NTV Telugu Site icon

Tomato Price: దేశంలో భారీ వర్షాలు… డబుల్ సెంచరీ దిశగా టమాటా ధరలు

Tomato Prices

Tomato Prices

Tomato Price: దేశమంతటా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో టమాటా, ఇతర కూరగాయల ధరలకు ఊరట లభించదన్న స్పష్టమైన సంకేతాలు అందాయి. దీంతో పాటు టమాటా ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో టమాటా హోల్‌సేల్ ధర కిలో రూ.150కి చేరుకోవచ్చని చెబుతున్నారు. అంటే మరికొద్ది రోజుల్లో టమాటా ధర రూ.200 వరకు చేరవచ్చు. దీన్ని బట్టి టమాటా ధరలు ఏ కొత్త స్థాయికి చేరుతాయో మీరు ఊహించవచ్చు. వాస్తవానికి, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీని కారణంగా హార్వెస్టింగ్, లాజిస్టిక్స్‌లో ఆటంకం ఏర్పడింది.

ఉత్తర భారతదేశంలోని కొండ ప్రాంతాలలో రికార్డు స్థాయిలో వర్షాల కారణంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోసకాయ, ఆకు కూరలు మొదలైన కూరగాయలు కూడా ఖరీదైనవిగా మారవచ్చు. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికం తదితర పంటలు ఎక్కువగా నష్టపోతాయని బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్‌కే సింగ్ తెలిపారు. నీటి ఎద్దడి, వైరస్‌, విల్ట్‌ వల్ల పంట కుళ్లిపోతుందని, దీని వల్ల ధరలు విపరీతంగా పెరుగుతాయన్నారు. ఈ సీజన్‌లో హిమాచల్ క్యాబేజీ, క్యాలీఫ్లవర్,క్యాప్సికమ్‌లను ఢిల్లీకి మాత్రమే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాలకు ప్రధాన సరఫరాదారు. కూరగాయల ధరల కారణంగా వినియోగదారులు పప్పు దినుసుల వైపు మొగ్గు చూపుతున్నారని సింగ్ అన్నారు. ఇప్పటికే పెరిగిన పప్పుల ధరలపైనా దీని ప్రభావం కనిపిస్తోంది.

Read Also:OPPO Reno 10 Series Launch: నేడే ఒప్పో రెనో 10 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!

హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో గత వారం భారీ వర్షాలు కురిశాయి. జూలై 8న ఢిల్లీలో 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ల్యాండ్ స్లైడ్ కారణంగా అనేక ప్రధాన రహదారులు మూసివేయబడినందున, పర్వతాల నుండి మైదాన ప్రాంతాలకు పండ్లు, కూరగాయల రవాణా నిలిచిపోతుంది. భారీ వర్షాల కారణంగా ఉత్తర భారత రాష్ట్రాల నుంచి స్థానికంగా సరఫరా తగ్గే అవకాశం ఉన్నందున వారం రోజుల్లో టమాట టోకు ధరలు కిలోకు రూ.140-150 పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నామని ఢిల్లీలోని ఆజాద్‌పూర్ హోల్‌సేల్ టమోటా వ్యాపారి అమిత్ మాలిక్ అన్నారు.

గత ఏడాది నష్టాల కారణంగా సాగుదారులు పంటసాగు తగ్గించడంతో ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని హోల్‌సేల్ మార్కెట్‌లలో కిలోకు రూ.40-110, రిటైల్‌లో కిలో రూ.100-160గా ఉంది. బెంగళూరులో కూడా ఈ ఏడాది పంట తగ్గింది. గతంలో అకాల వర్షాల కారణంగా వైరల్ వ్యాధుల బారిన పడడంతో బెంగళూరులో టమోటా ఉత్పత్తి తగ్గిందని సింగ్ చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, షోలాపూర్, పూణే, నాసిక్, సోలన్ వంటి ఇతర ప్రాంతాల నుండి టమోటాలు రావడం ప్రారంభమయ్యే ఆగస్టు తర్వాత మాత్రమే టమోటా ధరలలో తగ్గుదల కనిపించవచ్చు.

Read Also:Lashkar Bonalu: రెండోరోజు లష్కర్ బోనాలు.. రంగంలో ఎన్నికలపై అమ్మ ఏం చెప్పనుంది..!