Site icon NTV Telugu

Tooth Decay: మీ టూత్‌పేస్ట్‌లో వెంట్రుకలు ఉన్నాయా.. జుట్టుతో కావిటీస్ చికిత్స.. సంచలనం రేపుతున్న కొత్త పరిశోధన

Teeths

Teeths

ప్రజలు కావిటీస్ వదిలించుకోవడానికి అనేక రకాల టూత్‌పేస్ట్‌లు, మందులు, ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తారు. దంత కుహరం సమస్యకు ఇప్పటివరకు ఫిల్లింగ్‌లు, రూట్ కెనాల్ వంటి సాధారణ చికిత్సలే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు కావిటీస్ వదిలించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ప్రకారం, కావిటీస్ నయం కావడానికి ఏ ఔషధం అవసరం లేదు. మీ తలపై ఉన్న వెంట్రుకల ద్వారా నయమవుతాయంటున్నారు సైంటిస్టులు. జుట్టుతో కావిటీస్ చికిత్స చేయొచ్చంటూ కొత్త పరిశోధన సంచలనం రేపుతోంది. మానవ జుట్టులో ఉండే కెరాటిన్ ప్రోటీన్ పళ్లకు కావలసిన సహజ బలాన్ని అందించగలదని తేలింది. మీ టూత్ పేస్ట్ లో వెంట్రుకలు ఉన్నాయా? అనే యాడ్ త్వరలోనే వస్తుందంటున్నారు పరిశోధకులు.

Also Read:Tollywood Producers :దిగివచ్చేందుకు సిద్దమైన ఫెడరేషన్..ఛాంబర్లో నిర్మాతల అత్యవసర సమావేశం?

టూత్‌పేస్ట్‌లోని ఫ్లోరైడ్ దంతాల ఎనామిల్‌ను బలపరుస్తుంది. దంత క్షయానికి కారణమయ్యే ప్లేగ్, బ్యాక్టీరియా ద్వారా విడుదలయ్యే ఆమ్లాలకు మన దంతాలు మరింత నిరోధకతను కలిగిస్తాయి. కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు ఫ్లోరైడ్ కంటే క్షయాన్ని నివారించే, ముందస్తు నష్టాన్ని సరిచేసే పదార్థాన్ని గుర్తించారని చెప్పారు. అది తలపై ఉన్న వెంట్రుకలు అని తెలిపారు. లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ప్రొఫెసర్, కన్సల్టెంట్ అయిన షెరీఫ్ ఎల్షార్కావి మాట్లాడుతూ.. బయోటెక్నాలజీ సహాయంతో చికిత్స చేయడమే కాకుండా శరీరంలోని స్వంత పదార్థాన్ని ఉపయోగించి దంతాల సహజ పనితీరును పునరుద్ధరించడం కూడా సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్తులో సరైన పరిశోధన, పరిశ్రమ మద్దతు లభిస్తే, ప్రజలు జుట్టు కత్తిరించుకున్నంత సులభంగా తమ దంతాలను బలంగా, ఆరోగ్యంగా చేసుకోగలుగుతారని ఆయన వెల్లడించారు.

Also Read:Crime News: దారుణం.. ఒంటరిగా ఉన్న బాలికను హతమార్చిన దుండగులు..!

కెరాటిన్ అనేది మానవ జుట్టు, చర్మం, గోర్లు, గొర్రె ఉన్నిలో కనిపించే ప్రోటీన్. ఇది దంతాలపై బలమైన పొరను ఏర్పరుస్తుంది, ఇది ఎనామెల్ లాగా పనిచేయడం ద్వారా దంతాలను రక్షిస్తుంది. దంతాల సున్నితత్వానికి కారణమయ్యే నరాలను కప్పివేస్తుంది. ఈ ఉత్పత్తి రెండు నుంచి మూడు సంవత్సరాలలో మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని బ్రిటిష్ పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఈ పరిశోధనలో, శాస్త్రవేత్తలు ఉన్ని నుంచి కెరాటిన్‌ను తీసి దంతాలపై పూశారు. ఇది లాలాజలంలోని ఖనిజాలతో కలిసినప్పుడు, ఎనామెల్ లాంటి పొర ఏర్పడటం ప్రారంభమైంది. ఈ పొర క్రమంగా దంతాలను బలోపేతం చేస్తుంది.

Also Read:Nabha Natesh : నభా నటేష్.. వలపులు చూస్తే అనాలి శెభాష్

దంతాల ఎనామెల్ దెబ్బతిన్న తర్వాత, దానిని పునరుత్పత్తి చేయలేము, కానీ కెరాటిన్ సహాయంతో, ఎనామెల్ లాంటి పొర ఏర్పడుతుంది. దంతాల మరమ్మత్తు, రక్షణలో ఇది ఒక ప్రధాన ఆవిష్కరణగా పరిగణిస్తున్నారు. ఈ అధ్యయనం అడ్వాన్స్‌డ్ హెల్త్‌కేర్ మెటీరియల్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఈ విధానం ద్వారా రసాయన ఫిల్లింగ్స్ వాడకం తగ్గి, సహజమైన, దీర్ఘకాలిక పరిష్కారం లభించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఇది ప్రయోగ దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో పళ్ల చికిత్స రంగంలో విప్లవాత్మక మార్పులకు దారి తీసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Exit mobile version