NTV Telugu Site icon

Tollywood Upcoming Multistarrer: టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్.. ముగ్గురు హీరోలు కలిసి సినిమా!

Ravi Teja, Vishwak Sen

Ravi Teja, Vishwak Sen

Ravi Teja, Vishwak Sen and Manchu Manoj will act in UpComing Tollywood Multistarrer: టాలీవుడ్‌లో ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు చాలా తక్కువ. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అగ్ర హీరోలు వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేశారు. వెంకటేష్-మహేష్, వెంకటేష్-పవన్ కాంబోలో సినిమాలు వచ్చాక ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలే వస్తున్నాయి. వెంకటేష్-నాగ చైతన్య, వెంకటేష్-వరుణ్ తేజ్, ప్రభాస్-రాణా దగ్గుబాటి, పవన్-రాణా దగ్గుబాటి, శర్వానంద్-సిద్ధార్థ్, జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్, చిరంజీవి-రామ్ చరణ్, చిరంజీవి-రవితేజ కలిసి నటించారు. అయితే ఇప్పుడు ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా రానుందట. ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోలు నటించనున్నారని సమాచారం తెలుస్తోంది.

టాలీవుడ్‌లో రానున్న భారీ మల్టీస్టారర్ సినిమాలో రవితేజ, మంచు మనోజ్, విశ్వక్ సేన్ కలిసి నటించనున్నారట. ‘కలర్ ఫోటో’ సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరక్టర్ సందీప్ రాజ్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అప్డేట్ రానున్నట్లు టాక్. ఈ మల్టీస్టారర్ సినిమాలో మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. రవితేజ, విశ్వక్ సేన్ పాత్రలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయట.

రవితేజ, విశ్వక్ సేన్ కాంబినేషన్ వింటేనే ‘పవర్‌ ప్యాక్’ పెర్ఫామెన్స్ గుర్తొస్తుంది. మరి వీళ్లిద్దరికీ మంచు మనోజ్ తోడైతే సినిమా ఎలా ఉంటుందో?. ప్రస్తుతం రవితేజ, విశ్వక్ సేన వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్.. ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఇక సందీప్ రాజ్‌కు దర్శకుడిగా ఇది రెండో సినిమా కానుంది. ఈ కాంబో కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Niharika-Chaitanya Divorce: నిహారిక-చైతన్య విడాకులు.. ముందుగా పిటిషన్‌ వేసింది ఎవరో తెలుసా?

Also Read: Ajit Agarkar BCCI Chairman: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్.. కుర్రాళ్లపై ఫోకస్!

 

Show comments