Tomato Farmers in Crisis: ఆరుగాలం కష్టపడి లక్షల రూపాయల ఖర్చు చేసి టమాటా సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు.. ప్రస్తుతం ఏపీలో టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే టైంలో గిట్టుబాటు ధరలు లభించక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమోటా ధర దారుణంగా పడిపోయింది. కిలో 2 రూపాయలు కూడా పలకడం లేదు. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా రాకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించిన గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
READ MORE: Maruthi: మా ప్రతీ సినిమా ఆడడానికి కారణం ఎస్కేఎన్!
రెండ్రోజుల కిందట నంద్యాలలోని ప్యాపిలి మార్కెట్లో సైతం టమోటా ధర భారీగా పతనమైంది. ఈ మార్కెట్‌లో కిలో మొదటి రకం పది రూపాయలు కాగా, మీడియం రకం కేవలం మూడు రూపాయలు మాత్రమే పలికింది. ఈ నెల 6న కిలో టమోటా ఇదే మార్కెట్లో 30 రూపాయలు కాగా, 7న రూ.20 ధర పలికింది. నిన్న సాయంత్రం పది రూపాయలకు పడిపోవడంతో టమోటా రైతులలో ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టం చేసి పండించిన పంటకు ధర లేకపోవడంతో నష్టాలు తప్పవంటూ పాపం టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
