NTV Telugu Site icon

Deepika Padukone: అధిక వసూళ్లు సాధించిన దీపికా పదుకొణె టాప్ 10 సినిమాలు..

Deepika

Deepika

దీపికా పదుకొణె తన మొదటి సినిమా 2007లో చేసింది. అప్పటి నుంచి దీపిక తన నటనతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అయితే తాజాగా దీపికా- రణ్‌వీర్‌ సింగ్‌ తమ ముద్దుల తనయ పేరును ప్రకటించారు. దువా పదుకొణె సింగ్‌ అని నామకరణం చేసినట్టు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్‌కు సమాధానమే ఈమె’’ అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫొటో తీసి షేర్‌ చేసుకున్నారు. అయితే ఇప్పుడు దీపిక యొక్క టాప్ 10 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల పేర్లు తెలుసుకుందాం..

* జవాన్..
జవాన్ 2023లో విడుదలైంది. ఈ సినిమాలో దీపిక సపోర్టింగ్ రోల్ చేసింది. sacnilk.com ప్రకారం.. చిత్రం భారతదేశంలో 640.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాను ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా చూడవచ్చు.

*కల్కి 2898 AD..
దీపిక నటించిన కల్కి 2898 AD 2024లో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.618.5 కోట్లు రాబట్టింది. మీరు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

*పఠాన్
దీపికా పదుకొనే నటించిన పఠాన్ చిత్రం 2023లో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.543.09 కోట్లు రాబట్టింది. మీరు ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

*పద్మావత్
దీపిక నటించిన పద్మావత్ చిత్రం 2018లో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.302.15 కోట్లు రాబట్టింది. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఉంది.

*చెన్నై ఎక్స్‌ప్రెస్
2013లో విడుదలైన చెన్నై ఎక్స్‌ప్రెస్.. ఇండియాలో రూ.227.13 కోట్లు రాబట్టింది. మీరు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో కూడా చూడొచ్చు.

*ఫైటర్
దీపికా పదుకొనే నటించిన ఫైటర్ చిత్రం 2024లో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.212.79 కోట్లు రాబట్టింది. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చిత్రాన్ని చూడవచ్చు.

*హ్యాపీ న్యూ ఇయర్
ఈ హిరోయిన్ నటించి హ్యాపీ న్యూ ఇయర్ సినిమా భారత్‌లో రూ.199.95 కోట్లు రాబట్టింది. 2014లో విడుదలైన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

*యే జవానీ హై దీవానీ
యే జవానీ హై దీవానీ 2013లో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.188.57 కోట్లు రాబట్టింది. మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చిత్రాన్ని చూడవచ్చు.

* బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలా
బాజీరావ్ మస్తానీ 2015లో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.184.3 కోట్లు రాబట్టింది. గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా 2013 సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా ఇండియాలో రూ.117.53 కోట్లు రాబట్టింది. మీరు ప్రైమ్ వీడియోలో చిత్రాలని చూడవచ్చు.

Show comments