NTV Telugu Site icon

Tomatoes Tulabharam: ఇదేందయ్యో ఇది.. టమాటాలతో తులాభారం! ఎక్కడో తెలుసా?

Tomatoes Tulabharam

Tomatoes Tulabharam

Tomatoes Tulabharam in Anakapalli Nukalamma Temple: సాధారణంగా దేవాలయాల్లో నిలువెత్తు సొత్తుని దేవుడికి సమర్పిస్తారు. బెల్లం, పంచదార లేదా నాణేలతో తులాభారం వేస్తుంటారు. ఇది మన ఆనవాయితీ. అయితే ఇప్పటివరకూ ఎవరూ వేయని ఓ అరుదైన తులాభారం జరిగింది. తన కూతురిపై ఉన్న ప్రేమతో ప్రస్తుతం ఎంతో ఖరీదైన టమాటాలతో తులాభారం వేశారు తల్లిదండ్రులు. తమ కుమార్తెకు నిలువెత్తు టమాటాలతో తులాభారం వేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో (Tomatoes Tulabharam in AP) చోటుచుకుంది.

అనకాపల్లి పట్టణానికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్య ఉంది. భవిష్య మొక్కుబడి తీర్చుకోడానికి అనకాపల్లి జిల్లా కేంద్రంలోని నూకాలమ్మ ఆలయంకు ఆదివారం అప్పారావు కుటుంబ సభ్యులు వచ్చారు. కుమార్తె నిలువెత్తు బంగారం (బెల్లం) ఇస్తామని అమ్మవారికి మొక్కుకున్న తల్లిదండ్రులు.. ఆ మొక్కుబడి తీర్చుకున్నారు. నిలువెత్తు పంచదార కూడా అమ్మవారికి సమర్పించారు. ఇక ప్రస్తుతం ఎంతో ఖరీదైన టమాటాలను కూడా కుమార్తె నిలువెత్తు సమర్పించారు.

51 కేజీల టమాటాలతో కుమార్తె నిలువెత్తు తులాభారం అప్పారావు దంపతులు నూకాలమ్మకు సమర్పించారు. అమ్మవారి నిత్యాన్నదానంలో ఉపయోగిస్తామని నూకాలమ్మ దేవస్థాన అధికారులు తెలిపారు. మార్కెట్‌లో టమాటాల ధర కేజీ రూ. 120-150 ఉండటంతో తులాభారం నిర్వహించే సమయంలో దర్శనానికి వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు. టమాటాల రేటు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ తులాభారంకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ ఆసక్తిగా మారాయి. ఇక టమాటాలపై జోకులు, మీమ్స్, దొంగతనాలకు సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Also Read: Wimbledon Final 2023: వింబుల్డన్‌ ఫైనల్లో ఓడిన జొకోవిచ్‌.. ఛాంపియన్‌గా యువ సంచలనం అల్కరాస్‌!

Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Show comments