NTV Telugu Site icon

Tomato Price: దిగొస్తున్న టమాటా ధరలు.. మదనపల్లి మార్కెట్లో కిలో ధర ఎంతంటే..!

Tomato

Tomato

గత కొన్నిరోజులుగా టమాటా ధరలు పెరిగిన విషయం అందరికి తెలిసిందే. కేవలం ఒకటి, రెండు చోట్ల అని కాకుండా.. దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడిప్పుడే చాలా చోట్ల టమాటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక టమాటా మార్కెట్ కు ఫేమస్ అయిన మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ యార్డులో టమాట ధరలు భారీగా తగ్గాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్‌కు టమాటాలు భారీగా వస్తుండటంతో క్రమంగా టమాటా ధర దిగివస్తుంది.

Ambati Rambabu: శునకానందం పొందొద్దని నీ మాజీకి చెప్పు.. రేణు దేశాయ్ కు అంబటి వార్నింగ్

మరోవైపు మదనపల్లె టమోటా మార్కెట్ లో కూడా.. గత నెలలో టమాటా ధరలు భారీగానే పలికాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ‘ఏ’ గ్రేడ్ టమాటా కిలో ధర గరిష్టంగా.. రూ. 196 పలికింది. బుధవారం రోజున మదనపల్లె మార్కెట్ లో టమాటా కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికింది. ఇక నిన్నటితో పోలిస్తే ఈ రోజు మరింత ధరలు దిగొచ్చాయి. గ్రేడ్ ‘ఏ’ టమాటాలు కిలో రూ. 50 నుంచి రూ. 64 వరకు పలికింది. గ్రేడ్ ‘బి’ రూ. 36 నుంచి రూ. 48 వరకు పలికింది. సగటున కిలోకు రూ. 44 నుంచి రూ.60 మధ్య రైతుల నుంచి వ్యాపారులు టమాటాలు కొనుగోలు చేసినట్లు మార్కెట్ యార్డ్ కార్యదర్శి తెలిపారు.