులో జనవరి 10న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. దర్యాప్తు సమయంలో ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని సుప్రీంకోర్టు తెలిపింది.
నగరి నుంచే బరిలో ఉంటా:
నాన్ లోకల్ నేతలు సీఎం జగన్ పై మాట్లాడుతూన్నారని మంత్రి రోజా తెలిపారు. విశాఖపట్నం మించిన సభ రాయలసీమలో జరుగుతుందని, టీడీపీ అధినేత చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నాడన్నారు. ‘వైఎస్ షర్మిల నాలుగో కృష్ణుడు లాంటిది. రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరింది. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునే వారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారు. సంక్రాంతి అల్లుళ్ళు లాగా వస్తున్నారు. ఆవిడ వేషం కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబుది. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వాడు నా గురుంచి మాట్లాడుతుండడం సిగ్గుచేటు. 10 ఏళ్లలో నేను ఒక్క రూపాయి తీసుకోలేదు. ఒంగోలు నుంచి నేను పోటీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నగరిలో ఉన్న నాకు ఒంగోలుకు పోవాల్సిన అవసరం లేదు’ అని ఆర్కే రోజా స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి మృతి:
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ప్రజలకు ఎన్నో సేవలు చేశానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. నర్సారెడ్డి అనుభవాలు తమకు మార్గదర్శకమని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.
నాగోబా జాతరకు సర్వం సిద్ధం:
గిరిజన బిడ్డల సంబరాలు అంబరాన్ని తాకే నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతున్న నాగదేవత నాగోబా జాతర కన్నుల పండువగా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం మెస్రం ప్రజలు సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఏడు తలలతో ఆదిశేషుడు ఇక్కడ కొలువై ఉన్నాడని ఆదివాసీ తెగల నమ్మకం. ప్రతి సంవత్సరం పుష్య మాసం అమావాస్య రోజున జాతర నిర్వహిస్తారు, అమావాస్య దర్శనానికి 15 రోజుల ముందు మెస్రం గిరిజనులు జాతరను ప్రారంభిస్తారు. జాతరకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది నుంచి నీటిని తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభం కానుంది.
నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తెస్తాం:
రాజన్న సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్లను డెవలప్మెంట్ చేయడానికి రేడీగా ఉన్నామన్నారు. బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వమని మా మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. నేత కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని తెలిపారు. నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జివో తీసుకొస్తామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు జ్యోతి రావు ఫులే గారిని గుర్తు చేశారా? అని ప్రశ్నించారు. వెయ్యి ఎలుకలు తిని కూడా తీర్థ యాత్ర చేసినట్టుగా ఉంది కేటీఆర్ మాట్లాడినతిరు అలాంటి మాటలు మాట్లాడాడని హెచ్చరించారు.
నితీష్-బీజేపీ పొత్తుపై కాంగ్రెస్:
సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమిని వదిలి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ఆరోపించారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమిని చీకట్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ కలిసి ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్లాన్ చేశారని దుయ్యబట్టారు. ‘ఇలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోలేం. ఇదంతా ముందస్తు ప్రణాళికతో జరిగిందని తెలియజేస్తోంది. ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ-జేడీయూ ఇదంతా ప్లాన్ చేసింది. నితీష్ కుమార్ మమ్మల్ని, లాలూ ప్రసాద్ యాదవ్‌ని చీకట్లో ఉంచాడు’ అని ఖర్గే అన్నారు.
‘మంగళవారం’ చిత్రానికి 4 అవార్డులు:
‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. థ్రిల్లింగ్ రెస్పాన్స్ తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటిటి డిస్నీ హాట్ స్టార్ లో విడుదలై ప్రపంచవ్యాప్త ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. మా మంగళవారం, టెక్నీషియన్స్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను అని డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్ లో చెప్పింది నిజం చేస్తూ ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో 4 అవార్డులని గెలుచుకుంది. ఉత్తమ నటి – పాయల్ రాజపుత్,
ఉత్తమ సౌండ్ డిజైన్ – రాజా కృష్ణన్, ఉత్తమ ఎడిటింగ్ – గుళ్ళపల్లి మాధవ్ కుమార్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – ముదసర్ మొహమ్మద్ అవార్డులు గెలుచుకుంది.
నొవాక్ జొకోవిచ్‌ను కలిసిన తమిళనాడు సీఎం:
టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కలిశారు. స్పెయిన్‌కు వెళ్లే మార్గంలో విమానంలోనే జొకోవిచ్‌ను స్టాలిన్ కలుసుకున్నారు. కాసేపు టెన్నిస్ దిగ్గజంతో మాట్లాడిన సీఎం.. ఆపై ఫొటో దిగారు. ఈ పోటోలను స్వయంగా తమిళనాడు సీఎం తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. విమానంలో జొకోవిచ్‌ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని, అతడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ‘ఆకాశంలో ఆశ్చర్యం. స్పెయిన్‌కు వెళ్లే మార్గంలో టెన్నిస్ దిగ్గజం నోవాక్ జొకోవిక్‌ను కలిశాను’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుకు జొకోవిచ్‌తో తాను దిగిన ఫొటోను జత చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో ఓటమి అనంతరం జకో తన స్వదేశమైన సెర్బియాకు బయలుదేరాడు. ఆ సమయంలోనే సీఎం స్టాలిన్ అతడిని కలిసి ఉంటారు.
బిగ్‌బాస్ 17 విన్నర్ కమెడియన్:
ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 17 విజేతగా ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ నిలిచాడు. విజేతగా నిలిచిన మునావర్ రూ.50 లక్షల నగదుతో పాటు విలాసవంతమైన కారును కూడా పొందాడు. రెండో స్థానంలో అభిషేక్ కుమార్, మూడో స్థానంలో మన్నార చోప్రా, నాలుగో స్థానంలో అంకితా లోఖండే నిలిచారు. సల్మాన్ ఖాన్ హాస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ సీజన్ 17 ఆదివారంతో ముగిసింది. ఫైనల్ ఎపిసోడ్‌కు అజయ్ దేవగన్, ఆర్ మాధవన్ ప్రత్యేక అతిథులుగా వచ్చారు.
