Site icon NTV Telugu

Blood Donation Camp: ‘రక్తదానమే ప్రాణదానం’.. రేపు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్

Mega Blood Donation Camp

Mega Blood Donation Camp

Blood Donation Camp: మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాన్ని చిరంజీవి చెల్లెలు మాధవి రేపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా ఈ శిబిరానికి భారీగా మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నారు. రేపు ఉదయం 10గంటలకు రక్త సేకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రక్త దానం చేసిన వారికి రామ్ చరణ్, చిరంజీవి సంతకం చేసిన పత్రాన్ని అందజేస్తారు. ఈ పత్రం సాయంతో వీరి సహచరులకు భవిష్యతులో ఎప్పుడైనా రక్తం అవసరం వస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి అందజేస్తారు.

Read Also: Kaikala Satyanarayana: నవరస నటనాసార్వభౌముడికి కన్నీటి వీడ్కోలు

మహిళలు రక్తదానం చేస్తే వారు కాన్పు సమయంలో సిజేరియన్ ద్వారా డెలివరీ అయితే వారికి రూ.35వేలు, సాధారణ కాన్పు అయితే రూ.25వేలు అందిస్తారు. హైదరాబాద్, విశాఖపట్నం ఒమ్నీ ఆసుపత్రుల్లో.. రక్త దాన ధృవపత్రం చూపించి ఫైనల్ బిల్లు లో డిస్కౌంట్ పొందవచ్చునని కార్యక్రమ నిర్వాహకులు రవణం స్వామినాయుడు, యాళ్ల వర ప్రసాద్ చెబుతున్నారు. రేపు ఉదయం బ్లడ్ బ్యాంక్ దగ్గర అందరికీ అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. రక్త దానం చేసిన వారిని శాలువా తో సత్కరిస్తారు. వీరికి ఫ్లవర్ బొకే, ప్రశంసపత్రం పత్రం అందజేస్తారు. రవాణా విషయానికి కొస్తే.. హైదరాబాద్ ఎల్ బి నగర్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు తిరిగి సాయంత్రం ఎల్ బి నగర్ వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది.

Exit mobile version