Site icon NTV Telugu

CWC Meeting: రేపు సీడబ్ల్యూసీ సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Cwc

Cwc

Congress: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ రేపు ( శనివారం) సమావేశం కాబోతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జూన్‌ 8వ తేదీన ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. రేపు ఉదయం 11:30 గంటలకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సీడబ్ల్యూసీ తొలిసారి సమావేశం కానుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఎన్నికల ఫలితాలపై ఆత్మపరిశీలన, పార్టీ నేతలు అనుసరించాల్సిన విధివిధానాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

Read Also: Matka : వరుణ్ తేజ్ ‘మట్కా’ షూటింగ్ అప్డేట్ వైరల్..?

ఇక, మరికొన్ని రోజుల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఈనెల 9వ తేదీన మూడో సారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మోడీ ఈ సారి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి పరిస్థితి ఏర్పాడింది. 2014 తర్వాత తొలిసారి బీజేపీ మేజిక్‌ ఫిగర్‌ 272 సీట్లను అందుకోలేకపోయింది. మంగళవారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు వచ్చాయి. దీంతో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 292 స్థానాలను దక్కించుకుంది. ఎన్డీయే కూటమి నేతల సపోర్టుతోనే ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో ఎన్డీయేకి ఇండియా కూటమి స్ట్రాంగ్ గా పోటీ ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా 234 స్థానాల్లో విజయం సాధించింది.

Exit mobile version