School Holiday: నిర్మల్ జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు వరుసగా ఈ నెల 3వ తేదీన సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు సెలవు పాటించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో విద్యా సంస్థలకు మంగళవారం సైతం సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
Read Also: Heavy Flood in Krishna River: కృష్ణా నదిలో పోటెత్తుతున్న వరద..! వణికిపోతున్న బెజవాడ వాసులు