NTV Telugu Site icon

Update Aadhar Card : ఆధార్ కార్డ్‌ ఉచిత అప్‌డేట్ కు నేడే ఆఖరు..

Adhaar

Adhaar

ఆధార్ కార్డును ఫ్రీగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటుకు కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆధార్ కార్డు 10 ఏళ్లు నిండినవారు తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు ఆధార్ కార్డులోని చిరునామా, పేరు, ఇతర సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలి. మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. UIDAI అందించిన సమాచారం ప్రకారం, మీ ఆధార్‌ను మరింత సెక్యూర్ గా ఉంచడానికి, డొమోగ్రాఫిక్ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు 10 ఏళ్ల క్రితం అప్‌డేట్ అయింది. ఇప్పటి వరకు అప్‌డేట్ కాలేదని అందుకే ఆన్‌లైన్‌లో ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ఫ్రీగా అప్‌డేట్ చేయడానికి, మీరు https://myaadhaar.uidai.gov.in లింక్‌ లోకి వెళ్లి మీ సమాచారాన్ని అప్‌డెట్ చేసుకోవచ్చు..

Also Read : Viral: మండే ఎండలో ఒంటే దాహం తీర్చిన లారీ డ్రైవర్..

ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి ప్రభుత్వం ఇవాళ్టి వరకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ సదుపాయం రేపటి (15 మార్చి 2023) నుండి ప్రారంభమైంది. అంటే ఇప్పుడు ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేయడానికి రేపటి వరకు మాత్రమే టైం ఉంది. ఆధార్ కార్డును అప్‌డేట్ చేసేందుకు ప్రభుత్వం మూడు నెలల సమయం ఇచ్చింది. ఈ సేవను myAadhaar పోర్టల్‌లో మాత్రమే అప్‌డేట్ చేయవచ్చని UIDAI వెల్లడించింది. అయితే, అప్‌డేట్ చేసే సదుపాయం తర్వాత అందుబాటులో ఉంటుంది.. మీసేవలో అయితే రూ. 50 ఛార్జీతో అప్‌డేట్ చేస్తారు.

Also Read : iPhone 15 Launch: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 15 లాంచ్ డేట్ అప్పుడే! ధర, ఫీచర్ల వివరాలు ఇవే

ఉచితంగా ఎలా అప్‌లోడ్ చేయాలి
*తొలుత myaadhaar.uidai.gov.inకి వెళ్లండి
*ఆ తర్వాత లాగిన్ చేసి పేరు, లింగం, పుట్టిన తేదీ- ఆధార్ అప్‌డేట్‌ని ఎంచుకోండి
*ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ అప్‌డేట్‌ని ఎంచుకోండి
*చిరునామాను ఎంచుకుని, అప్‌డేట్ చేయడానికి కొనసాగండి
*ఇప్పుడు స్కాన్ చేసిన కాపీని అప్‌డేట్ చేయండి.. జనాభా సమాచారాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి
*మీ సేవ అభ్యర్థన నంబర్ ఉత్పత్తి చేయబడుతుంది. దాన్ని సేవ్ చేసి ఉంచండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత మెసేజ్ వస్తుంది.