Tomato Prices Fall Down: టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లే వస్తున్నాయి. కస్టపడి శ్రమించి పండించిన రైతులకు నష్టాలే మిగిలాయి. పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుర్భర పరిస్థితి ఏర్పడింది. మూడు నెలల క్రితం 60 రూపాయలు పలికిన కిలో టమోటా ఇప్పుడు కిలో రూపాయికి కూడా కొనేవారు కరువయ్యారు. మద్దతు ధర లేక టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికవచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలు లేక కొందరు అలాగే వదిలేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో.
Union Budget 2026: ఇళ్ల ధరలు తగ్గుతాయా? బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మిడిల్‌క్లాస్
మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. గత మూడేళ్లుగా టమాటా సాగులో నష్టాలను ఎదుర్కొంటున్నారు రైతులు ధరలు ఎప్పుడు పెరుగుతాయో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మదనపల్లి డివిజన్ లో 1400 హెక్టార్లలో రైతులు టమాటా సాగు చేస్తున్నారు. మదనపల్లి మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరుతో పాటు ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలకు టమాటా ఎగుమతి అవుతోంది. నిత్యం 300 నుంచి 600 టన్ల వరకు టమాటో ఎగుమతి చేస్తారు. నెల క్రితం టమాటో కిలో 60 వరకు ధర పలికింది.
బయట ప్రాంతాలలో కూడా టమాటా సాగు అవుతూ ఉండడంతో మదనపల్లి మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. రెండు వారాలుగా నాణ్యమైన టమాటా కిలో 15 రూపాయలు పలికితే ఇప్పుడు 7 రూపాయలకు పలుకుతోంది. మూడో రకం టమాటా కిలో ఒక్క రూపాయి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పంటని ఏం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడ్డారు రైతులు. ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి కారణం పక్కనే ఉండే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటో భారీగా సాగు అవుతూ ఉండడమే. దీంతో టమోటా కొనేందుకు ఏపీకి ఎవరూ రావడం లేదు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ టమోటా పంట బాగా దిగుబడి రావడంతో అక్కడ వ్యాపారులు మదనపల్లి వైపు చూడడం లేదు. దీంతో మదనపల్లె మార్కెట్ కు టమాటా విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు ట్రాన్స్పోర్ట్ కూలీ ఖర్చులు కాదు కదా తిరుగు ప్రయాణం చార్జీలకు కూడా డబ్బులు రావడం లేదు.
Gold Rush: బంగారం, వెండి కొనుగోలుకు జనం పరుగులు.. షాపుల ముందు క్యూ కట్టి మరీ!
ఈ ధరల వలన రైతుకి ఎటువంటి లాభం లేదు. కష్టపడి పండించిన పంటను కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో టమోటో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పతనం అవుతాయని అంచనా వేస్తున్నారు.
