Site icon NTV Telugu

Rain Alert: రేపు, ఎల్లుండి ఏపీలో వర్షాలు.. ఉరుములు, మెరుపులతో పడే ఛాన్స్..!

Rain

Rain

నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ & కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ మరియ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం విస్తరించి ఉందన్నారు.

రేపు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Read Also: Kshatriya: “క్షత్రియుల” ఆగ్రహం ఉత్తర భారతంలో బీజేపీని దెబ్బతీసిందా..?

ఎల్లుండి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి కాకినాడ జిల్లా శంఖవరంలో 47.5మి.మీ, పెద్దాపురంలో 46.2మి.మీ, తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో 44.5మి.మీ, మన్యం జిల్లా పాలకొండలో 39.5మి.మీ, విజయనగరం జిల్లా సంతకవిటిలో 39మి.మీ, రాజాంలో 37.7మి.మీ, వేపాడలో 35.7మి.మీ, తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడిలో 33.5మి.మీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

Read Also: Mahesh Babu: బాబు, పవన్ గెలుపు.. మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్లు

Exit mobile version