Tomato Price Drop: 2 రూపాయలకు పడిపోయిన టమోటా ధర.. లబోదిబోమంటున్న రైతన్నలు!

  • కూరగాయల రారాజు టమోటా ధరల పతనం
  • అనకాపల్లి జిల్లా రైతులకు తీవ్ర నష్టాలు
  • రోడ్లపైనే టమోటాలు పారబోసి నిరసన
Tomato Price Drop

Tomato Price Drop

Tomato Price Drop in Devarapalli Market: కూరగాయల రారాజు టమోటా ధరల పతనం అనకాపల్లి జిల్లా రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. కేజీ ధర రెండు రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్‌కు పంటను తెచ్చిన అన్నదాతాలకు తీవ్ర నిరాశే ఎదురైంది. కోత ఖర్చులు కూడా రాకపోవడంతో.. రోడ్లపైనే టమోటాలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు.

Also Read: Bobbillanka Murder: బొబ్బిల్లంకలో జంట హత్యలు.. భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి

దేవరపల్లి మండలంతో పాటు ఇతర చోట్ల పండే పంటను దేవరాపల్లి నుంచి వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది టమోటా పంట సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సరిగ్గా పంట చేతికి వచ్చేసరికి ధరలు దగా చేశాయి. పంట సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడి కూడా ఎక్కువగా ఉంది. దాంతో టమోటా ధర భారీగా పడిపోయింది. ఆమధ్య కిలో టమోటా రూ.20-30 పలికిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధర ప్రకటించి టమాటాలను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అలానే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని కోరారు.