NTV Telugu Site icon

Chinni Krishna: ప్రముఖ రచయిత చిన్నికృష్ణ ఇంట విషాదం!

Writer Chinni Krishna

Writer Chinni Krishna

ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ ఇంట విషాదం నెలకొంది. చిన్ని కృష్ణ తల్లి లక్ష్మి సుశీల (75) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తెనాలిలో మృతి చెందారు. నేటి సాయంత్రం స్వగ్రామం తెనాలిలో సుశీల గారి అంత్యక్రియలు జరగనున్నాయి. టాలీవుడ్ నుంచి పలువులు ప్రముఖులు సుశీల మరణం పట్ల సంతాపం తెలిపారు.

Also Read: Axar Patel: తండ్రైన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌.. విషయం ముందే చెప్పిన రోహిత్!

చిన్ని కృష్ణకు తల్లి లక్ష్మి సుశీలతో అనుబంధం ఎక్కువ. ఈ విషయాన్ని ఆయన కవితల రూపంలో ఎన్నోసార్లు చెప్పారు. అమ్మప్రేమ గొప్పతనాన్ని తెలుపుతూ.. చిన్ని కృష్ణ ఎన్నో కవితలు రాశారు. ‘జన్మ జన్మలకు నీకే జన్మించాలని ఉందమ్మా’ అంటూ మదర్స్‌డే రోజు చిన్ని కృష్ణ ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేశారు. పలువురు సినీ సెలబ్రిటీలు చిన్ని కృష్ణ తల్లి మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా పోస్టులు పెట్టారు.